ఆకాశ వీధుల్లో చిత్రం ట్రైలర్ విడుదల

Published On: July 23, 2021   |   Posted By:

 

ఆకాశ వీధుల్లో చిత్రం ట్రైలర్ విడుదల

 

ఆకాశ వీధుల్లో ట్రైలర్ లోనే ఇంటెన్షన్ కనిపించింది : దర్శకుడు గోపీచంద్ మలినేని

గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా జి కె ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై గౌతమ్ కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ”ఆకాశ వీధుల్లో”. మనోజ్ డి జె, డా. మణికంఠ నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని హాజరై ట్రైలర్ ని విడుదల చేసారు.

అనంతరం దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ .. ఒకరోజు వీళ్ళు నాకు ఫోన్ చేసి ట్రైలర్ చూడమని చెప్పారు. నచ్చితేనే సపోర్ట్ చేయండి అన్నారు. ట్రైలర్ చూసాకా చాలా ఇంటెన్సింగ్ గా అనిపించింది. కొత్త దర్శకుడైనా కూడా మొదటి సినిమాకే ఇంత బాగా తీసాడంటే అతనిలో ఎంత తపన ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రైలర్ చూసి ఈ టీమ్ ను అబినందించాలనే ఈ వేడుకకు వచ్చాను. ఈ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. గౌతమ్ దర్శకుడిగా మొదటి సినిమా అయినా చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. నాకు దేవి ప్రసాద్ గారు చెప్పారు .. అయన ఒక దర్శకుడు అయి ఉండి ప్రస్తుతం నటుడిగా చేస్తున్నాడు. సినిమా చాలా అద్భుతంగా తీసాడని చెప్పాడంటే గౌతమ్ టాలెంట్ ఏమిటో అర్థం అవుతుంది. ఒక దర్శకత్వం మాత్రమే కాదు అటు హీరోగా కూడా చాలా ఇంటెన్స్ తో నటించాడు. ఇక తెలుగమ్మాయిలు తక్కువవుతున్న ఈ సమయంలో పూజిత హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. కొత్త టీం తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరోయిన్ పూజిత పొన్నాడ మాట్లాడుతూ .. టీజర్ చాలా బాగుంది. దర్శకుడు గౌతమ్ ని అభినందిస్తున్నాను. ఈ సినిమా విషయంలో అందరు కొత్తవాళ్లే నేనే సీనియర్ని అని అనుకునేదాన్ని, కానీ ఈ సినిమా షూటింగ్ లో గౌతమ్ టాలెంట్ చూసాక షాక్ అయ్యాను. మొదటి సినిమాకే ఈ రేంజ్ లో కష్టపడి ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. అలాగే ఈ సినిమాకు ఆయనే హీరో ఇలా మొదటి సినిమాకే హీరో, డైరెక్టర్ ఒక్కడే అయ్యి అన్ని పనులు దగ్గరుండి చూసుకోవడం మాములు విషయం కాదు. కానీ గౌతమ్ ఆ రెండు పనులు చక్కగా చేసి అదరగొట్టారు. ఈ సినిమాలో నేను పార్ట్ అయినందుకు ఆనందంగా ఉంది. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన జూడా శాండీ చక్కని సంగీతం అందించారు. ఒక పాటే విన్నాం .. అన్ని పాటలు వింటే అదిరిపోతాయి. అలాగే నిర్మాత మనోజ్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అయి టీం అందరికి మంచి పేరు తెస్తుంది అన్నారు.

