ప్రస్తుత సమాజానికి అద్దం పట్టే సినిమా – హీరో శ్రీకాంత్
అలివేలమ్మ ప్రొడక్షన్స్ సమర్పించు టి. అలివేలు నిర్మించిన కరణం బాబ్జీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆపరేషన్ 2019. శ్రీకాంత్, మంచుమనోజ్, సునీల్ నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అయిన సందర్భంగా ఆదివారం సక్సెస్‌మీట్‌ను జరుపుకుంది. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో…
చిత్ర హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ… ఈ చిత్రాన్ని ఇంత సక్సెస్ చేసినందుకు ముందుగా అందరికీ కృతజ్ఞతలు. ఈ చిత్రం ఒక ప్రపోజల్‌తో తీసిన చిత్రం. ప్రస్తుతం సమాజంలో ఉండే పరిస్థితులకి అనుగుణంగా ఉన్న చిత్రమిది.ఈ మధ్యకాలంలో నేను నటించిన చిత్రాల్లో నాకు నచ్చిన చిత్రమిది. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. చాలా పాజిటివ్ టాక్ వచ్చింది. పబ్లిక్ టాక్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒకళ్ళూ కనెక్ట్ అయ్యే చిత్రమిది. ప్రొడ్యూసర్ ఈ చిత్రం కొన్న బయ్యర్లు అందరూ సేఫ్ ఎవ్వరికీ నష్టం రాకూడదు. అంతా బానే ఉంది కాని మాకు కొంత అసంతృప్తి అన్నది కొన్ని రివ్యూస్ వల్ల అనిపించింది. ఎవరి అభిప్రాయం వాళ్ళది. మేము మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాం కాదనడంలేదు కాని. ఒక రివ్యూ ఇచ్చేటప్పుడు కొంచం ఆలోచించాలి. ప్రొడ్యూసర్ చాలా కష్టపడి ఒక చిత్రాన్ని నిర్మిస్తాడు. అందులో ఎంతోమంది టెక్నీషియలన్లకి పని దొరుకుతుంది. మీరు అలా రాయడం వల్ల కేవలం రేటింగ్స్ చూసి సినిమాకి వెళ్ళేవారు చాలా మంది ఉంటారు. ఒక సక్సెస్ వస్తే ఇండస్ర్టీలో చాలా మంది టెక్నీషియన్లకి పని దొరికినట్లే. అందరూ థియేటర్‌కి వెళ్ళి చూడండి అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి వరకు ప్రేక్షకులు మధ్యలో లెగకుండా సినిమా మొత్తం చూసి బయటకు వచ్చాడంటే సినిమా సక్సెస్ సాధించినట్లే. ఈ చిత్రం చూస్తే చాలా మంది జనాల్లో ఓటు ఎవరికి వెయ్యాలి అన్న ఎవేర్‌నెస్ వస్తుంది. ఈ చిత్రం చేసిన తర్వాత అప్పుడప్పుడూ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తే బావుంటదనిపించింది అని అన్నరు.
నటుడు శివకృష్ణ మాట్లాడుతూ… ఈ చిత్రం సక్సెస్ అయినందుకు డైరెక్టర్ బాబ్జీకి, ప్రొడ్యూసర్‌కి నా కృతజ్ఞతలు. నాకు అతి ఇష్టమైన హీరోల్లో శ్రీకాంత్ ఒకరు. సరైన టైంలో సరైన మెసేజ్ వచ్చిందని నా అభిప్రాయం. కులాలకి, మతానికి డబ్బులు తీసుకుని ఓటు వేస్తే ఎలా ఉంటది అన్న దాని గురించి తీసుకుని చూపించారు. ఈ చిత్రంలో నటించేటప్పుడు నాకు నా పాత రోజులు గుర్తుకువచ్చాయి. సినిమా గ్రాఫ్ ఎప్పుడైతే బావుంటుందో అప్పుడు సినిమా సక్సెస్ అయినట్లే నేను కూడా కొన్ని చిత్రాల్ని నిర్మించాను కాబట్టి నాకు తెలుసు అని అన్నారు.
దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ… నాకు తెలిసినంతవరకు సినిమా బాగోలేదు అని ఎవ్వరూ అనలేదు. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు బయటకు వచ్చి బావుందనే అన్నారు కాని బాలేదని మాత్రం ఎవ్వరూ అన్నలేదు. డైరెక్టర్‌గా ఫీల్ అయి సినిమా తియ్యలేదు బాధ్యత గల పౌరిడిగా ఫీల అయి తీశాను. డబ్బులు కోసం కూడా నేను సినిమా తీయలేదు. కేవలం ఒక బాధ్యతతో సినిమాని తీశాను. సినిమాలో పవన్ కళ్యాణ్‌ని తిట్టాను అన్నారు. నేను ఏమీ అనలేదు. ప్రేక్షకుల ఆదరణ చాలా బావుంది. ముద్దుల సినిమానే తియ్యాలని రూల్ లేదుగా. రెవెన్యూకూడా పెరుగుతూనే వస్తుంది. సినిమా చాలా బావుంది దయచేసి అందరూ థియేటర్‌కి వెళ్ళి చూడండి అందరికీ నా కృతజ్ఞతలు అన్నారు.
ప్రొడ్యూసర్ మాట్లాడుతూ… ఈ సినిమాని చాలా కష్టపడి తీశాను. హీరో, డైరెక్టర్ బాబ్జీగారు చాలా సహకారాన్ని అందించారు. ఒక కామన్ మ్యాన్ ప్రజలకు సేవ చెయ్యాలంటే ఎలా అని ఉన్న డబ్బులతో సీట్ కొన్ని ఎమ్ఎల్ఎ అయి ఏ విధంగా సహాయపడతాడు. రాజకీయ పరిణామాల పై వచ్చిన చిత్రం ఇది . ఓటు హక్కును మనం ఏ విధంగా వినియోగించుకోవాలి అన్నదాన్ని బట్టి మంచి కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రమిది అందరూ చూసి మీ ఆదరణ అందరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.
ఇంకా ఈ చిత్రంలో చిత్ర యూనిట్ అందరూ పాల్గొన్నారు.