అనుకోని ప్రయాణం మూవీ రివ్యూ

Published On: October 28, 2022   |   Posted By:

అనుకోని ప్రయాణం మూవీ రివ్యూ

రాజేంద్ర ప్రసాద్  ‘అనుకోని ప్రయాణం’  రివ్యూ

Emotional Engagement Emoji

👍

రాజేంద్ర ప్రసాద్ ఓ ప్రక్కన  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రధాన పాత్రలో కూడా సినిమాలు చేస్తున్నారు. తన మనస్సుకు నచ్చిన మంచి కథలను ఎంచుకుంటూ ఆయన ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలలో  రూపొందిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’.ఈ సినిమా ఎలా ఉంది..రాజేంద్రప్రసాద్ సోలో గా చేసిన ఈ సినిమా జనాలని మెప్పించిందా..కథేంటి…ఆ నలుగురు, మీ శ్రేయాభిలాషి తరహా చిత్రం అవుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీలైన్ :

భువనేశ్వర్‌లోని ఒక కనస్ట్రక్షన్ సైట్ లో  రోజువారీ కూలీలుగా పనిచేసే రాజేంద్ర ప్రసాద్, నరసింహరాజు అనే ఇద్దరు స్నేహితుల కథ ఇది. రాజేంద్ర ప్రసాద్‌కు ఎమోషన్స్ లేవు, కుటుంబ బంధాలు లేవు.. పెండ్లికూడా చేసుకోలేదు. ప్రాణమిత్రులైన ఈ ఇద్దరు తమ జీవితాలను పనిచేసుకుంటూ, తాగుతు,తిరుగుతూ కులాసాగా గడిపేస్తున్న సమయంలో COVID-19 లాక్ డౌన్ వస్తుంది. ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోతున్నారు. దాంతో వాళ్లు కూడా తమ ఊళ్లకు బయిలుదేరుతారు.  న‌ర‌సింహ‌రాజు రాజండ్రిలో వున్న త‌న కుటంబానికి వ‌స్తున్న‌ట్లు ఫోన్ చేస్తాడు. ఆ ఆనందంతో రాజేంద్ర ప్రసాద్‌తో క‌లిసి మందు తాగుతాడు.ఆ స‌మ‌యంలో గుండె నొప్పితో నరసింహరాజు  చ‌నిపోతాడు. ఆ త‌ర్వాత రాజేంద్ర ప్రసాద్ తన స్నేహితుడి శవాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకోవడం, ఈ ప్రక్రియలో అతనికి ఎదురయ్యే అడ్డంకులు, మానవ సంబంధాల విలువను అతనికి తెలియజేసే అంశాలే మిగతా సినిమా.

ఎనాలసిస్ ..
ఇది మనకు కొత్త కథేమో కానీ..ప్రపంచ సినిమా చూసేవాళ్లకు తెలిసిన కథే. ఎందుకంటే 2007 లో వచ్చిన Getting Home (Luo Ye Gui Gen) అనే చైనా  సినిమాకు ఫ్రీమేక్ ఇది. అయితే ఈ సినిమాకు మనదైన టచ్ ఇచ్చే ప్రయత్నం చేసారు దర్శక,రచయితలు. లాక్ డౌన్ సమయంలో వలస కూలీలు కష్టాలు..వాళ్లు ఇళ్లకు తరిలి వెళ్లిపోవటం..ఇబ్బందులు వంటివి స్పృశించారు. ఆ ఇబ్బందులు ,ఆ రోజులను గుర్తు చేసారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే చైనా సినిమాను ఇక్కడ ఎడాప్ట్ చేయాలనే అసలు కాన్సెప్టులోకి వచ్చారో అక్కడ నుంచి కథ పలచబడిపోయింది. తమ సొంతూరు కి ప్రయాణం కట్టిన వీళ్లిద్దరిలో …. నరసింహ రాజు మరణించటం…అది రాజేంద్ర ప్రసాద్  షాక్ కు గురి  చేయటం వంటి ఎలిమెంట్స్ గుండెను మెలిపెట్టినా..ఆ తర్వాత పెద్దగా నచ్చదు. బోర్ ప్రారంబమైపోతుంది.  అయితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా తన స్నేహితుడి శవాన్ని  స్వగ్రామానికి తీసుకెళ్లి అప్పచెప్పాలనే నిర్ణయం నచ్చుతుంది. ఓ ప్రక్కన కోవిడ్, లాక్ డౌన్… మనుషుల్లో భయం..అయినా కొందరిలో సహాయం చేసే తత్వం…అనేక ఇబ్బందులు దాటి  చివరికి స్నేహితుడి శవాన్ని ఎలా సొంతూరుకు చేర్చాడు?  బంధాలపై నమ్మకం లేని రాజేంద్రప్రసాద్ లో మార్పు ఏమి వచ్చింది? చివరకు ఏమైంది వంటి విషయాలు ని చెప్పాలనే తాపత్రయం, మరో ప్రక్క ఇందులో కామెడీ చేయాలనే ఆలోచన స్క్రిప్టుని ముందుకు వెళ్లనివ్వలేదు.మనిషి జీవితంలోని ఒడిదుడుకులను పాము, నిచ్చెనల ఆట(వైకుంఠపాళి)తో పోల్చడంతో సినిమాని  మొదలెట్టడంతో ఏదో కొత్త సినిమా చూస్తున్నాము అనిపిస్తుంది. కానీ అక్కడ అంత విషయం లేదని అర్దమయ్యే సరికి సినిమా పూర్తవుతుంది.

