చివరకు ఆ ఇంటికి పనివాడిగానూ మారిపోతాడు. విసుగెత్తిన అఖిల ఓ బాంబ్ పేలుస్తుంది. తన జీవితంలో ప్రేమకు స్దానం లేదంటుంది. అసలు ఆ ప్రేమ గురించే తన తండ్రితో మాటలు లేకుండాపోయాయని అంటుంది. ఇప్పుడు తన ముందు ఉన్న కర్తవ్యం తన తండ్రి ప్రేమను తిరిగి గెలుచుకోవటమే కానీ ..తాను ప్రేమలో పడటం కాదంటుంది. అప్పుడు అమర్ ఏం చేసాడు? అసలు తండ్రీ కూతుర్ల మధ్య మాటలు పోయేటంత గ్యాప్ ఎందుకొచ్చింది? అఖిల ఐ ఏ ఎస్ పాసైందా? చివరికి అఖిల,అమర్ లవ్ స్టోరీ ఏమైంది? అనేదే మిగిలిన కథ.
స్క్రీన్ ప్లే ఎనాలసిస్
పై కథ చదివాక..ఎక్కడో ఇంతకు ముందు ఇలాంటి సినిమా చూసామే అనిపిస్తోంది కదా. అవును…చిరు జల్లు, ఆకాశమంత, నువ్వే నువ్వే ఇలాంటి కథలే. తండ్రి తన అతి ప్రేమతో కూతురు జీవితానికి అడ్డం వస్తూంటాడు. అంతేకానీ కూతురుకి ఓ జీవితం ఉంటుందని, ఓ వయస్సు వచ్చాక వాళ్లను కొంతవరకే నియంత్రించాలని తెలుసుకోలేదు. ఆల్రెడీ వచ్చిన పాయింట్ నే దర్శకుడు తన తొలి సినిమాకు కథగా తీసుకున్నాడు. అయితే ఎంత పాత కథ అయినా కొత్త స్క్రీన్ ప్లే, ట్రీట్మెంట్ తో చెప్పి ఆకట్టుకోవచ్చు. మన స్టార్ డైరక్టర్స్ అందరూ చేసేది అదే పని. కానీ ఈ సినిమాలో అదే మిస్సైంది. పాత కథను అంతే పాతగా చెప్పాడు. దాంతో నెక్ట్స్ వచ్చే పది సీన్స్ లో ఏముందో ఇట్టే కనిపెట్టేయచ్చు. దాంతో పాయింట్ ఆఫ్ ఇంట్రస్ట్ మిస్సైంది. క్లైమాక్స్ సైతం ఊహించిందే కనపడింది. ఇంట్రవెల్ మాత్రం కాస్తంత ఉత్కంఠ రేపింది.
ఏం బాగుంది
దర్శకుడు తను చెప్తున్న కథని నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేసారు. దాంతో ఎమోషన్స్ బాగా పండాయి. అలాగే క్యారక్టర్స్ మథ్య సంఘర్షణని బాగా ఎస్టాబ్లిష్ చేసాడు. నటీనటులు కూడా డైరక్టర్ కు బాగా సహకరించారు.
నటీనటులు, డైరక్షన్
హీరో విజయ్ రామ్ కి ఇది మొదట సినిమా. అతనిలో ఈజ్ ఉంది కానీ, లుక్స్ లో మోడ్రన్ టచ్ లేదు. అలాగే ఎక్సప్రెషన్స్ పెద్దగా ఇవ్వకుండా ఒకే ఎక్సప్రెషన్ తో లాగేసాడు. అఖిల గా చేసిన అమ్మాయి ఆల్రెడీ టీవి క్యారక్టర్స్ లో నలిగిందే కాబట్టి చక్కగా చేసుకుంటూ పోయింది. ఇక ఈ మధ్యకాలంలో షైన్ అవుతున్న ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగార్ . ఆకాశమంతలో ప్రకాష్ రాజ్ ని గుర్తు చేయకుండా అదే పాత్రను రిపీట్ చేసాడు. అన్నపూర్ణ,నరేష్ లు సరేసరి.
టెక్నికల్ గా ..
రొటీన్ కథ ఎంచుకోవటం అనేది ప్రక్కన పెడితే డైరక్టర్ ని ఎక్కడా వంకపెట్టడానికి లేదు. మొదట సినిమా అయినా ఆ తడబాటు కనపడదు. సీన్ నుంచి సీన్ లోకి ఈజిగా ఈదుకుంటూ వెల్లిపోయాడు. రథన్ పాటలు జస్ట్ ఓకే. రీరికార్డింగ్ లో కొన్ని హిందీ సినిమా బిట్లు వినిపించినట్లు అనిపిచింది. రసూల్ సినిమాటోగ్రఫీ..కూడా ఈ లవ్ స్టోరీకు మరో ప్లస్. డైలాగులు బాగున్నాయి. ఎడిటింగ్..ఫస్టాఫ్ లో మరో పావు గంట ట్రిమ్ చేయచ్చు. ఆర్టి డిపార్టమెంట్ కూడా బాగా వర్క్ చేసింది. డైలాగులు బాగా రాసారు.
చూడచ్చా
ఒకసారి ఓ లుక్కేయచ్చు. అసభ్యత,శృంగారం లేవు కాబట్టి ఫ్యామిలీలు ఎంకరేజ్ చేయచ్చు.
రేటింగ్: 2.5/5
ఎవరెవరు
నటీనటులు : కృష్ణస్వామి శ్రీకాంత్ అయ్యంగర్ , శివశక్తి సచ్దేవ్ , విజయ్ రామ్, నరేష్, అన్నపూర్ణ, శతమానం మహేష్ ,కేశవ్ దీపక్ తదితరులు.
సినిమాటోగ్రఫి : రసూల్ ఎల్లోర్
మ్యూజిక్ డైరెక్టర్: రధాన్
ఆర్ట్ : రామకృష్ణ.ఎస్
కథ,స్క్రీన్ ప్లే దర్శకత్వం : జోనాథన్ ఎడ్వర్డ్స్
నిర్మాతలు : వి.ఇ.వి.కె.డి.ఎస్ ప్రసాద్, విజయ్ రామ్
Run Time: 2 గంటల 12 నిమిషాలు
విడుదల తేదీ: సెప్టెంబర్ 18, 2020
స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్:ఆహా