అంజలీ టాకీస్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న శ్రీ లక్ష్మీ పిక్చర్స్ కొత్త చిత్రం అంజలీ టాకీస్
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ పై మరో నూతన చిత్రం సిద్ధమైంది. ప్రముఖ పంపిణీదారుడు, నిర్మాత బాపిరాజు నిర్మించిన ఈ చిత్రానికి అంజలీ టాకీస్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. నూతన తారలు గిరీష్, తాన్య తదితరలు నటించిన ఈ సినిమాను దర్శకుడు ఉదయ్ కుమార్ సిహెచ్ కంప్లీట్ హారర్ అండ్ అడల్ట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. లాక్ డౌన్ 5.0 లో థియేటర్స్ తెరుచుకోవడానికి కేంద్రం ఆమోదం తెలపిన నేపథ్యంలో తాజాగా అంజలీ టాకీస్ చిత్రాన్ని సెన్సార్ స్క్రీనింగ్ చేయించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అలానే సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత బాపిరాజు.బి తెలిపారు.
తారాగాణం
గిరీష్, తాన్యా, కావ్య, సత్యం, కిషోర్ కుమార్, తదితరులు
సాంకేతిక వర్గం
బ్యానర్ – శ్రీ లక్ష్మీ పిక్చర్స్
నిర్మాత – బాపీరాజు.బి
డీఓపి – రవికుమార్
మ్యూజిక్ – సందీప్
ఎడిటిర్ – జేబి
దర్శకత్వం – ఉదయ్ కుమార్ సిహెచ్