Reading Time: 2 mins

 

హీరో మూవీ రివ్యూ

రిషభ్‌శెట్టి ‘హీరో’ రివ్యూ
Rating: 2.5/5

వేరే భాషల్లో సక్సెస్ అయిన చిత్రాలను వరసపెట్టి తెలుగు ప్రేక్షకులకు  అందిస్తోంది ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’. ఇప్పటికే అనేక చిత్రాలు రిలీజ్ అయ్యి  జనాదారణ పొందాయి.  కాగా, మరో కన్నడ బ్లాక్‌ బస్టర్‌  ‘ఆహా’లో విడుదల అయ్యింది. రిషభ్‌శెట్టి కీలక పాత్రలో భరత్‌రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హీరో’. ఈ ఏడాది మార్చిలో కన్నడ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో ‘హీరో’ పేరుతోనే అలరించేందుకు వచ్చింది. ‘బెల్‌బాటమ్‌’ చిత్రంతో తెలుగువారికి సుపరిచితుడైన నటుడు రిషభ్‌శెట్టి ఇందులో నటించారు. బ్లాక్‌ కామెడీ జానర్ లో  రూపొందించిన ఈ సినిమా ఎలా ఉంది..కథేంటి..చూడదగ్గ సినిమాయేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్
లవ్ ఫెయిల్యూర్ అయిన  హీరో(రిషభ్‌శెట్టి) ఓ  బార్బర్‌ షాపులో పనిచేస్తుంటాడు. తన ప్రేమను కాదంది అని హీరోయిన్‌(గన్వి లక్ష్మణ్‌)పై పగ పెంచుకుంటాడు. ప్రతీకారం తీర్చుకోవాలనకుంటాడు. అందుకోసం మర్డర్ చేయాలనుకుంటాడు.  ఆమె మాఫియా హెడ్ అయిన విలన్‌(ప్రమోద్‌శెట్టి)ను పెళ్లి చేసుకుంటుంది. విలన్ పై ఎటాక్ చేయటం కష్టం. ఎందుకంటే  ఊరికి దూరంగా ఫామ్‌ హౌస్‌లో రౌడీ బ్యాచ్ తో ఉంటూంటాడు విలన్. అతని ఫర్మిషన్ లేకుండా పురుగు కూడా ఆ ప్రాంతంలోకి ప్రవేశించ లేదు.ఈ సిట్యువేషన్ లో  విలన్‌కు హెయిర్‌కట్‌ చేయడానికి హీరో వెళ్లాల్సి వస్తుంది. పనిలో పనిగా హీరోయిన్‌ను చంపేస్తే  తన పగ కూడా తీర్చుకున్నట్లు ఉంటుందని ప్లాన్ చేస్తాడు. ఆ బంగ్లాకు వెళ్లాక అసలు కథ మొదలవుతుంది. రకరకాల మిస్ ఎడ్వెంచర్స్ జరుగుతాయి. ఏదీ సవ్యంగా జరగదు. ఈ క్రమంలో తను అనుకున్న ది హీరో చేసాడా…  విలన్‌ ఊరుకున్నాడా..ఏం చేసాడు?  హీరో-హీరోయిన్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి?

ఎలా ఉంది.

