Reading Time: 3 mins

అఖండ మూవీ రివ్యూ 

AK4.jpg

AK5.JPG

మాస్ సీన్ల దండ : బాలయ్య ‘అఖండ’రివ్యూ

Emotional Engagement Emoji (EEE) 
 
?
 
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింహా, లెజెండ్‌ సినిమాల తర్వాత వచ్చిన  హ్యాట్రిక్‌ మూవీ కావడంతో అఖండ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ అఖండ క్యారక్టర్ లో బాలయ్య డిఫరెంట్ గా కనపడటం, ట్రైలర్ లో చెప్పే డైలాగులు సినిమా పై ఎక్సపెక్టేషన్స్ ని నెక్ట్స్ లెలివ్ కు తీసుకెళ్ళాయి. ఈ నేఫధ్యంలో విడుదల అయిన ఈ చిత్రం ఎలా ఉంది..బాలయ్య గెటప్ కు రెస్పాన్స్ ఎలా వస్తోంది.శ్రీకాంత్ విలన్ గా సెట్ అయ్యాడా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

అనంత‌ర‌పురంలో… ముర‌ళీ కృష్ణ (బాల‌కృష్ణ‌) ప్యాక్షనిజంకు వ్యతిరేకంగా పోరాడుతూ,శాంతిని స్దాపించే పనిలో ఉంటాడు. అతని ఆలోచనలు ఆ జిల్లా కలెక్టర్  శ‌ర‌ణ్య (ప్ర‌గ్యా జైస్వాల్‌) ని ఎట్రాక్ట్ చేస్తాయి. దాంతో ప్రేమలో పడి పెళ్ళి చేసుకుంటారు. వాళ్ళకో పాప కూడ. ఇదిలా ఉండగా  అక్కడ లోకల్ మాఫియా వ‌ర‌ద‌రాజులు (శ్రీ‌కాంత్) మైనింగ్ మాఫియా రన్ చేస్తూంటాడు. అక్కడ యురేనియం నిక్షేపాల‌ను వెలికి తీసే పనిలో ఉంటాడు. యురేనియం నుంచి వచ్చే రేడియేష‌న్ తో ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌కు అనారోగ్య సమస్యలు వస్తూంటాయి. ఇది గమనించిన ముర‌ళీకృష్ణ ఈ మాఫియాకు అడ్డు పడతాడు. దాంతో వరదరాజులు  ముర‌ళీకృష్ఱ‌పై తన పలుకుబడితో చేయిని నేరం మోపి జైలుకు పంపుతాడు. కలెక్టర్ కు ఉద్యోగంలో సస్పెండ్ చేయిస్తాడు. వాళ్ళ పాపను చంపేయాలనుకుంటాడు. ఆ క్లిష్ట పరిస్దితిల్లో  అఖండ (బాల‌కృష్ణ‌) వస్తాడు. వరదరాజులుకు వాయి తీయించే పోగ్రామ్ పెట్టుకుంటాడు. ఇంతకీ  ఈ అఖండ ఎవ‌రు? ముర‌ళీకృష్ణ‌తో రిలేషన్ ఏమిటి? వ‌ర‌ద‌రాజుల వెనుక ఉన్నదెవరు? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
 
స్క్రీన్ ప్లే ఎనాలసిస్…

ఎప్పటిలాగే బోయపాటి ఈ సినిమాకు ఫైట్స్ డిజైన్ చేసుకుని..వాటి చుట్టూ కథ అల్లే ప్రయత్నం చేసాడు. అందుకోసం  ఓ అఘోరా పాత్రను క్రియేట్ చేసాడు. ఎక్కడ చూసినా రక్తపాతం తో రెచ్చిపోయారు. హీరో ఇంట్రడక్షన్, ఇంట్రవెల్, క్లైమాక్స్ ఫైట్ , అడుగడుక్కీ ఎలివేషన్స్ …వీటిపైనే దృష్టి పెట్టారు. ఇవెంత డిఫరెంట్ గా ఉండాలనేదే చూసుకున్నారు. ఇంట్రవెల్ దగ్గర వచ్చే ఫైట్ ఎపిసోడ్ అయితే చాలా లెంగ్తీ గా ఉంటుంది. ఫస్టాఫ్ ఎంత బోర్ కొడుతుందంటే…అఖండ ఎప్పుడొస్తాడా అని ఎదురుచూస్తూనే కూర్చుంటాము. వచ్చాక ..కథలో కదిలిక వస్తుందని భావిస్తాము. అయితే ఆ వచ్చిన పాత్ర కథలో ఫైట్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. ఎమోషన్స్ ని వదిలేస్తుంది. అఖండ పాత్ర వచ్చాక అప్పటిదాకా ఉన్న మురళి కృష్ణ పాత్ర మాయమైపోతుంది. కాకపోతే ఆ రెండో పాత్ర కూడా బాలయ్యే కావటం కలిసొచ్చే అంశం. సమకాలీన అంశాలు గుర్తు చేసేలా…గుళ్ల గురించి, హిందూ ధ‌ర్మం గురించీ  లెక్చ‌ర్లు ఇస్తూంటాడు అఖండ. సెకండాఫ్ లో ఫైట్స్ తీసేస్తే అసలు సినిమా కనిపించదు. అంతలా ఫైట్స్ ని అడుగడుగునా డిజైన్ చేసారు బోయపాటి.   ఎంత మాస్ కోసం ఫైట్స్ అయినా మరీ ఇన్ని పెడితే ఫైట్స్ అంటే ఎలర్జీ పుడుతుంది. ముఖ్యంగా ఫైట్స్ కు కూడా ఎమోషనల్ లీడ్ లేకపోతే విసుగొస్తుంది. అది మర్చిపోయారు. ఇక గా చెప్పుకోవటానికి ఏమీ లేదు. అలాంటి కథకు ఇంక స్క్రీన్ ప్లే ఏముంటుంది. గతంలో బోయాపాటి లెజండ్,సింహా లో స్క్రీన్ ప్లేనే ఇందులోనూ రన్ అవుతుంది. ఎక్కడా ట్విస్ట్ లు, టర్న్ లు, ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ఉండవు.
 

