Reading Time: 2 mins

ఇక్షు చిత్రం ఎన్టీఆర్ డైలాగ్ విడుదల

పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై హనుమంత రావు నాయుడు , డాక్టర్ గౌతం నాయుడు సమర్పణలో  రాం అగ్నివేష్ కథానాయకుడిగా రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి నటీనటులుగా ఋషిక దర్శకత్వంలో డాక్టర్ అశ్విని నాయుడు నిర్మించిన చిత్రం “ఇక్షు”. ఎన్టీఆర్ జన్మదినం సందర్బంగా ఈ సినిమా లోని ఎన్టీఆర్ డైలాగ్ ను  హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా

 హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ… పద్మజ ఫిల్మ్ ఫ్యాక్టరీస్ నిర్మించిన సినిమా ఇక్షు, అలాగే ఈ సినిమా కి  స్టోరీ స్క్రీన్ప్లే, డైరెక్షన్ -రుషిక మరియు ప్రొడ్యూసర్ -అశ్విని నాయుడు, మంచి క్వాలిటీస్ తో సినిమా పైన ప్యాషన్ తో ఈ సినిమాని నిర్మించారు.ఫస్ట్ టైం హీరోగా రామ్ అగ్నివేశ్ ఇండస్ట్రీకి ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు, ఈ సినిమాలో ఒక సన్నివేశం ఎన్టీఆర్ గారి ఫేమస్ అయిన డైలాగ్ వుంది. ఆ డైలాగ్ ని హీరో రామ్ అగ్నివేశ్ సింగిల్ టేక్ లో చెప్పటం చాలా గొప్ప విషయం, ఆ డైలాగ్ ఎన్టీఆర్ గారి లాంటి గెటప్ వేసుకొని డైలాగ్ చెప్పటం గొప్ప విషయం, ఎన్టీఆర్ గారి జన్మదినం సందర్బంగా పోస్టర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ వెర్షన్ నేను రిలీజ్ చేయటం చాలా ఆనందంగా వుంది, కొత్త వాళ్ళు అయినా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్  మంచి క్వాలిటీతో సినిమా నిర్మించారు. ఈ సినిమా టీమ్ అందరికి నా బెస్ట్ విషెష్ తెలుపుతున్నాను,

 డైరెక్టర్ రుషిక మాట్లాడుతూ… మేము అడిగిన వెంటనే హీరో శ్రీకాంత్ ఒప్పు కున్నందుకు నా ధన్యవాదములు, ఆ పోస్టర్ లాంచ్ చేసిన తరువాత, ఆ డైలాగ్ వెర్షన్ చూసిన తరువాత హీరో రామ్ అగ్నివేశ్ ని చాలా సపోర్ట్ చేశారు, మా సినిమా లో కొన్ని సన్నివేశాలు చూసి మంచి ప్రశంసలు ఇచ్చారు.

 హీరో రామ్ అగ్నివేశ్ మాట్లాడుతూ. . హీరో శ్రీకాంత్ గారు నా సినిమా పోస్టర్ అండ్ డైలాగ్ లాంచ్ చేయటం చాలా ఆనందంగా వుంది, నేను భయపడుతూ వున్నాను ఆయన నన్ను దగ్గరకి తీసుకోని చాలా బాగాచేసావ్ అని మెచ్చు కున్నారు,

 ప్రొడ్యూసర్ అశ్విని నాయుడు మాట్లాడుతూ.. శ్రీకాంత్ గారికి చాలా ధన్యవాదములు, మేము అడిగిన వెంటనే ఒప్పుకున్నారు, సినిమా లో చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పారు, ఎన్టీఆర్ గారి జన్మదినం సందర్బంగా ఈడైలాగ్ వెర్షన్ టీజర్ లాంచ్ చేయటం చాలా ఆనందం గా వుంది, ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము

నటీనటులు :

రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి, తదితరులు

సాంకేతిక. నిపుణులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఋషిక
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ గుత్తుల, చిత్రం శ్రీను
మూల కథ: సిద్ధం మనోహర్
కెమెరా: నవీన్ తొడిగి
పాటలు:-కాసర్ల శ్యామ్
మ్యూజిక్: వికాస్ బాడిస
ఎడిటింగ్: ఎస్ బీ ఉద్ధవ్
ఆర్ట్స్: రాజు
మాటలు: మున్నా ప్రవీణ్
కొరియోగ్రఫీ: భాను