  ‘కేజీఎఫ్‌’తో ఇప్పుడిప్పుడే కన్నడ ఇండస్ట్రీ గురించి యావత్‌ దేశానికి తెలుస్తోంది. అక్కడ కూడా మంచి ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్నాయి. అలా వచ్చిన వాటిలో బాక్సాఫీస్‌ వద్ద విజయవంతమైన చిత్రం ‘బెల్‌  బాటమ్‌’. దాన్ని ఆహా ఓటీటిలో వదిలితే మనోళ్లకు తెలిసింది. ఆ తర్వాత అదే హీరో రిషభ్‌శెట్టి చేసిన చిత్రం ఇది.  ఈ చిత్రం ట్రైలర్ ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది. ఎక్సపెక్టేషన్స్ పెంచింది. సాధారణంగా మనకు బ్లాక్ కామెడీలు అరుదే. ఇంటీరియర్ కర్ణాటకలో మాఫియా హెడ్ ఇంట్లో జరిగే కథగా చక్కగా తీర్చిదిద్దాడు. చాలా వరకూ అంచనాలకు రీచ్ అయ్యిందనే చెప్పాలి. కామెడీ ఆఫ్ ఎర్రర్స్ లతో ఈ సినిమా నిండిపోయింది. చాలా సార్లు విపరీతంగా నవ్వు వస్తుంది. ఫస్టాఫ్ అంతా హీరో,హీరోయిన్ లవ్ స్టోరీ తో నడిపాడు. అదో జాయ్ రైడ్ లా ఉంటుంది. సీన్స్ స్లోగా ఉన్నా సరదాగా ఉండటంతో ఇబ్బంది అనిపించవు. తెలుగు డబ్బింగ్ కూడా బాగా రాసారు. ఇక సెకండాప్ సీక్వెన్స్ ఇంకొంచెం టైట్ చేస్తే బాగుండేది. అయితే క్లైమాక్స్ ,ప్రీ క్లైమాక్స్ లో సర్దుకున్నారు. హీరో..విలన్ డెన్ లోకి వెళ్లిన తర్వాత ఏం చేస్తాడు? అన్నటెన్షన్ సినిమా మొత్తం నడిపిస్తుంది. హీరోయిన్‌ను నిజంగా చంపేస్తేడేమో అనే మూవ్ మెంట్ వచ్చే ట్విస్ట్ బాగుంటుంది.  ఆ తర్వాత విలన్‌ మనుషులు హీరో, హీరోయిన్‌లను పట్టుకునేందుకు ప్రయత్నించడం, వారి నుంచి తప్పించుకుని పారిపోయే ఛేజింగ్‌ సీన్లు ఫన్నీగా ఉండి నవ్విస్తాయి. అయితే, ఇంకాస్త వాటిలో టెన్షన్ ఎలిమెంట్ ని కూడా కలిపి తీర్చిదిద్దాల్సింది. ఆ సినిమాలో మరో విశేషం ఏమిటీ అంటే ఏ  పాత్రకీ పేర్లు ఉండవు. హీరో,హీరోయిన్ ,విలన్ ఇలాగే ఉంటాయి.

టెక్నికల్ గా…
మంచి స్టాండర్డ్స్ తో సినిమా తీసారు. ఒకే లొకేషన్ లో సినిమా పూర్తైనా మనకు ఆ ఫీల్ ఎక్కడా రాదు.  అజనీశ్‌ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఫైట్‌, ఛేజింగ్‌ సీన్లను నెక్ట్స్ లెవిల్ అన్నట్లుగా చేసింది. అరవింద్‌ ఎస్‌.కశ్యప్‌ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. ప్రతీక్‌ శెట్టి ఎడిటింగ్‌ లాగ్ లు లేకుండా బాగుంది. సినిమా లెంగ్త్ కూడా రెండు గంటలు కావటంతో విసిగించలేదు. డైరక్టర్ గా ఎం.భరత్‌రాజ్‌ తీసుకున్న పాయింట్‌ కొత్తగా ఉండటం.దానికి కొత్త తరహా ట్రీట్మెంట్ అన్ని ఫెరఫెక్ట్ గా కుదిరేయి.

 

చూడచ్చా
కొత్త తరహా సినిమా చూడాలనుకునే వాళ్ళకు ఇది ఫెరఫెక్ట్ ఛాయిస్

ఎవరెవరు..

నటీనటులు: రిషభ్‌ శెట్టి, గన్వి లక్ష్మణ్‌, ప్రమోద్‌శెట్టి, అనిరుధ్‌ మహేశ్‌, ప్రదీప్‌ శెట్టి, మంజునాథ్‌ గౌడ తదితరులు;
సంగీతం: బి.అజనీశ్‌ లోకనాథ్‌;
సినిమాటోగ్రఫీ: అరవింద్‌ ఎస్‌.కశ్యప్‌;
ఎడిటింగ్‌: ప్రతీక్‌శెట్టి;
నిర్మాత: రిషభ్‌శెట్టి;
రచన: ఎం. భరత్‌ రాజ్‌, అనిరుధ్‌ మహేశ్‌;
దర్శకత్వం: ఎం.భరత్‌రాజ్‌;
విడుదల తేదీ: 24,జూలై 2021
రన్ టైమ్:2గం|| 4ని||
ఓటీటి: ఆహా