నటీనటులు ఫెరఫార్మెన్స్…

దర్శకుడుగా బోయపాటి శ్రీను కు వినయ విధేయ రామ చిత్రం  తర్వాత వచ్చిన చిత్రం ఇది. దాంతో కొంతవరకూ అతిశయోక్తులు తగ్గించాడు కానీ వదిలేయలేదు. స్టోరీ లైన్ చాలా చిన్నది పెట్టుకున్నాడు. కేవలం బాలయ్య మీదా, అఖండ గెటప్ పై ఆధారపడి చేసిన సినిమా  ఇది. కేవలం బాలయ్యను ఎలా చూపించాలి, స్టైలింగ్, లుక్స్ వీటిపైనే డిపెండ్ అయ్యారు. దర్శకుడుగా అక్కడ దాకా సక్సెస్ అయ్యాడు. విలన్  వరదరాజులుగా శ్రీకాంత్ ని తీసుకోవాలనుకోవటం గొప్ప విషయం . అయితే అది ఫార్ములాగా వెళ్లిపోయారు. ప్రేక్షకుడు ఊహకు అందేలా స్క్రిప్టు రాసుకున్నాడు.  ఫైట్స్ తోనే మాస్ ని మెలియెట్టాలనుకున్నాడు. చాలా వరకు సక్సెస్ అయ్యాడు కానీ పూర్తిగా కాలేదు. అందుకే ఫ్యాన్స్ కు నచ్చుతుందేమో కానీ మిగతా వాళ్లకు కష్టమనిపిస్తుంది.

టెక్నికల్ యాస్పెక్ట్ లో …

మిగతా టెక్నికల్ టీమ్ లో … థమన్ సంగీతం లో రెండు పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. బోయపాటి కు తగ్గ లౌడ్ గా ఉంది. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్ గా ఉంది. డైలాగులు కేవలం ఫ్యాన్స్ కోసమే రాసినట్లున్నారు. దేవుడు,హిందూ మతం గురించి చెప్పినవి మాత్రం బాగున్నాయి. ఎడిటింగ్ విషాయానికి వస్తే చాలా లెంగ్త్ ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
 
 ఇక బాలయ్య గురించి ఒకే మాట..టెర్రిఫిక్ అని చెప్పాలి. ఆయన లేకపోతే అసలు ఈ సినిమాని ఊహించలేము. ఇంత ఫార్ములా సినిమాని కూడా చూడగలగామంటే అది బాలయ్య ఎఫెక్టే.  స్టైలింగ్ కూడా ఫెరఫెక్ట్ గా వర్కవుట్ అయ్యింది. హీరోయిన్    ప్రగ్యా జైస్వాల్ …చేసేది కలెక్టర్ జాబ్ కానీ మంచి గ్లామర్ తో రచ్చ రచ్చ చేస్తూంటుంది. పూర్ణ సపోర్టింగ్ రోల్ కు బాగా సెట్ అయ్యింది.
 
శ్రీకాంత్ విషయానికి వస్తే…మేకోవర్ చాలా బాగుంది. కానీ విలన్ గా నటన సెట్ కాలేదు. నెక్ట్స్ లెవిల్ కు క్యారక్టర్ ని తీసుకెళ్లలేదు. జగపతిబాబు మొహమాటానికి ఆ పాత్ర చేసాడని అనిపిస్తుంది. సుబ్బరాజు పాత్ర అయితే అసలు పండలేదు. కాలికేయ ..క్రూరమైన పోలీస్ గా బాగా చేసారు.  మిగతా వాళ్లు గురించి చెప్పుకునేటంత స్క్రీన్ టైమ్ లేదు.



నచ్చేవి :

+ బాలయ్య గెటప్

+  శ్రీకాంత్ లుక్

+ యాక్షన్ ఎపిసోడ్స్

 +  బ్యాక్ గ్రౌండ్ స్కోర్

నచ్చనవి :

– లెంగ్త్

– మితిమీరిన హింస

– హీరోయిన్ ట్రాక్

– సరైన కాంప్లిక్ట్ లేని కథ


చూడచ్చా?

మీరు బాలయ్య ఫ్యాన్స్ అయితే బాగా నచ్చుతుంది.



తెర ముందు..వెనక

నిర్మాణ సంస్థ : ద్వారకా క్రియేషన్స్
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, జగపతి బాబు‚ అవినాష్, శ్రీకాంత్  తదితరులు
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : బోయపాటి శ్రీను
సంగీతం :  థమన్
సినిమాటోగ్రఫీ : సీ రాం ప్రసాద్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు
 రచన : బోయపాటి శ్రీను, ఎం. రత్నం (డైలాగ్స్)
విడుదల తేదీ : 02 ,డిసెంబర్ 2021
రన్ టైమ్ :2 hr 48 Mins