అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ రివ్యూ

Published On: May 6, 2022   |   Posted By:

అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ రివ్యూ

విశ్వక్‌ సేన్‌ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ రివ్యూ

Emotional Engagement Emoji (EEE)

👍

లాక్ డౌన్, జనతా కర్ఫూ నేపధ్యంలో చాలా కథలే విన్నాం. ఎన్నో బాధలు, ఆ తర్వాత అప్పటి కష్టాలు తలుచుకుని నవ్వుుకోవటం జరిగింది. అలాగే ఎక్కడివాళ్లు అక్కడే ఉండాల్సిరావటంతో వాటి చుట్టూ అల్లిన కథలతో సినిమాలు వచ్చాయి. విడిపోదామనుకున్న జంట ..లాక్ డౌన్ టైమ్ లో వేరే దారిలేక ఒకే ఇంట్లో ఉండటం..ఆ టైమ్ లో వాళ్ల మధ్య అవగాహన పెరగటం, అలాగే ఓ పెళ్ళింట్లో …లాక్ డౌన్ టైమ్ లో చుట్టాలంతా స్టక్ అయ్యిపోవటం కథతో వివాహభోజనంబు కథలు వచ్చాయి. ఇప్పుడు ఇదే మోడల్ లో మరో కథ తెరకెక్కింది. అదే ఈ రోజు రిలీజైన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ . ఈ చిత్రం మరి మర్చిపోతున్న ఆ క్షణాలను గుర్తుచేసిందా…విలేజ్ ఫన్ తో సినిమా అన్నారు…అదేమన్నా పండిందా..అసలు కథేంటి

Story line:
అనగనగా ఓ ముదురు ముప్పై ఏళ్లు దాటిన అర్జున్ కుమార్ అల్లం (విశ్వక్ సేన్). వయస్సు పెరిగిపోతోంది…పెళ్లి కావటం లేదు. జుట్టు ఊడిపోతోంది.పొట్ట పెరిగిపోతోంది. ఏం చేయాలి…తమ కులంలో అమ్మాయిల కరువు నడుస్తోంది. అనుకున్న టైమ్ లో అర్జున్ కుమార్ కు గోదావరి జిల్లా నుంచి ఓ సంభందం సెట్ అవుతుంది. కట్న కానుకలు లేకుండా సింపుల్ పెళ్లి లాగించేద్దాముకుని నిశ్చితార్దానికి రెడీ అవుతాడు. మాధవి (రుక్సార్ థిల్లాన్) కూడా చూడ్డానికి బాగుంది అని ఆనందపడతాడు. అలా నిశ్చితార్దానికి వెళ్లినవాళ్ళు జనతా కర్ఫ్యూ లాక్ డౌన్ తో అమ్మాయి ఇంట్లో ఇరుక్కుపోతారు. సర్లే వచ్చిన వాళ్లకు రాచ మర్యాదలు, పెళ్లి పదనిసలు, సెటైర్లు, అలకలు, ఆనందాలు బాగానే ఉంటాయి. ఫలానా రోజు పెళ్లి అనుకునే సరికి ఈ లోగా అమ్మాయి జంప్. దాంతో అర్జున్ కుమార్ బుర్ర తిరిగిపోతుంది. అసలే పెళ్లి కాక కాక అవుతూంటే మధ్యలో ఈ ట్విస్ట్ ఏమిటిని టెన్షన్ పడిపోతాడు. సర్లే ఇంటికైనా వెళ్లిపోదామనకుంటే కర్ఫూ కంటిన్యూ అవుతుంది. ఏం చేయాలో అర్దంకాదు. పెళ్లి కూతురు లేకుండా వాళ్ళింట్లోనే ఉంటే ఎంత నామోషీ. అయినా భరిస్తాడు. ఈ లోగా లక్కీగా పెళ్లి కూతురు చెల్లి చెల్లెలు వసుధ (రితికా నాయక్) అర్జున్ కుమార్‌కి దగ్గరౌతుంది. అక్కడ నుంచి కథ మనం ఊహించేదే. తనకు దగ్గరైన అమ్మాయిని మరింత దగ్గర చేసుకుని పెళ్లి చేసుకుంటాడు. దూరమైన అమ్మాయిని అలాగే దూరం పెట్టేస్తాడు. పిల్లాడి పెళ్లి కథ సుఖాంతం.

Screenplay Analysis:
ఈ సినిమా ఎలా ఉందీ అంటే …ఇంతకు ముందు సత్య హీరోగా వచ్చిన వివాహ భోజనంబు సినిమా గుర్తుకు వస్తుంది. అదీ లాక్ డౌన్ లో జరిగే వివాహం చుట్టూ జరిగే కథ. అయితే అందులో పెళ్ళి కూతురు లేచిపోయే ట్విస్ట్ లు అయితే లేవు. మిగతా దంతా దాదాపు ఒకటే అనిపిస్తుంది. అక్కడ పెళ్లి కొడుకు ఇంట్లో …అమ్మాయి ఫ్యామిలీ లాక్ డౌన్ టైమ్ లో ఇరుక్కుపోతే …ఇక్కడ పెళ్లికూతురు ఇంట్లో పెళ్లి కొడుకు ఫ్యామిలీ ఇరుక్కుపోతారు. ఫన్ దాదాపు ఒకేలాగ ఉండటంతో కొత్తగా అనిపించదు. అయితే గోదావరి నేటివిటి సినిమాలు ఈ మధ్యన తగ్గటంతో ఆ పాత్రలు కాస్తంత ఉషారు ఇస్తారు. ఆ పాత్రలు చెప్పే డైలాగులు నవ్వులు కురిపిస్తాయి. స్క్రీన్ ప్లే పరంగా పెద్దగా మెరుపులు ఏమీ లేవు. హీరోయిన్ లేచిపోతుందని మనం ముందే ఎక్సపెక్ట్ చేస్తాం. అలాగే పెళ్లి కూతురు కనెక్టివిటి కూడా అర్దమైపోతుంది.

