Reading Time: 2 mins

హీరో వి జె సన్నీ ఇంటర్వ్యూ

అన్ స్టాపబుల్ నాన్ స్టాప్ ఫన్ రైడ్ ఎక్కడా బోర్ కొట్టదు: హీరో వి జె సన్నీ

పిల్లా నువ్వు లేని జీవితం, సీమ శాస్త్రి, ఈడోరకం ఆడోరకం వంటి హాస్య ప్రధాన చిత్రాలతో రచయితగా తనదైన ముద్ర వేసుకున్న డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన హిలేరియస్ ఎంటర్ టైనర్ అన్ స్టాపబుల్. అన్ లిమిటెడ్ ఫన్ అన్నది ఉపశీర్షిక. బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు. ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ లో రజిత్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూన్ 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో హీరో వి జె సన్నీ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

బిగ్ బాస్ తర్వాత ఎలాంటి అవకాశాలు వచ్చాయి?
బిగ్ బాస్ తర్వాత కొత్త నిర్మాణ సంస్థల నుంచి చాలా మంది సంప్రదించారు. అయితే కథలన్నీ ఎక్కువగా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ వున్నవే వచ్చాయి. నాకు కామెడీ, థ్రిల్లర్, హారర్ కామెడీ కథలు చేయాలని ఉండేది. పక్కింటి కుర్రాడిలా అనిపించే పాత్రలు చేయాలని ఉండేది. ఇలాంటి సమయంలో అన్ స్టాపబుల్ లాంటి అన్ లిమిటెడ్ ఫన్ కథ విన్నాను. చాలా నచ్చింది. కథ విన్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. కథని నమ్మి చేసిన చిత్రమిది.

ఇందులో చాలా మంది సీనియర్ నటీనటులు ఉన్నారు కదా వాళ్లతో పని చేయడం ఎలా అనిపించింది ?
చాలా ఫ్రెండ్లీగా చేశాం. అందరూ చాలా మంది కంఫర్ట్ జోన్ కల్పించారు. పృద్వీ గారితో మంచి స్నేహం ఏర్పడింది. అలాగే పోసాని గారు, రాజా రవీంద్ర గారు, రఘు గారు ఇలా అందరితో పని చేయడం మంచి అనుభూతి. నన్ను ఎప్పుడూ కొత్తవాడిలా ట్రీట్ చేయలేదు. నేను నాటకరంగం నుంచి రావడం కూడా ప్లస్ అయ్యింది.

సప్తగిరితో పని చేయడం ఎలా అనిపించింది?
సప్తగిరి చాలా ఎనర్జిటిక్. సీన్ లో ఆయన ఉండే ఇన్వాల్వ్ మెంట్ నెక్స్ట్ లెవల్ వుంటుంది. సీన్ ఇచ్చిన వెంటనే ఆయన ఒక ప్లాన్ లో వుంటారు. ఆ ప్లాన్ ని మనం క్యాచ్ చేసుకోవాలి. తనని పరిశీలించాను కాబట్టి అతనకి తగట్టు నేను వెళ్లాలని డిసైడ్ అయిపోయాను. చాలా స్పోర్టివ్ స్పిరిట్ తో వర్క్ చేశాం.

ఇందులో చిచ్చా మచ్చాలు గా కనిపిస్తాం. సినిమా అంతా తను నాతో పాటే వుంటారు. మేము ఇద్దరం ఎలాంటి పరిస్థితులు ఎదురుకుంటాం, దాని నుంచి ఎలా బయటకి వచ్చాం, డబ్బు అనేది మా జీవితాలతో ఎలా ఆడుకుందనేది కథ. అన్ స్టాపబుల్ లో మంచి స్టొరీ లైన్ వుంది. చివరి వరకూ ఫన్ రైడ్ వుంటుంది. ప్రతి పాత్ర కామెడీ పంచుతుంది. ఎక్కడా బోర్ కొట్టించకూడదనే ఉద్దేశంతో చేసిన చిత్రమిది.

ఇందులో మీ జంటగా కనిపించేది ఎవరు ?
నక్షత్ర. తను ఇంతకుముందు పలాస అనే సినిమా చేశారు. తను తెలుగమ్మాయి కావడం వలన సెట్స్ లో ఉన్నప్పుడు ప్రామ్టింగ్ ఇచ్చే అవసరం వుండేది కాదు. చాలా చక్కగా నటించారు.

కామెడీ ఎంటర్ టైనర్ చేయడం ఇదే తొలిసారి కదా సవాల్ గా అనిపించిందా?
లేదు. చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా చేశా. నాకు కెమెరా కొత్తకాదు. కెమెరా నటన అలవాటే కాబట్టి చాలా ఎంజాయ్ చేశా. కెమెరా ముందుకు వెళితే తెలియని ఎనర్జీ వచ్చింది.

అన్ స్టాపబుల్ టైటిల్ పెట్టడానికి కారణం?
నేను బాలకృష్ణ గారికి పెద్ద అభిమానిని. అలాగే ఆ షో కి కూడా. ఈ టైటిల్ పెట్టాక డైరెక్టర్ రత్నబాబు గారికి అడిగినాను. మన టైటిల్ అన్ స్టాపబుల్ అన్ లిమిటెడ్ ఫన్ ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే టైటిల్ జనాల్లో వుంది కాబట్టి అన్ స్టాపబుల్ యాప్ట్ గా ఉంటుందని చెప్పారు.

డైమండ్ రత్నబాబు గారితో పని చేయడం అనిపించింది?
బిగ్ బాస్ తర్వాత దాదాపు ముఫ్ఫై కథలు విన్నాను. ఇందులో డైమండ్ రత్నబాబు గారు చెప్పిన కథ చాలా నచ్చింది. కథని బలంగా నమ్మి చేసిన చిత్రమిది. రత్నబాబు గారు కూడా చాలా స్వేచ్ఛ ఇచ్చారు. దర్శకుడు, నిర్మాత, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరం టీం వర్క్ గా ఈ సినిమా చేశాం.

భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు, పాత్రలు చేయాలని అనుకుంటున్నారు ?
ఎటీఎం చూసి దర్శకుడు హరీష్ శంకర్ గారు ప్రశంసించారు. ఆయన ప్రశంస నాలో ఇంకా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఏ పాత్రనైనా చేయగలననే నమ్మకం వుంది. నేను ఏ పాత్ర చేయడానికైనా సిద్ధంగా వున్నాను. ఒక ఆర్టిస్ట్ గా ముందుకు వెళ్లాలని ఉంది. హీరోగా చేస్తూనే ఓ పెద్ద హీరో సినిమాలో చిన్న క్యారెక్టర్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను.

కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
రెండు సినిమాలు జరుగుతున్నాయి. ఒకటి ఫన్, మరొకటి సస్పెన్స్ థ్రిల్లర్.