Reading Time: < 1 min

అలా నిన్ను చేరి మూవీ నవంబర్ 10 విడుదల

సెన్సార్ పూర్తి చేసుకున్న అలా నిన్ను చేరి నవంబర్ 10న గ్రాండ్‌గా విడుదల

మంచి ఫీల్ గుడ్ మూవీలకు ఆడియెన్స్ నుంచి ఎప్పుడూ సపోర్ట్ ఉంటుంది. అందులోనూ లవ్ స్టోరీ, ఎమోషనల్ కథలకు ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అవుతుంటారు. అలాంటి ఓ ఫీల్ గుడ్ లవ్ ఎమోషనల్ స్టోరీతో రాబోతోన్న చిత్రమే అలా నిన్ను చేరి. అన్ని రకాల అంశాలను జోడించిన తెరకెక్కించిన ఈ మూవీలో దినేష్ తేజ్ హీరోగా.. అందాల తారలు హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా నటించారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ మూవీతో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమా మీద మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికేట్ వచ్చింది. మంచి కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీపై సెన్సార్ సభ్యులు ప్రశంసలు కురిపించారు.

కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ నవంబర్ 10న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం ప్రధానబలంగా నిలవనుంది. కోటగరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, ఆండ్రూ కెమెరా పనితనం ప్రేక్షకులను మెప్పించనుంది.

నటీనటులు  :

దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ తదితరులు

సాంకేతిక బృందం :

బ్యానర్ : విజన్ మూవీ మేకర్స్
సమర్పణ : కొమ్మాలపాటి శ్రీధర్
నిర్మాత : కొమ్మాలపాటి సాయి సుధాకర్
దర్శకత్వం : మారేష్ శివన్
కెమెరామెన్ : ఆండ్రూ
సంగీతం : సుభాష్ ఆనంద్