Reading Time: < 1 min

అంతిమ తీర్పు మూవీ ట్రైలర్‌ విడుదల

శ్రీకాంత్‌ చేతులమీదుగా అంతిమ తీర్పు ట్రైలర్‌ విడుదల

కబాలి ఫేం సాయి ధన్సిక, విమలారామన్‌, గణేష్‌ వెంకట్రామన్‌ ముఖ్య పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం అంతిమ తీర్పు. శ్రీసిద్ధి వినాయక మూవీ మేకర్స్‌ పతాకంపై డి.రాజేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఎ.అభిరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్‌ తదితర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం కానుంది. అంతిమ తీర్పు సినిమా ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్‌ తన నివాసంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా సక్సెస్‌ కావాలని ఆకాంక్షించారు.

నిర్మాత డి.రాజేశ్వరరావు మాట్లాడుతూ వినూత్న కథాంశంతో రూపొందిన చిత్రమిది. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. సాయిధన్సిక నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. అడగ్గానే మంచి మనసుతో మా సినిమా ట్రైలర్‌ విడుదల చేసిన శ్రీకాంత్‌గారికి కృతజ్ఞతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం అని అన్నారు.

నటుడు దీపు, బండి రమేష్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ట్రైలర్‌ విడుదల చేసిన శ్రీకాంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాను ఆదరించాలని కోరారు.

నటీనటులు:

సాయి ధన్సిక, విమలారామన్‌, గణేష్‌ వెంకట్రామన్‌, సత్యప్రకాశ్‌, అమిత్‌ తివారీ, దీపు, నాగమహేశ్‌ తదితరులు

సాంకేతిక నిపుణులు:

బ్యానర్: శ్రీ సిద్ది వినాయక మూవీ మేకర్స్
దర్శకుడు : ఎ.అభిరాము
సంగీతం : కోటి
సినిమాటోగ్రఫీ: ఎన్.సుధాకర్ రెడ్డి
ఎడిటర్: గ్యారీ బి హెచ్
నిర్మాత: డి.రాజేశ్వరరావు