దర్శకుడు కథలోకి వెళ్ళడానికి ఎక్కువ సమయాన్ని వృథా చేయలేదు. అయితే సినిమా దాదాపు 15 నుండి 20 నిమిషాల వరకు బాగానే అనిపించినా ఆ తర్వాత సినిమా స్క్రీన్‌ప్లే కాస్త స్లో అవుతుంది. సినిమా ఎక్కువ శాతం దాదాపు ఒకే లొకేషన్ లో జరుతుంది. ఆ విధంగా బడ్జెట్ కలిసొస్తుందికానీ చూసేవాడికి కలిసొచ్చేదేమీ లేదు. ఇక పెళ్లి కూతురు లేచిపోయే కాన్సెప్టు కథలు మనకు కొత్తకాకపోవటం కూడా ఈ సినిమాకు ఓ రకంగా శాపమే. ఏతావాతా స్క్రిప్టు మరింత బాగా రాసుకుంటే బాగుండేది అనిపించటంలో మీ తప్పేమీ లేదు. అలాగే సినిమాలో కథ చాలా ప్రెడిక్టబుల్ గా ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ లోని సీన్స్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచాయి. సెకండ్ హాఫ్ అయితే తేలిపోయింది. అయితే సెకండాఫ్ లో సైడ్ క్యారెక్టర్ ల వల్ల వచ్చే ఫన్ బాగుంది. ముఖ్యంగా పెళ్లి కూతురు లేచిపోయే సీన్‌లో.. మందుకొట్టిన సీన్‌లో గోపరాజు రమణ ఫన్ జనరేట్ చేశారు.

Analysis of its technical content:

ఇంక టెక్నికల్ గా ఈ సినిమా అవుట్ స్టాండింగ్ అని చెప్పలేము కానీ చిన్న సినిమా అనిపించకుండా రిచ్ గా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ సోసోగా ఉన్నా కెమెరామెన్, మ్యూజిక్ డైరక్టర్ ఆ లుక్ తెచ్చేసారు. డైరెక్టర్ విద్య సాగర్ చింతా ఎంటర్టైన్మెంట్ సీన్స్ బాగానే పండించారు. ట్రైలర్లో కన్నా కాస్త ఎక్కువ కామెడీనేై ఉంది. కొన్ని సీరియస్ సీన్స్ కూడా ఫన్ చేసారు. అన్ని పాత్రలను రియాలిటీకి దగ్గరగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసారు డైరెక్టర్. జై క్రిష్ అందించిన నేపధ్య సంగీతం సినిమా కి బాగానే ప్లస్ అయింది.

ఇక విశ్వక్ లుక్ కొత్త‌గా ఉంది. 30 ఏళ్లు దాటి పెళ్లి కాని కుర్రాడి ప్రస్టేషన్ పాత్రలో విశ్వక్ సేన్ చాలా బాగా నటించాడు. పల్లెటూరి అమ్మాయి పాత్రలో రుక్సార్ దిల్లాన్ నటన లేదు కానీ చూడ్డానికి బాగుంది. విశ్వక్ సేన్ తో రితిక నాయక్ తన కెమిస్ట్రీ బాగుంది. గోపరాజు రమణ, నాగినీడు ఈ సినిమాలో చాలా బాగా చేసారు. ఫోటోగ్రాఫర్ పాత్రలో, గోదావరి యాసతో రాజావారు రాణిగారు ఫేమ్ రాజ్ కుమార్ చాలా బాగా చేసారు.

CONCLUSION:

ఫన్ కోసం ఓ సారి లుక్కేయచ్చు. మరీ తీసి పారేయదగ్గ సినిమా కాదు.

Movie Cast & Crew

నటీనటులు: విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్, రితికా నాయక్, గోపరాజు రమణ, కాదంబరి కిరణ్ తదితరులు
కథ, కథనం, మాటలు, షో రన్నర్: రవి కిరణ్ కోలా
సినిమాటోగ్రఫీ: పవి కె పవన్
సంగీతం: జయ్ క్రిష్‌
సమర్పణ: బి.వి.ఎస్‌.ఎన్‌. ప్ర‌సాద్‌
నిర్మాతలు: భోగవల్లి బి, సుధీర్ ఈద‌ర‌
దర్శకత్వం: విద్యాసాగ‌ర్ చింతా
Run time:2 గంటల 25 నిముషాలు
విడుదల తేదీ: మే 06, 2022