ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు మూవీ రివ్యూ

Published On: March 3, 2023   |   Posted By:

ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు మూవీ రివ్యూ

ఎస్వీ కృష్ణారెడ్డి ‘ఆర్గానిక్ మామ – హైబ్రీడ్ అల్లుడు’ రివ్యూ

 Emotional Engagement Emoji 

కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి మంచి పేరు ఉంది. కథాకథనాలు మాత్రమే కాదు, సంగీతంపై కూడా ఆయనకి మంచి పట్టుంది. అందువలన ఆయన సినిమాలలో మ్యూజికల్ హిట్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటి కృష్ణారెడ్డి తాజాగా  ‘ఆర్గానిక్ మామ – హైబ్రీడ్ అల్లుడు’ రెడీ చేసి వదిలారు. మరి ఈ సినిమా కూడా అప్పటి ఆయన సక్సెస్ గ్రాఫ్ ని కంటిన్యూ చేసిందా, అసలు కథేంటి..సినిమా ఈ జనరేషన్ కు వర్కవుట్ అవ్వుతుందా రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్ :

రెండు వరస ఫెయిల్యూర్స్ తీసి ఖాళీగా ఉన్న దర్శకుడు విజయ్ (సోహెల్) . మూడో సినిమానైనా సక్సెస్ చేయాలని కలలుకనే అతన్ని తండ్రి మందలిస్తాడు. దాంతో తండ్రి చేసిన కొండపల్లి కొయ్య బొమ్మలు మార్కెట్ చేద్దామననుకుంటాడు. తన తెలివితో  విజయ్ ఓ స్టార్ హోటల్ తో టై-అప్ అయ్యి తండ్రి చేసే బొమ్మలను అమ్మే ప్రయత్నం చేస్తాడు. అక్కడ అతనికి హాసిని (మృణాళిని రవి) పరిచయం అవుతుంది. అతనిలోని మాటకారితనానికి ఆమె ఫిదా అయిపోతుంది.ఇంతకీ హాసిని ఎవరూ అంటే.. ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ స్టార్ హోటల్స్ కు కూరగాయలు సప్లయ్ చేసే వెంకట రమణ (రాజేంద్ర ప్రసాద్) కూతురు. తన కూతురుని చక్కగా ఓ డబ్బున్న వాడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటాడు. ఆమె బొమ్మలు అమ్ముకునే కుర్రాడితో ప్రేమలో పడుతుంది. ఆ ప్రేమకు చెక్ చెప్పాలనుకుంటాడు వెంకట రమణ. మరో ప్రక్క విజయ్ కు మనికొండ (సునీల్) ప్రొడ్యూసర్ దొరుకుతాడు.  ఇప్పుడు విజయ్ ముందు ఉన్నవి రెండు లక్ష్యాలు ఒకటి సినిమా తీసి హిట్ కొట్టడం రెండోది తన ప్రేమను ఒప్పించుకుని పెళ్లి చేసుకోవటం…ఈ రెండు విజయ్ ..విజయవంతంగా చేయగలిగాడా లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ :

