Reading Time: 3 mins

ఆకాశవాణి మూవీ రివ్యూ

 

ఆకాశవాణి మూవీ రివ్యూ
Emotional Engagement Emoji (EEE) :

 

 

కొత్త కథలు రావాలి, కొత్త సినిమాలు రావాలి  అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు, మెయిన్ మీడియాలో స్టోరీలు కంటన్యూగా వస్తూనే ఉంటున్నాయి. అయితే ఆ కొత్తదనం ఏమిటి,ఎవరు తీయాలి, ఎవరి కోసం తేయాలనేది ఎప్పుడూ కన్ఫూజనే.  ఎందుకంటే పాత కథతో వచ్చిన సినిమాలు పెద్ద హిట్టైపోతూంటాయి. కొత్త పాయింట్ అన్నవి ప్రక్కన పెట్టేస్తూంటారు. అలాగే ఆ కొత్త కథ కూడా హాలీవుడ్ సినిమా లాగ ఉండాలా, ప్రక్కనున్న మళయాళ సినిమాలాగ ఉండాలా అనేది పెద్ద ప్రశ్నే. అందుకే ఆ రెండు మిక్స్ చేసే సినిమాలు చేద్దామనుకునేవాళ్లు వస్తున్నారు. ఈ నేపధ్యంలో  ఓ కొత్త తరహా పాయింట్ తో ‘ఆకాశవాణి’ వస్తోందంటూ చాలా రోజులుగా వినపడుతోంది. రాజమౌళి శిష్యుడు చేస్తున్న సినిమా కావటం ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసాయి. ఇంతకీ ఆ కొత్త పాయింట్ ఏమిటి… అభిమాన ప్రేక్షకుల నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆకాశవాణి’ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

స్టోరీ లైన్

ఎక్కడో ఓ మారుమాల గిరిజన ప్రాంతం. అజ్ఞానం అక్కడ రాజ్యం ఏలుతోంది. ఆ రాజ్యాన్ని  ఓ  దొర (విన‌య్ వ‌ర్మ‌) పాలిస్తున్నాడు. దొర మాత్రం జ్ఞాని. వాళ్ల అజ్ఞానం బయిటపడితే తనలాంటి జ్ఞానికు విలువు ఉండదని తెలిసిన మహాజ్ఞాని. అందుకే ఆ అవకాసం వాళ్లకు ఎప్పుడూ ఇవ్వడు. వాళ్లు తీసుకుందామనుకున్నా ఊరుకోడు. వాళ్లంతా.. ఆకాశంలో చుక్క‌ల్ని చూసి చ‌నిపోయిన‌వాళ్లంతా చుక్క‌లైపోతార‌ని అనుకుంటారు.  దొర మాత్రం ఆ చుక్కలు తగ్గకుండా చాలా మంది తన మాట వినని వాళ్లను చంపేసి వాళ్లను కలిపేస్తూంటాడు. ఇలాంటి పరిస్దితుల్లో … ఆ  గూడానికి దేవుడు పంపిన దూతలా ఓ అనుకోకుండా ఓ రేడియో వ‌స్తుంది. వాళ్లకు రేడియో కొత్త..అదేంటో తెలియదు. అందుకుని రేడియోలో మాట‌లు విని దేవుడే.. మాట్లాడుతున్నాడ‌ని భ్ర‌మ ప‌డుతూంటారు. అంతటితో ఆగకుండా దాన్ని దేవుడు చేసే ప్రయత్నం చేసి..ఆ , రేడియోని తీసుకెళ్లి గుడిలో పెడ‌తారు. అక్క‌డి నుంచి వాళ్ల‌కు ఆకాశ‌వాణినే దొర‌ని మించిన దేవుడులా కొలుస్తూంటాడు. అది సాధారణంగా దొరకు మండుతుంది. వాళ్లను ఆ జ్ఞానం పెంచే వస్తువు నుంచి దూరం చెయ్యాలనుకుంటాడు. అందుకోసం దొర లో దుర్మార్గం నిద్రలేపుతాడు. అదే సమయంలో   ఆ గూడానికి అనుకోకుండా వ‌చ్చిన మాస్టారు (స‌ముద్ర‌ఖ‌ని) అడ్డు పడతాడు. చివరకు ఏమైంది..రేడియో వాళ్ల జీవితాలతో ఆడుతుందా..ఆదుకుందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  