టెక్నికల్ గా…
ఈ సినిమా టెక్నికల్ గా జస్ట్ ఓకే అనిపిస్తుంది. అయితే ఇలాంటి మీడియం రేంజి సినిమల నుంచి అంతకు మించి ఆశించలేము. ఇక చాలా గ్యాప్ తర్వాత పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ రాసిన డైలాగ్స్ బాగున్నాయి. వాళ్ల అనుభవంతో అర్దవంతంగా సాగాయి. అయితే సినిమాలో అసలైన  కంటెంట్ ఉన్నా..హైలెట్ కాలేదు.  ఎడిటర్ ..సినిమాని ఇంకా ట్రిమ్ చేస్తే బాగుండేదేమో అనే ఆలోచన చాలా చోట్ల అనిపిస్తుంది. కెమెరా వర్క్ నీట్ గా ఉంది. సహజంగా  లొకేషన్స్  ప్రెజెంట్ చేసాడు. పాటల్లో  రెండు  బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అద్బుతం కాదు కానీ బాగున్నాయి.  స్క్రిప్టే సరిగ్గా కుదరలేదు.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. రాజేంద్రప్రసాద్ ఇలాంటి   వేరియేషన్స్, ఎమోషన్స్ ఉన్న  క్యారక్టర్స్  చాలా చేసేసాడు.  ఉన్నాయి. ఆయన ఫెరఫెక్ట్.  సీనియర్ నటుడు నరసింహరాజు గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. మిగతా నటీనటులు ఓకే.

బాగున్నవి:
ఎంచుకున్న స్టోరీ లైన్
రాజేంద్రప్రసాద్ పెర్ఫార్మన్స్

బాగోలేనివి:
విసిగించే రన్ టైమ్
స్లో నేరేషన్
బలవంతగా ఇరికించిన ఎమోషన్స్

చూడచ్చా

ఒరిజనల్ Getting Home (Luo Ye Gui Gen) చూడని వాళ్లు ఓ లుక్కేయచ్చు.

నటీనటులు: : డాక్టర్ రాజేంద్రప్రసాద్ , నరసింహరాజు,  ప్రేమ, తులసి రవిబాబు, శుభలేక సుధాకర్ నారాయణరావు , అనంత్ ప్రభాస్ శ్రీను  రంగస్థలం మహేష్  . జోగి సోదరులు ధనరాజ్  . కంచరపాలెం కిషోర్ , జెమిని సురేష్  తాగుబోతు రమేష్
సమర్పణ : బెక్కం వేణుగోపాల్
డీవోపీ – మల్లికార్జున్ నరగాని
సంగీతం – ఎస్ శివ దినవహి
డైలాగ్స్ – పరుచూరి బ్రదర్స్
ఎడిటర్ – రామ్ తుము
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మణికుమార్ పాత్రుడు
ఆర్ట్ డైరెక్టర్ – సురేష్ భీమగాని
రచన,దర్శకత్వం – వెంకటేష్ పెదిరెడ్ల
కథ, నిర్మాత – డా.జగన్ మోహన్ డి వై
Runtime: 2 hours.
విడుదల తేదీ: అక్టోబర్ 28, 2022