Reading Time: 2 mins

అల వైకుంఠపురంలో మూవీ రివ్యూ

నాన్నగారింటికి దారేది (‘అల వైకుంఠపురంలో’ రివ్యూ)
 Rating:2.5/5

అనగనగా ఓ వాల్మీకి (మురళి శర్మ). తన ఫ్రెండ్ రామ చంద్ర (జయరాం) సూపర్ రిచ్ అమ్మాయిని చేసుకుని కోటీశ్వరుడు అయ్యిపోవటంతో తనకు ఆ అదృష్టం లేక కుతకుతలాడిపోతూంటాడు. కానీ వేరే దారి లేక తన ఫ్రెండ్ కంపెనీలోనే పనిచేస్తూ… మిడిల్ క్లాస్ లైఫ్ తో చాలా ప్రస్టేషన్ అవుతూంటాడు. సినిమా టెక్ గా అతని భార్య, తన ప్రెండ్ భార్య(టబు) ఒకేసారి బిడ్డలను కంటారు. ఆ అవకాశాన్ని వినియోగించుకుని తన కొడుకుని కోటీశ్వరుడుని చేద్దామని స్కెచ్ వేస్తాడు వాల్మీకి. అందులో భాగంగా ఆ బిడ్డలను మార్చేస్తాడు. ఇది చూసిన ఓ నర్స్ కోమాలోకి వెళ్లిపోవటంతో అతనికి అదుపే లేకుండా పోతుంది. అలా మిడిల్ క్లాస్ లో మెలగాల్సిన రాజ్ (సుశాంత్) కోటీశ్వరుడు బిడ్డగా పెరుగుతాడు. కోటీశ్వరుడుగా పెరగాల్సిన బంటు (అల్లు అర్జున్) లో మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తూంటాడు. అనుకోనివిధంగా ఓ రోజు బంటుకు ఈ నిజం తెలుస్తుంది.. దాంతో వచ్చే పరిణామాలు ఏమిటి…నిజం తెలిసిన బంటు ఏం నిర్ణయం తీసుకుంటాడు…వాల్మీకిని ఏం చేస్తాడు..అసలు తల్లి , తండ్రులు అతన్ని ఏక్సెప్టు చేస్తారా వంటి  విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ,కథనం ఎనాలసిస్
త్రివిక్రమ్ తొలి నుంచీ ఎత్తి పోతలు పథకాలతో కథలు చేస్తున్నా..తనదైన మాటల మ్యాజిక్ తో మాత్రికుడులా మాయ చేస్తూ నెట్టుకొస్తున్నాడు. అయితే అప్పట్లో హాలీవుడ్ సినిమాలకు ఆర్డర్ వేస్తూ లాక్కొచ్చిన ఆయన ఇప్పుడు పాత తెలుగు సినిమాపై పడ్డారు. ఎప్పుడో 1953లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఇంటిగుట్టు కథని పట్టుకున్నారు. తనదైన స్టైల్ మార్పులు,చేర్పులుతో మన ముందుంచారు. అయితే కాలం మారింది. కాలంతో పాటు విలువలు, కథ చెప్పే విధానం మారింది. ఆ పాత సినిమాని అలాగే ఇప్పుడు కాలానికి అందిస్తే పాత సీసాలో..పాత సారా లాగే ఉంటుంది. అదే జరిగింది ఈ సినిమాకు. బిడ్డల మార్పిడి అంశం..డ్రమిటెక్ గా ఉన్నా వాస్తవానికి దగ్గరగా అనిపించదు. దాంతో అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో చేసిన కథలో అతని ఇమేజ్ కు  సరైన కాంప్లిక్ట్ రైజ్ కాలేదు. లవ్ ట్రాక్ కూడా అంతంత మాత్రమే.అన్ని అలా టచ్ చేసి వదిలేసారు కానీ ఏదీ లోతుగా వెళ్లలేదు.

సెకండాఫ్ లో డ్రామా పుట్టాల్సిన చోట…మెలోడ్రామా చేసేసి, హీరోని ముందుకు కదలనీయకుండా చేసి ప్యాసివ్ గా చేసేసారు. ఫ్యామిలీ కథ కదా..విలన్ ట్రాక్ కు పెద్ద ప్రయారిటీ ఎందుకనుకున్నారో ఏమో కానీ విలన్ కు ..అసలు హీరో తెలిసే సరికే క్లైమాక్స్ వచ్చేస్తుంది. దాంతో ఆ ట్రాక్ నిరర్దకంగా నడుస్తుంది.

