అల్లు శిరీష్ ప్రొడ‌క్ష‌న్ నెం 6 సినిమా ప్రకటన

Published On: May 27, 2021   |   Posted By:
అల్లు శిరీష్ ప్రొడ‌క్ష‌న్ నెం 6 సినిమా ప్రకటన
 
 
కొత్త జంట‌, శీర‌స్తు శుభ‌స్తు, ఏబిసిడి వంటి సూప‌ర్ హిట్ సినిమాల‌తో ఒక్క క్ష‌ణం వంటి వినూత‌న్న‌మైన సినిమాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన‌ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అల్లు శిరీష్, ఇప్పుడు త‌న ప్రొడ‌క్ష‌న్ నెం 6 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.
 
ఈ సినిమాలో శిరీష్ కి జంట‌గా మ‌ల్లూ బ్యూటీ అనుఇమానుయెల్ న‌టిస్తోంది. మెగాప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో 100% ల‌వ్, భలే భ‌లే మ‌గాడివోయ్, గీత‌గోవిందం, ప్ర‌తిరోజూపండుగే వంటి స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌కు కేర్ ఆఫ్ అడ్ర‌స్ గా మారిన నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ మీద ఈ సినిమా సిద్ధ‌మైంది. 
 
మే30 అల్లు శిరీష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఉద‌యం 11 గంట‌ల‌కు అల్లు శిరీష్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 6 ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేయ‌నున్నాను. ఈ వివ‌రాల‌ను తెలుపుతూ విడుద‌ల చేసిన ప్రీ లుక్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అల్లు శిరీష్, అనుఇమానుయెల్ మధ్య న‌డిచే రొమాన్స్ నేప‌థ్యంలో ఓ పోయేటిక్ స్టిల్ తో ఈ ప్రీ లుక్ ని సిద్ధం చేసి విడుద‌ల చేశారు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఈ ప్రీలుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో ప్రీలుక్ తో ఈ సినిమా పై అంతటా ఆస‌క్తి నెల‌కొంది. ఇక ఈ సినిమాకు ద‌ర్శ‌కుడెవ‌రు, మ్యూజిక్, సాంకేతిక నిపుణ‌ల‌తో పాటు కీల‌క వివ‌రాల్ని త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల చేయ‌నున్నారు.