అశ్వద్ధామ చిత్రం ఆడియో లాంచ్
ఘనంగా అశ్వద్ధామ ఆడియో లాంచ్, జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల
యూవ హీరో నాగ శౌర్య రాసుకున్న కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం అశ్వద్ధామ. జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఆడియో ఫంక్షన్ ఖమ్మంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగ శౌర్య మాట్లాడుతూ….
ఖమ్మంలో జరుగుతున్న మా అశ్వద్ధామ ఆడియో ఫంక్షన్ ను సక్సెస్ చెయ్యడానికి వచ్చిన అందరికి ధన్యవాదాలు. మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద చెయ్యి వేస్తే మనం ఎలా రియాక్ట్ అవుతామో అశ్వద్ధామ సినిమాలో హీరో అదే చేస్తాడు. మెహరిన్ వాళ్ళ గ్రాండ్ ఫాథర్ కు హెల్త్ బాగోకపోయిన మన ఫంక్షన్ కు రావడం గ్రేట్, తనకు సినిమాపై ఫ్యాషన్ ఏంటో అర్థం అవుతుంది. నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నందునే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. ఇది ఒక నిజాయితీ గల కథ, నా ఫ్రెండ్ చెల్లికి జరిగిన ఒక సంఘటనను ఆధారంగానే ఈ కథను రాసుకున్నాను. డైరెక్టర్ రమణ తేజ సినిమాను బాగా తీసాడు, మనోజ్ రెడ్డి కెమెరా వర్క్, గ్యారీ ఎడిటింగ్ ఇలా అందరి వర్క్ సినిమాకు హెల్ప్ అయ్యింది. నాకు కథ రాయాలని ఉందని అమ్మ, నాన్నాతో చెప్పినప్పుడు వాళ్ళు నన్ను సపోర్ట్ చేశారు. ఈ సినిమా కథ రాస్తున్నప్పుడు లైఫ్ అంటే ఏంటో నేర్చుకున్నాను, అశ్వద్ధామ అందరికి నచ్చే సినిమా అవుతుంది, సమాజంలో జరిగిన కథను నేను రాయడానికి ప్రేరేపించిన కొన్ని అంశాలు సినిమాలో చూస్తారు. ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే అంశాలు ఈ మూవీలో ఉంటాయి. నన్ను మొదటి నుండి సపోర్ట్ చేస్తున్న అందరికి స్పెషల్ థాంక్స్ తెలుపుతున్నాను అన్నారు.
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ….
నిర్మాతలకు హీరో నాగ శౌర్య కు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. నాగ శౌర్య ఇప్పుడున్న నటుల్లో సహజంగా నటించే ఒక నటుడు, మంచి ట్యాలెంట్ ఉన్న నటుడు, అశ్వద్ధామ సినిమా సమాజంలో జరుగుతున్న కొన్న సంఘటనలు ఆధారంగా చేసుకొని చేసిన ఈ మూవీని అందరూ సూపర్ చెయ్యాలి. శ్రేయస్ మీడియా శ్రీనివాస్ ఈవెంట్స్ ను చాలా అద్భుతంగా చేస్తున్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు.
హీరోయిన్ మెహరిన్ మాట్లాడుతూ…
అందరికి నమస్కారం, అశ్వద్ధామ చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. డైరెక్టర్ స్టోరీ లైన్ చెప్పగానే నేను ఈ కథకు కనెక్ట్ అయ్యాను. డైరెక్టర్ ఏదైతే చెప్పాడో అదే తీశాడు, నాగ శౌర్య రాసుకున్న కథ మీ అందరికి కనెక్ట్ అవుతుంది, ఆలోచింపజేస్తుంది. అందరూ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం కష్టపడి పని చేశారు, షూటింగ్ సమయంలో నిర్మాతల సహకారం మరువలేనిది. అశ్వద్ధామ చిత్రం నాగ శౌర్య కు డిఫరెంట్ సినిమా అవుతుంది, తన స్క్రీన్ ప్రెజెంట్స్ అందరికి నచ్చుతుంది, జనవరి 31న వస్తోన్న అశ్వద్ధామ మీ అందరికి నచ్చుతుంది అందరూ ఈ సినిమాను చూసి సపోర్ట్ చెయ్యాలని, నాపై మీ అభిమానం ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్న అన్నారు.
డైరెక్టర్ రమణ తేజ మాట్లాడుతూ….
నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐరా క్రియేషన్స్ కు ధన్యవాదాలు. ఐరా క్రియేషన్స్ కు డిజిటల్ వర్క్ చేసిన గౌతమ్ గారికి థాంక్స్, శ్రీ చరణ్ పాకాల చేసిన పాటలు బాగున్నాయి, రీ రికార్డింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఫణి నాతో ఈ సినిమా మొదటి నుండి ఉన్నాడు, స్క్రీన్ ప్లే రాసాడు, నాతో జెర్నీ చేసాడు తనకు థాంక్స్ తెలుపుతున్నాను. మనోజ్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరింత ప్లస్ కానుంది. అశ్వద్ధామ సినిమాలో కొత్త నాగ శౌర్యను చూస్తారు. ఈ సినిమాకు నేను డైరెక్టర్ అయినందుకు గర్వాంగా ఉంది. నన్ను నమ్మి నాకు ఈ సినిమాను ఇచ్చిన నాగ శౌర్య అన్నకి ధన్యవాదాలు. జనవరి 31న విడుదల కానున్న మా సినిమాను అందరూ చూడాలని కోరారు.
లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి మాట్లాడుతూ….
మంచి కథ బలంతో వస్తోన్న అశ్వద్ధామ సినిమా బాగా వచ్చింది. నాగ శౌర్య కు నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చే సినిమా ఇది. పాటలు బాగున్నాయి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా శ్రీచరన్ బాగా చేశాడు, డైరెక్టర్ రమణ తేజ కొత్త దర్శకుడైన బాగా హ్యాండిల్ చేశాడు. ఈ మూవీ మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరన్ పాకాల మాట్లాడుతూ….
అందరికి నమస్కారం, నాకు ఈ అవకాశం ఇచ్చిన హీరో నాగ శౌర్య గారికి స్పెషల్ థాంక్స్. ఈ సినిమాలో నాలుగు పాటలు కంపోజ్ చేశాము, అన్ని సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. డైరెక్టర్ రమణ తేజ గారికి, కెమెరామెన్ మనోజ్ అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.
నటీనటులు: నాగ శౌర్య, మెహరిన్
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: ఐరా క్రియేషన్స్
నిర్మాత: ఉషా మూల్పూరి
కథ: నాగ శౌర్య
డైరెక్టర్: రమణ తేజ
కెమెరా: మనోజ్ రెడ్డి
మ్యూజిక్: శ్రీచరన్ పాకాల
ఎడిటర్: గ్యారీ
లైన్ ప్రొడ్యూసర్: బుజ్జి
డిజిటల్: గౌతమ్
డైలాగ్స్: పరుశురాం శ్రీనివాస్
యాక్షన్ డైరెక్టర్: అన్బరివ్