Reading Time: 2 mins
అట్టర్ ప్లాప్ రొమాంటిక్  చిత్రాల టైటిల్ పోస్టర్లు విడుదల
 
 
అట్టర్ ప్లాప్, రొమాంటిక్  చిత్రాల టైటిల్ పోస్టర్ ను విడుదల చేసిన నిర్మాత షకీల 
 
కె.ఆర్ ప్రొడక్షన్ పతాకంపై నూతన నటీనటులతో  రమేష్ కావలి దర్శకత్వంలో షకీల నిర్మిస్తున్న  అట్టర్ ప్లాప్, రొమాంటిక్  చిత్రాల టైటిల్ పోస్టర్ ను హైదరాబాద్ లో   ప్రముఖ నటి షకీల విడుదల చేశారు అనంతరం
 
 షకీల మాట్లాడుతూ* …తమ్ముడు రమేష్ చెప్పిన ఈ రెండు సినిమాలు నాకెంతో నచ్చాయి..అందరూ కొత్త వారితో ఈ సినిమాలు చేస్తున్నాము. ఈ రెండు సినిమాల్లో కూడా నా కూతురు మిలా హీరోయిన్ గా నటిస్తుంది.. గోవాలో అద్భుతమైన లోకేషన్స్ లలో షూటింగ్ చేస్తున్నాము. మేము తీసిన “లేడీస్ నాట్ అలౌడ్” సినిమాకు సెన్సార్ విషయంలో మేము  చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఎంతో మందిని రిక్వెస్ట్ చేసుకున్నాము. అందుకే ఇక మేము ఎవరినీ రిక్వెస్ట్ చేసుకోకూడదని మేము ఓటిటి ని స్టార్ట్ చెయ్యాలని ప్లాన్ చేశాం. మేము ఎదుర్కొన్న ఇబ్బందులు కొత్తవారు ఎదుర్కోరాదని కొత్తగా ఇండస్ట్రీ కు వచ్చే వారికి వెల్ కమ్ పలుకుతూ అందరికీ మా ఓటిటి ప్లాట్ ఫాం ఒక వేదిక కావాలని అనుకుంటున్నానని అన్నారు.
 
 
 దర్శకుడు రమేష్ కావలి మాట్లాడుతూ… ప్రెజెంట్ మేము అట్టర్ ప్లాప్, రొమాంటిక్ రెండు సినిమాలు తీస్తూ నేనే దర్సకత్వం వహిస్తున్నాను. అలాగే ఈ రెండు  మూవీస్ లలో కూడా షకీల కూతురు మిలా హీరోయిన్ గా చేస్తుంది.ఇది బిగినింగ్ మాత్రమే ముందు ముందు ఈ బ్యానర్ లో అనేక సినిమాలు చేస్తాము.అలాగే అక్క షకీల గారితో కలసి మేము ప్రారంభిస్తున్న “కె.ఆర్ డిజిటల్ ప్లెక్స్” ఓటిటి  ద్వారా అనేక సినిమాలు చేస్తూ  ఇందులో వారు తీసిన షార్ట్ ఫిల్మ్, సినిమా ఏదైనా కూడా ఫ్రీగా సపోర్ట్ చేస్తాము అని అన్నారు