ఎనాలసిస్ …

కథ పరంగా పరంగా కొత్తదనం ఉందా అంటే ఉంది, లేదు అంటే లేదు. ఎందుకీ కన్ఫూజన్ అంటే గాడ్స్ మస్ట్ బి క్రేజీ చూస్తే ఇలాంటి కథలు ఆల్రెడీ చూసామోయ్..నువ్వు మాకు చెప్పేదేమిటి అనాలనిపిస్తుంది. అది చూడకపోతే భలే పాయింట్ పట్టారే అని ఫోన్ చేసి మెచ్చేసుకోవాలనిపిస్తుంది. సర్లైండి కీ  పాయింట్ ని ప్రక్కన పెడితే..కథలో ప్రదాన సమస్య, విలన్ అయినా దొర కూడా సినిమా కు కొత్తకాదు. దొర, అతని దాష్టికాలు చుట్టూ బోలెడు సినిమాలు వచ్చేసాయి. అంతెందుకు దొరగా వేసిన ఆర్టిస్ట్ ..గతంలో ఇదే పాత్రలో  ‘దొరసాని’లో దుమ్ము లేపేసాడు. దాంతో ఇందులో కొత్తేమీ అనిపించలేదు. ఆ దొరను ఎదిరించటానికి మెటాఫర్ గా రేడియో కథలోకి రావటం బాగుంది. గాడ్స్ మస్ట్ బి క్రేజీలో పై నుంచి జారి పడ్డ కోకోకోలా బాటిల్ తో ఫన్ చేస్తే…ఇక్కడ  రేడియోతో సీరియస్ చేసారు. సీసా ఆ జాతికి తెలియదా అంటే తెలియదు అనటానికి మన చరిత్ర స్వయంగా సాక్ష్యం ఇస్తుంది.అలాంటి తెగ ఉంది. వాళ్లకు ఏమీ తెలియదు అని చెప్తుంది. దాంతో మనం నమ్ముతాం. ఇక్కడ అసలు ఎక్కడాలేని ఓ తెగ ఉంది, దానికి రేడియో గురించి తెలియదు అంటే ఆశ్చర్యగా చూస్తాం.

 మెయిన్ ప్లాట్ లోనే నమ్మసక్యంకానీ పాయింట్ ఉంటే కథ మొత్తం నమ్మాలనిపించదు. అపనమ్మకంతో చూసే సినిమాని ఎలా అభిమానిస్తాం..ప్రేమిస్తాం..మెచ్చుకుంటాం..లీనమవుతాం. అదే ఈ సినిమాకు జరిగింది. ఆకాశవాణి కాస్తా అయోమయవాణిగా అరక్షణంలో మారిపోతుంది. అక్కడ గూడెం వాళ్ల నమ్మకాలు కాదు ఇది మన నమ్మకాలు చుట్టూ తిరిగే కథ అనిపిస్తుంది. అయితే సమర్దుడైన డైరక్టర్ …రాక్షసబల్లులు ఈ కాలంలో జనం మధ్యకు వచ్చాయి అని నమ్మించగలడు. అదే ఇక్కడ కుదరలేదు. ఏదైమైనా దర్శకుడు టచ్ చేసిన  సమస్య ప్రక్కన పెడితే సినిమాకు దర్శకుడి సిన్సియర్ అటెంప్ట్ మెచ్చుకోదగ్గది. పెద్దగా కథలేని ఓ స్టోరీని స్మూత్ గా నెరేట్ చేసుకుంటూ వెళ్లడం అంటే ధైర్యం వుండాలి. సినిమా తొలిసగం మొత్తం కలిపి సినాప్సిస్ రాసుకుంటూ పేజీ కథ వుండదు. ప్రధాన పాత్రల స్ట్రగుల్స్ మాత్రమే వుంటాయి. నిజానికి కమర్షియల్ పార్మాట్ లో ఆలోచిస్తే తొలిసగం అంతా వేరే స్ట్రిప్ట్ గా చూస్తే గంటలోపే క్లైమాక్స్ వేసేయచ్చు. కానీ డైరక్టర్ కాస్త డిటయిల్డ్ గా వెళ్లాడంతే. ఫస్టాప్ చూసిన తరువాత ఇప్పటి వరకు ఏ జరిగింది అని ఆలోచిస్తే గుర్తు వచ్చేందుకు పెద్దగా ఏమీ వుండదు. పైగా సినిమాటిక్ ఇంట్రస్ట్ కూడాలేదు.  
 
