హీరో శ్రీసింహా కోడూరి ఇంటర్వ్యూ
మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రను ఉస్తాద్ సినిమాలో చేయటం ఛాలెంజింగ్‌గా అనిపించింది – హీరో శ్రీసింహా కోడూరి
టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీ సింహ కోడూరి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఉస్తాద్. కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్. వారాహి చలనచిత్రం, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యార్స్‌పై ఫణిదీప్ దర్శకత్వంలో రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 12న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో శ్రీసింహా కోడూరి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు..
మత్తువదలరా సినిమా కథ విని ఓకే చెప్పిన కథ ఈ ఉస్తాద్. అయితే షూటింగ్స్ ఆలస్యం కావటం వంటి కారణాలతో ఇప్పుడు అన్నీవరుసగా విడుదలవుతున్నట్లు అనిపిస్తున్నాయి.
దర్శకుడు ఫణిదీప్ క్యారెక్టర్స్‌ను చక్కగా డిజైన్ చేసుకున్నారు. సూర్య అనే యువకుడి పాత్రలో కనిపిస్తాను. ఇప్పటి వరకు నేను చేసిన నాలుగు సినిమాల్లో ఇది నా క్యారెక్టర్ మీదనే రన్ అవుతుంది. ఎమోషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. నటుడిగా సంతృప్తిని ఇచ్చిన సినిమా.
ఒక పనిలో ఎక్స్‌పర్ట్‌ని మనం ఉస్తాద్ అని పిలుస్తుంటాం. ఇది ఉర్దూ పదం. గురువును కూడా ఉస్తాద్ అని పిలుస్తుంటాం. ఈ సినిమా విషయానికి వస్తే.. ఇందులో హీరో తన ఎమోషన్స్‌ను బైక్ వల్ల కంట్రోల్ చేసుకోగలుగుతాడు. హీరోకి లైఫ్‌లో బైక్ వల్ల చాలా విషయాలు జరుగుతాయి. అందుకనే హీరో తన బైక్‌నే ఉస్తాద్ అని పిలుచుకుంటుంటాడు. సినిమాలో హీరోకి కోపం ఎక్కువగా వస్తుంటుంది. లైఫ్‌లో ఎలాంటి గోల్ ఉండదు. అలాంటి వ్యక్తి బైక్ వల్ల ఎలా సరైన దారిలో పడ్డాడనేదే కథ.
సూర్య కాలేజ్ సమయంలో ఎలా ఉంటాడు, కాలేజ్ తర్వాత లైఫ్‌లో ఏం చేయాలో తెలియని స్థితి. ఫైలట్ అయిన తర్వాత తన లైఫ్ ఎలా సాగుతుందనేది చూడొచ్చు.
కాలేజ్ కుర్రాడి పాత్ర చేస్తున్నప్పుడు ఎక్సర్‌సైజులు, స్పెషల్ డైట్ తీసుకుని బరువు తగ్గాను. ఇక మరో పాత్ర కోసం గడ్డం, జుట్టు పెంచాను.
గౌతమ్ వాసుదేవ్ మీనన్‌గారు చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు. ప్రేక్షకులకు ఆయన రోల్ బాగా నచ్చుతుంది. జూనియర్స్‌ను చులకనగా చూసే ఓ సీనియర్ ఫైలట్ రోల్‌లో ఆయన కనిపిస్తారు. ఆయన చేయటం వల్ల ఆ పాత్రకు కొత్తదనం వచ్చింది. అంతే కాకుండా ఆయనకు మా డైరెక్టర్ పెద్ద ఫ్యాన్.
మూడు వేరియేషన్స్‌లో కనిపించటం అనేది ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఎందుకంటే ఏజ్‌కు తగ్గట్లు బాడీ లాంగ్వేజ్‌లోనూ తేడా తీసుకురావాలి.
మంచి కథలను ఎంచుకోవటం అనేది నా చేతుల్లోనే ఉంటుంది. కెరీర్ ప్రారంభంలోనే డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న సినిమాలు చేయటం మంచి విషయమే. నేను చేసే సినిమాల గురించి రాజమౌళిగారు చెబుతుంటారు. నాన్న, బాబాయ్ సహా ఇంట్లోని వారందరూ వారి ఆలోచనలను చెబుతుంటారు. స్క్రిప్ట్ సెలక్షన్స్‌లో నాకేదైనా డౌట్ ఉంటే కార్తికేయ, భైరవన్నను అడుగుతుంటాను.
మసూద రిలీజ్ కాకముందే కావ్యా కళ్యాణ్ రామ్‌ను హీరోయిన్‌గా తీసుకున్నాం. తనకు ఏం కావాలనే క్లారిటీ లేని కన్‌ఫ్యూజింగ్ అమ్మాయి పాత్రలో తను నటించింది.
సినిమా సినిమాకు చాలా విషయాలను నటన పరంగా ఇతర విషయాల పరంగానూ నేర్చుకుంటున్నాను.
డైరెక్టర్ ఫణిదీప్ మోస్ట్ ప్యాషనేట్ డైరెక్టర్. ముందు నుంచే ప్లాన్ ఏ, ప్లాన్ బీ అని రెడీ చేసుకుని ఉంటాడు. క్లారిటీ ఉన్న పర్సన్
ఉస్తాద్ రిలీజ్ తర్వాత కొత్త సినిమాలను ఒప్పుకుంటాను. ప్రస్తుతానికైతే కథలను వింటుంటాను.