ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీ రివ్యూ
Rating:1.5/5
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే వెరైటీగా అనిపించే ఇంట్రెస్టింగ్ టైటిల్. అలాగే సినిమా టీజర్.. ట్రైలర్లో కథ గురించి పెద్దగా హింట్స్ ఇవ్వకుండా ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ మాత్రమే చూపించటం ఆసక్తి రేకెత్తించగలిగింది. అసలే అరకొర సక్సెస్ లతో కెరీర్ ని నెట్టుకుంటూ వస్తున్నాడు సుశాంత్. అయితే “అల వైకుంఠపురములో”తో సహాయ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న సుశాంత్ తాజాగా “ఇచ్చట వాహనములు నిలుపరాదు” అంటే సరైన కథే ఎంచుకునే ఉంటాడని ఆశిస్తాం. కొన్ని నిజ సంఘటనల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఓటీటి డైలమోని వీడి థియోటర్ లో విడుదలైంది. మరి సుశాంత్ ఈ చిత్రం అయినా సాలిడ్ సక్సెస్ ఇచ్చిందా. ఈ సినమాతో సోలో హీరోగా స్థిరపడగలిగాడో లేదో చూద్దాం..!!
స్టోరీ లైన్
లైఫ్ ని సరదాగా లీడ్ చేస్తూంటాడు ఆర్కిటెక్ట్ అరుణ్ (సుశాంత్). అతను పనిచేస్తోన్న అఫీస్ లోనే అతని జూనియర్ గా జాయిన్ అవుతుంది మీనాక్షి (మీనాక్షి చౌదరి). వీరిద్దరి మధ్య సాగిన కొన్ని సంఘటనలతో ఇద్దరు ప్రేమలో పడతారు. నచ్చిన ఉద్యోగం, ప్రేమించిన అమ్మాయి, మంచి ఫ్రెండ్స్ ఇలా జీవితం చాలా సాఫీగా సాగిపోతుంటుంది. ఈ తరుణంలో అరుణ్ జీవితంలోకి వస్తుంది కొత్త బైక్ వస్తుంది .ఓ రోజు మీనాక్షి ఇంటిలో ఎవరు లేరు అని తెలిసి ఆమె కోసం అరుణ్ మీనాక్షి ఇంటికి సీక్రెట్ గా బైక్ పై వెళ్తాడు వెళ్తాడు. అదే టైమ్ లో ఆ ఏరియాలో ఓ సీరియల్ నటిపై హత్యా ప్రయత్నం జరుగుతుంది. ఆమె ఇంట్లో నగలు దొంగతనానికి గురవుతాయి. అరుణ్ వేసుకొచ్చిన బైక్ దొంగదేనని భావించి.. అతడి అంతు చూడాలని కాలనీలో అందరూ తీవ్ర ఆవేశంతో ఎదురు చూస్తుంటారు. వారిని నుంచి అరుణ్ ఎలా తప్పించుకున్నాడు? మీనాక్షి, అరుణ్ కలిశారా ? లేదా ? అసలు సీరియల్ నటిపై హత్యాయత్నం చేసిందెవరు? పులి(ప్రియదర్శి)కి అరుణ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇందులోకి నర్సింహ యాదవ్(వెంకట్) ఎలా ఎంటర్ అయ్యాడు?. ఒక బైక్ లవ్ స్టోరీకి బ్రేక్ ఎలా వేసింది? అరుణ్ జీవితం ఒక బైక్ వల్ల ఎలా మారింది అనేది “ఇచ్చట వాహనములు నిలుపరాదు” కథాంశం.
స్క్రీన్ ప్లే ఎనాలసిస్..
కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ను బేస్ చేసుకొని కథను రాసుకోవడం అనేది వినటానికి బాగానే ఉంది కానీ.. స్క్రీన్ ప్లే రాసుకోవటంలో దెబ్బతిన్నాడు. చాలా భాగం బిగిన్ ,మిడిల్ ఎండ్ సరిగ్గా లేని అరకొర సీన్స్, కథకు అవసరం లేని జస్టిఫికేషన్స్, అక్కరకు రాని ఇన్సిడెంట్స్ ప్రేక్షకులకు పరీక్ష పెట్టాయి. డైరక్టర్ కు పాయింట్ ఎంచుకోవటం వరకూ అతను సక్సెస్ అయ్యాడు కానీ, దాని ఎగ్జిక్యూషన్ లో దారుణంగా ఫెయిలయ్యాడు.ముఖ్యంగా తాను అనుకున్న స్టోరీ లైన్ థ్రిల్లర్ అనే విషయం మర్చిపోయాడు. దాంతో కథకు అక్కర్లేని కామెడీ.. లవ్ అంటూ స్క్రీన్ టైమ్ వృథా చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అది బాగా విసుగెత్తించింది. పోనీ కథలోకి వచ్చాక అయినా సరైన ట్రాక్ లో వెళ్తాడేమో అనుకుంటే అక్కర్లేని పాత్రలు..అంతా గందరగోళం.. ఇంట్రస్ట్ లేని ముగింపు వల్ల ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో విఫలమైంది. అంతెందుకు ఒక బైక్ షోరూంలో హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ ను పెట్టి కామెడీ చేయించే సీన్స్ చూస్త ఈ సినిమా ఎలాంటిదో అర్దమైపోతుంది. అవగాహన లేకుండా రాసుకున్న ట్రీట్మెంట్ ఫలితం ఈ సీన్స్ ..సినిమా అని మనకు సగంలోనే స్పష్టమయ్యి..మిగతా సగం తప్పదురా అని చూస్తాము. ఓవరాల్ గా చెప్పాలంటే పాయింట్ కొంచెం కొత్తగా అనిపించినా.. సెకండాఫ్ లో కొన్ని మూమెంట్స్ ఆకట్టుకున్నా..ఫలితం లేదు.
టెక్నికల్ గా..
ఇక డైరక్టర్ అవగాహనా లోపమో లేక బడ్జెట్ ఇష్యూస్ వల్లనో లేక ప్రీప్రొడక్షన్ సరిగా ప్లాన్ చేసుకోకపోవడం వల్లనో ఎగ్జిక్యూషనల్ గా చాలా మిస్టేక్స్ కనిపిస్తూంటాయి. ప్రవీణ్ లక్కరాజు బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా హంగామాగా ఉంది. సాంగ్స్ బాగున్నాయి. కెమెరా వర్క్ బాగుంది కానీ.. కలర్ కరెక్షన్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొవాలి. ప్రొడక్షన్ డిజైన్ బాగుంది ఓకే.. ఆర్ట్ వర్క్ ఇంకాస్త బెటర్ గా ఉండొచ్చు. సురేష్ బాబా-భాస్కర్ రాసిన డైలాగులు బాగున్నాయి.
నటీనటుల్లో …. సుశాంత్ ప్రత్యేకంగా పెర్ఫామెన్స్ పరంగా చేసిందేమీ లేదు. ఈ కథకు.. పాత్రకు తగ్గట్లుగా అతను సూట్ కాలేదు.హీరోయిన్ మీనాక్షి చౌదరి జస్ట్ ఓకే..చెప్పుకోవటానికి ఏమీ లేదు. లాంగ్ గ్యాప్ తర్వాత కనిపించిన వెంకట్ చేయడానికి సినిమాలో అంత సీన్ లేదు. ఉన్నంతలో అభినవ్ గోమటం బాగా చేశాడు. రవివర్మ ఎప్పటిలాగే ఓకే. వెన్నెల కిషోర్ ఏమీ నవ్వించలేకపోయాడు.
బాగున్నవి :
టైటిల్
సెకెండ్ హాఫ్ యాక్షన్ ,
హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ,
బాగోలేనివి :
స్క్రీన్ ప్లే,
ఫస్ట్ హాఫ్
బోరింగ్ ట్రీట్మెంట్,
చూడచ్చా
ఓటీటిలో వచ్చేదాకా వెయిట్ చేయచ్చు. అంత అర్జెంటుగా వెళ్లి చూడక్కర్లేదనిపిస్తుంది.
తెర ముందు..వెనక
నటీనటులు: సుశాంత్-మీనాక్షి చౌదరి-వెంకట్-వెన్నెల కిషోర్-ప్రియదర్శి-అభినవ్ గోమటం-రవి వర్మ తదితరులు
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
ఛాయాగ్రహణం: సుకుమార్
మాటలు: సురేష్ బాబా-భాస్కర్
నిర్మాతలు: రవిశంకర్ శాస్త్రి-ఏక్తా శాస్త్రి-హరీష్ కోయలగుండ్ల
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: దర్శన్
రన్ టైమ్: 2గంటల,31 నిముషాలు
విడుదల తేదీ: 28,ఆగస్ట్ 2021.