 
టెక్నికల్ గా…

రాజమౌళి దగ్గర ట్రైనింగ్ పొందిన వాడు, రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో చదువుకుని వచ్చినవాడు తీసిన సినిమా ఎలా ఉంటుంది. టెక్నికల్ గా అన్ని జాగ్రత్తలు తీసుకునే ఉంటారు కదా. అదే జరిగింది. అశ్విన్ కు దర్శకుడిగా ఇది డెబ్యూ మూవీ నే కానీ ఆ విషయం మనకు అనిపించదు. మేకింగ్ బాగుంటుంది. అయితే స్క్రిప్టే బోర్ కొట్టేయటంతో టెక్నికల్ వర్క్ అంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యిపోయింది. ఇక సంగత దర్శకుడు కాలభైరవ మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు.  సురేష్‌ రగుతు సినిమాటోగ్రఫీ లో అట‌వీ అందాల‌ను అద్బుతంగా కనిపించాయి. కాల‌భైర‌వ బ్యాక్ గ్రౌండ్స స్కోర్ మ‌రో స్పెషల్ ఎట్రాక్షన్‌. బుర్రా సాయిమాధ‌వ్ డైలాగులు అక్కడక్కడా ఆలోచనలో పడేస్తాయి. శ్రీకర్  ప్రసాద్ ఎడిటింగ్ మాత్రం అప్ టు ది మార్క్ లేదు అనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.  
 
ఆర్టిస్ట్ లలో ..

సముద్ర‌ఖ‌ని, గెట‌ప్ శీను, విన‌య్ వ‌ర్మ త‌ప్ప ఎవరూ మనకు తెలియదు. అంతా కొత్తవాల్లే. డ్రామా నుంచి వచ్చిన వాళ్లు బాగా చేసారు. అయితే వాళ్లెవరో తెలియకపోవటం వల్ల చాలా సీన్స్ ఎవరు ఏ క్యారక్టర్ తో మాట్లాడుతన్నారో అనేది కన్ఫూజ్ గా మారిందనేది కూడా నిజం. సముద్ర ఖని పాత్ర చిన్నది. సినిమా చివర్లో వస్తుంది.

బాగున్నవి
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్
టెక్నీషియన్స్ పనితనం
 ప్రొడక్షన్ వాల్యూస్

బాగోలేనివి
స్లో నెరేషన్
ఫస్టాఫ్
పాయింటాఫ్ ఇంట్రస్ట్ లేకపోవటం

చూడచ్చా
కొంచెం కష్టమే…కాకపోతే ఓటీటి మన చేతిలోనే ఉంది కదా ప్లే,పాజ్ చేసుకుంటూ చూసేద్దామనుకుంటే ఓ లుక్కేయచ్చు.

తెర ముందు..వెనుక
బ్యాన‌ర్‌: ఏయు అండ్ ఐ స్టూడియోస్
న‌టీన‌టులు: సముద్ర‌ఖని‌, విన‌య్ వ‌ర్మ‌, తేజ కాకుమాను, ప్ర‌శాంత్ త‌దిత‌రులు
మ్యూజిక్‌: కాల‌భైర‌వ‌
సినిమాటోగ్ర‌ఫీ: సురేష్ ర‌గుతు
డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా
ఎడిట‌ర్‌: శ్రీక‌ర్ ప్ర‌సాద్‌
ఆర్ట్‌: మోహ‌న్‌
నిర్మాత‌: ప‌ద్మ‌నాభ‌రెడ్డి
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: అశ్విన్ గంగ‌రాజు
రన్ టైమ్:2 గంటల 12 నిమషాలు
ఓటీటి: సోనీ లివ్