నిర్మాత మనోజ్ మాట్లాడుతూ .. ఈ సినిమా చేస్తానని మా అబ్బాయి అన్నప్పుడు ఆ ఎదో చేస్తాడులే అని అందరిలా నేను అనుకున్నాను కానీ ఈ సినిమా షూటింగ్ లో మా అబ్బాయితో పాటు ఈ టీం పడుతున్న కష్టం చూసి నిజమే వీళ్ళు ఓ మంచి సినిమా చేస్తున్నారు అన్న నమ్మకం కలిగింది. నిజంగా ఓ గొప్ప చిత్రాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సినిమాలో ఇప్పటికే విడుదలైన ఓ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా నాలుగు సాంగ్స్ ఉన్నాయి .. అందులో రాహుల్ సిప్లిగంజ్ పాడిన సాంగ్ థియటర్స్ లో దద్దరిల్లి పోతుంది. అలాగే రాహుల్ రామకృష్ణ, చిన్మయి లాంటి వాళ్ళు పాడిన పాటలు కూడా అదిరిపోతాయి. తప్పకుండా మా సినిమా అందరికి నచ్చుతుందన్న నమ్మకం ఉంది అన్నారు.

హీరో , దర్శకుడు గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ .. సాధారణంగా హీరో, దర్శకుడు ఒక్కరే అయితే ఆ ఎదో డబ్బులున్నాయి కాబట్టి చేసుకుంటున్నారు అని అందరు అంటారు. కానీ అది కాదు .. ఈ సినిమాకు నేనే దర్శకుడు అవ్వడానికి కారణం .. ఒక కథను తెరపైకి ఎక్కించే క్రమంలో దర్శకుడు అన్ని విధాలుగా రెస్పాన్స్ తీసుకోవాలి, పైగా చెప్పే కథలో ఎక్కడ ఇంటెన్షన్ తగ్గకూడదని నేనే దర్శకత్వం వహిస్తున్నాను. ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాం. దాదాపు 160 పేజీల స్క్రిప్ట్ నేనొక్కణ్ణే రాసుకున్నాను. ఎవరి హెల్ప్ తీసుకోలేదు. సినిమా అంటే నాకు ప్యాషన్, అందుకే నేనే దగ్గరుండి చేస్తున్నాను. నేను మీలాగే అక్కడ కూర్చొని చాలా సినిమాల టీజర్, ట్రైలర్ వేడుకలు చుసిన వాడినే, కానీ మనలో టాలెంట్ ఉంది, దానిపై మనకు నమ్మకం ఉంటె తప్పకుండా ఎదో ఒకరోజు ఇక్కడా ఈ స్టేజి పై నిలబడతాం. మనం ఎదో చేస్తామని చెబితే ఎవరు నమ్మరు .. కానీ మనం ఏమిటో చేసి చూపిస్తేనే అందరు నమ్ముతారు. అందుకే మనపై మనకు నమ్మకం ఉండాలి. ఈ సినిమా కసితో చేసాం. ఇందులో ఓ మర్డర్ చేసిన వ్యక్తినో, గ్యాంగ్ స్టర్ నో హీరోగా చూపించలేదు. ఓ హార్ట్ బ్రేక్ అయిన వ్యక్తి గురించి చెప్పే కథ ఇది. చాలా నమ్మకంతో ఉన్నాం ..మా ప్రయత్నాన్ని అందరు ఆశీర్వదించాలి, తప్పకుండా మీ అందరికి ఈ సినిమా నచ్చుతుంది అన్నారు.

నటీనటులు : గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ, దేవి ప్రసాద్, బాల పరాశర్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షిత గౌర్ తదితరులు ..

ఈ చిత్రానికి
సాహిత్యం : చైతన్య ప్రసాద్, శ్రేష్ట, రాకేందు మౌళి, సింగర్స్ : సిద్ శ్రీరామ్, చిన్మయి శ్రీ పాద, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, డోప్ డాడీ.
సంగీతం : జూడా శాండీ,
కెమెరా : విశ్వనాధ్ రెడ్డి,
ఫైట్స్ : డ్రాగన్ ప్రకాష్,
సౌండ్ మిక్సింగ్ : కన్నన్ గణపతి,
నిర్మాతలు : మనోజ్ జెడి , డా. డీజే మణికంఠ
రచన, దర్శకత్వం : గౌతమ్ కృష్ణ