మల్టిఫ్లెక్స్ లు..

ఇక ఫస్టాప్ కంప్లీట్ గా త్రివిక్రమ్ క్లాస్ నేరేషన్ తో మల్టిఫ్లెక్స్ ఆడియన్స్ కు ఫెరఫెక్ట్ ఆప్షన్ లా తీర్చిదిద్దారు. అయితే లౌడ్ హ్యూమర్ లేకపోవటం చాలా మందికి నచ్చుతుంది. అలాగే ఫస్టాఫ్ ని పూర్తిగా స్టోరీ సెటప్ కే వాడుకోవటంతో లెక్కకు మించి క్యారక్టర్ పరిచయం అవుతూంటారు. ఇక సెకండాఫ్ నైస్ గా స్టార్ట్ అయినా ఎమోషన్ సీన్స్ పెద్దగా ఉండటంతో అప్పటిదాకా ఉన్న గ్రాప్ పడిపోవటం మొదలెట్టింది.  సన్నాఫ్ సత్య మూర్తి, అత్తారింటికి దారేది వంటి త్రివిక్రమ్ అడపా దడపా సినిమాలు గుర్తు వస్తూంటాయి.  త్రివిక్రమ్ ఎప్పటిలాగే డైలాగులతో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేసారు. ఆ క్రమంలో కథకు అందాల్సిన ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ డెప్త్ కొద్దిగా మిస్సైందనే చెప్పాలి.

 ఎవరు ఎలా..
అల్లు అర్జున్ కూల్ బాడీ లాంగ్వేజ్ తో సినిమాని అలవోకగా మోసుకుంటూ పోయారు. పాటలు కూడా ప్రయత్నపూర్వకంగా పెట్టినట్లు కాక స్టోరీలో చాలా వరకూ కలిసిపోయాయి.పూజ హెడ్గే, నివేదిత లు గ్లామర్ కే పరిమితం అయ్యారు. టబు బాగా ముసలి రూపు పడిపోయింది. మురళి శర్మ మాత్రం క్యారక్టర్ లో పరకాయ ప్రవేశం చేసారు.

టెక్నకల్ గా..
త్రివిక్రమ్ రైటర్ గా వెనకబడుతూ.. దర్శకుడుగా పరుగులు పెడుతున్నారు.మొదటి నుంచి అనుకున్నట్లుగానే త‌మ‌న్ సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్‌. సామ‌జ‌వ‌రగ‌మ‌న‌, రాములో రాముల‌, బుట్ట‌బొమ్మ సాంగ్స్ విన‌డానికే కాదు.. చూడ‌టానికి కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్. పి.ఎస్‌.వినోద్ కెమెరా వ‌ర్క్ సినిమాకు రిచ్ లుక్ తెచ్చింది.  ఎడిట‌ర్ సెకండాఫ్ ఓ ఐదు ప‌ది నిమిషాలు ఎడిట్ చేస్తే ఇంకా బాగుండేది.

చూడచ్చా…
త్రివిక్రమ్ డైలాగుల కోసం, అల్లు అర్జున్ డాన్స్ లు కోసం మాత్రమే చూడాలి.

తెర వెనక, ముందు
స‌మ‌ర్ప‌ణ‌: శ్రీమ‌తి మమ‌త‌
బ్యాన‌ర్స్‌: హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, గీతాఆర్ట్స్‌
న‌టీన‌టులు: అల్లు అర్జున్‌, పూజా హెగ్డే, టబు, జ‌య‌రాం, ముర‌ళీశ‌ర్మ‌, సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, సునీల్‌, స‌చిన్ ఖేడేక‌ర్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, రాజేంద్ర ప్ర‌సాద్, వెన్నెల‌కిషోర్‌, బ్ర‌హ్మాజీ, రావు ర‌మేష్‌, బ్ర‌హ్మానందం, అజ‌య్ త‌దిత‌రులు
సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
కెమెరా: పి.ఎస్‌.వినోద్‌
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
నిర్మాత‌లు: అల్లు అర‌వింద్, ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు)
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: త‌్రివిక్ర‌మ్‌