‘’రిచ్ నెస్ అనేది డబ్బులోనో ఆస్తిలోనో వుండదు. అది మనిషి వ్యక్తిత్వంలో వుంటుంది’’అని బలంగా చెప్దామని గ్యాప్ తీసుకుని తయారు చేసుకున్న కథతో ముందుకు వచ్చారు ఎస్వీ కృష్ణారెడ్డి. అయితే ఆయన ఇంటర్వూలలో ట్రెండ్ ని ఫాలో అవుతున్నాని అన్నారు కానీ నిజానికి ఆయన నైంటీస్ ట్రెండ్ నే ఇంకా ఫాలో అవుతున్నారని సినిమా ప్రారంభమైన పది నిముషాలకే అర్దమైపోతుంది. సినిమాలో కథ లేదు..కొన్ని కామెడీ ట్రాక్ లతో సినిమాను లాగే ప్రయత్నం చేసారు. రాజేంద్రప్రసాద్ తో తనకున్న ప్రత్యేక అనుబంధంతో ఆయన సీన్స్ పెంచాలి అనుకున్నారు కానీ కథ ఎటు వెళ్తోంది చూసుకోలేదు. అలాగే ఎంతసేపు క్లీన్ గా ఉండాలి మూవి అనుకున్నట్లు ఉన్నారు.ఎమోషన్ పండకపోతే ఎంత క్లీన్ గా ఉన్నా ఫలితం లేదు.  హీరో లవ్ ట్రాక్ ఫస్టాఫ్ నింపేసారు. అది పరమ బోరింగ్ వ్యవహారం. సెకండాఫ్ లో మెల్లిగా కథలోకి వచ్చారు కానీ ప్రక్క ట్రాక్ లు వచ్చి డామెనేట్ చేసి అసలు కథను మర్చిపోయేలా చేసాయి.   దానికి తోడు  చాలా సింపుల్ స్టోరీ. ఎలాంటి ట్విస్ట్స్ అండ్ టర్న్ లేకుండా ప్లాట్ స్క్రీన్ ప్లే తో చెప్పే ప్రయత్నం చేసారు. రాజేంద్రప్రసాద్ పాత్ర చాలా పాజిటివ్ గా ఉంటుంది. దాంతో ఎక్కడా కాంప్లిక్ట్స్ అనేది పుట్టదు. దాంతో బోర్ కొట్టేస్తుంది.

టెక్నికల్ గా :

ఈ మూవీలో చెప్పుకొ దగ్గ ఎలిమెంట్ ,  హైలైట్ సి. రాం ప్రసాద్ సినిమాటోగ్రఫీ. పాటలు కూడా బాగున్నాయి.  డైలాగ్స్ బాగా పేలాయి. యాక్షన్ కొరియోగ్రఫీ బాగా చేసారు. నిర్మాత కోనేరు కల్పన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.    అయితే…అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు.. కథ ఎంపిక దారుణంగా ఉంది.  దాదాపు పదేళ్ళ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి మూవి ..అంచనాలను ఎక్కడా రీచ్ కాలేదు.

నటీనటుల్లో :

సీనియర్ నటుడు రాజేంద్రపసాద్ ఏ పాత్రలో అయినా ఇమిడిపోతాడు. ఆయన మెచ్యూర్డ్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. మీనా పాత్ర వెరీటైగా క్లాస్ లు పీకుతూ బాగుంది. యంగ్ హీరో సోహెల్ తన క్యారెక్టర్ కు పెద్దగా వంక పెట్టడానికి లేదు  సునీల్ తన అమాయికత్వంతో కూడిన ఫన్ మరోసారి బాగా  చూపించాడు. అజయ్ ఘోష్ వంటి సీనియర్స్ కు అల‌వాటైన పాత్ర‌లే అవి. వాటి ప‌రిధి మేర‌కు ప్ర‌భావ‌వంతంగానే న‌టించారు.  ఇత‌ర పాత్ర‌లకి పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. . హీరోయిన్ గా  మృణాళిని రవి ఓకే.

చూడచ్చా :

ఓటిటిలలో ఓ లుక్కేయచ్చు కానీ మరీ థియేటర్ కు పనిగట్టుకుని వెళ్లి చూస్తే నిరాశపడతాం.

నటీనటులు :

సునీల్‌, కృష్ణభగవాన్‌, సన, ప్రవీణ్‌, సప్తగిరి, అజయ్‌ఘోష్‌, రాజా రవీంద్ర, సురేఖ వాణి, పృథ్వి, చలాకీ చంటి, సూర్య,
రాజారవీంద్ర

సాంకేతికవర్గం :

కెమెరా: సి. రాంప్రసాద్‌,
ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి,
ఆర్ట్‌: శివ,
పాటలు: చంద్రబోస్‌, రామజోగయ్య, శ్రీమణి,
సమర్పణ: కె. అచ్చిరెడ్డి,
నిర్మాత: కోనేరు కల్పన,
Runtime:2 hrs
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి.
విడుదల తేదీ: 03, మార్చి 2023