ఆకాశవాణి సినిమా లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌

Published On: July 10, 2021   |   Posted By:
ఆకాశవాణి సినిమా లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌
 
ఆకాశవాణి’ సినిమా నుంచి ‘దిమ్‌ సారె..’ అనే లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌
 
విల‌క్ష‌ణ న‌టుడు సముద్ర‌ఖని‌, విన‌య్ వ‌ర్మ‌, తేజ కాకుమాను, ప్ర‌శాంత్ కీల‌క పాత్ర‌ధారులుగా ఏయు అండ్ ఐ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ప‌ద్మ‌నాభ‌రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘ఆకాశ‌వాణి’. రాజ‌మౌళి వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన అశ్విన్ గంగ‌రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి శుక్రవారం చిత్ర యూనిట్‌ ‘దిమ్‌ సారె..’ అనే లిరికల్‌ పాటను విడుదల చేసింది.  ఓ గూడెంలోని ప్రజలందరూ చాలా బాధగా ఉంటారు. అలాంటి సందర్భంలో అందరూ ఆనందంగా ఉండాలని, సంతోషంగా జాతర జరుపుకోవాలని అనుకునే సందర్భంలో ఈ పాటను చిత్రీకరించారు. అనంత్‌ శ్రీరామ్‌ రాసిన ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. 
 
ఇటీవల కాలంలో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు సంగీతాన్ని అందించి, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కాల‌భైర‌వ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హించారు. ప్రముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు అందించారు.  సురేశ్ ర‌గుతు సినిమాటోగ్ర‌ఫర్‌గా వర్క్‌ చేశారు. . జాతీయ అవార్డ్ గ్ర‌హీత శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఈ చిత్రానికి ఎడిట‌ర్‌. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీగా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్‌కు, ‘మన కోన…’ అనే పాటకు చాలా మంచి స్పందన వచ్చింది. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేస్తామని చిత్ర యూనిట్‌ సభ్యులు తెలిపారు. 
 
న‌టీన‌టులు: 
సముద్ర‌ఖని‌, విన‌య్ వ‌ర్మ‌, తేజ కాకుమాను, ప్ర‌శాంత్ త‌దిత‌రులు
 
సాంకేతిక నిపుణులు:
మ్యూజిక్‌:  కాల‌భైర‌వ‌
సినిమాటోగ్ర‌ఫీ:  సురేష్ ర‌గుతు
డైలాగ్స్‌:  సాయిమాధ‌వ్ బుర్రా
ఎడిట‌ర్‌:  శ్రీక‌ర్ ప్ర‌సాద్‌
ఆర్ట్‌:  మోహ‌న్‌
నిర్మాత‌:  ప‌ద్మ‌నాభ‌రెడ్డి
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  అశ్విన్ గంగ‌రాజు