ఇదం జగత్ మూవీ రివ్యూ
ఇదేం జగత్ ..(‘ఇదం జగత్ మూవీ రివ్యూ’)
Rating: 1.5/5
నెక్ట్స్ సంక్రాంతికి సినిమాలు రెడీ అయ్యిపోతున్నాయి. ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ బంచ్. మళ్ళీ థియోటర్స్ దొరకాలంటే చాలా కాలం పడుతుంది. దాంతో చాలా చిన్న సినిమాలు ..థియోటర్ ఫీడింగ్ కోసమే తీసినట్లుగా రిలీజ్ డేట్స్ పెట్టేసుకుంటున్నాయి. ఈ రిలీజ్ లు చూస్తూంటే …సినిమా ఆడుతుందని రిలీజ్ చేస్తున్నారా లేక ఎలాగోలా సినిమా బయిటపడితే చాలు అన్నట్లు గా థియోటర్స్ లోకి తోస్తున్నారా అనేది అర్దం కాదు. లేకపోతే ‘సుబ్రహ్మణ్యపురం’ వచ్చి రెండు వారాలు తిరక్కముందే సుమంత్ మరో సినిమా వచ్చేయటం ఏమిటి. అయితే ఈ సినిమాకు కొద్దో గొప్పో క్రేజ్ ని ట్రైలర్స్ తీసుకొచ్చాయి. దాంతో ఏమో…గుర్రం ఎగరావచ్చు అన్నట్లుగా ఈ సినిమా ఆడేయచ్చేమో అన్న ఆశలు కలిగించాయి అటు సుమంత్ లోనూ, సినీ ప్రియుల్లోనూ…వారి ఆశలు, అంచనాలు ఎంతవరకూ నిజం అయ్యాయి. సినిమా ఎలా ఉంది… టైటిల్ ఏంటి ఇలా ‘ఇదం జగత్’ అని పెట్టారు, కథ ఏంటి వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ లోకి వెళ్ళాల్సిందే. కథ ఏంటంటే…
కథ ఇదే
నిషిత్(సుమంత్) కు ఉన్న నిద్రపట్టని జబ్బుకు పరిష్కారం…నైట్ జాబ్ వెతుక్కోవటమే అని అర్దం చేసుకుంటాడు. పగలే అతనికి పని ఇచ్చేవారు ఎవరూ కనపడరు. అలాంటిది నైట్ అంటే కష్టం కదా. రాత్రిళ్లు జరిగే చీకటి వ్యవహారాల్లోకు దిగాలి. అలాంటివాటి కన్నా..రాత్రిళ్లు సిటీలో చోటు చేసుకునే అనేక సంఘటనలు కవర్ చేసే వాళ్లు ఉండరు కాబట్టి వాటిని తను కెమెరాలో బంధించి, మంచి రేటుకు అమ్ముకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన…రాత్రిళ్లు పనిచేసే ప్రీలాన్స్ రిపోర్టర్ గా మార్చేస్తుంది.
అక్కడ నుంచి సిటీలో రాత్రిళ్లు జరిగే క్రైమ్ సంఘటనలను షూట్ చేసిఆ ఫుటేజ్ ను ఛానెల్ కు అమ్ముకుని భారీగానే డబ్బు సంపాదిస్తాడు. ఈ లోగా అతనికి మహతి (అంజు కురియన్) పరిచయం అవుతుంది. ఆమెతో ప్రయాణం చేస్తూంటే ఈ లోగా ఓ రోజు రాత్రి ఓ మర్డర్ ని షూట్ చేస్తాడు. అయితే ట్విస్ట్ ఏమిటంటే..ఆ మర్డరైంది మరెవరో కాదు..మహతి తండ్రి. అదంతా సుమంత్ రికార్డు చేసి,ఎప్పటిలాగే దాన్ని భారీ మొత్తంలో క్యాష్ చేసుకోవాలనుకుంటాడు. ఆ విషయం మహతికు తెలిసిందా..సమంత్ ఆ ఫుటేజ్ తో డబ్బులు సంపాదించాడా.. ? ఆ మర్డర్ చేసింది ఎవరు ? వంటి విషయాలు తెలియాలంటే ఈసినిమా చూడాల్సిందే. విశ్ల్షేషణ
కాపీ కొట్టడం ఓ కళ..అందులో కొందరు మాస్టర్ డిగ్రీ పొందితే మరికొందరు మామూలు డిగ్రీ దాకా కూడా రాలేక డింకీలు కొడుతూంటారు. అలాంటి క్రియేటర్స్ తో పెద్ద సమస్య. కాపీ కొట్టాలి..కొట్టినట్లు తెలియకూడదు..అనే కాన్సెప్టుని ఫాలో అవతూంటారు. దాంతో ఒరిజనల్ లో ఉన్న సోల్ ని వదిలేసి…తమ పైత్యం కలిపిసి కథ వండేస్తూంటారు. దాంతో అది కథలా కాకుండా రుచిపచిలేని కిచిడీలా మారి డైజస్ట్ కావటం కష్టమవుతుంది. సుమంత్ తాజా చిత్రం ‘ఇదం జగత్’ ది అదే పరిస్దితి.
హాలీవుడ్ లో వచ్చిన Nightcrawler (2014)నుంచి మూల కథను లేపేసారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ దాన్ని మన నేటివిటికి తెచ్చే క్రమంలో తప్పటడుగులు వేసారు. ఇష్టం వచ్చినట్లుగా సీన్స్ వేసుకుంటూ ఇష్టారాజ్యంగా మార్చేసారు. దాంతో ఇంటర్వెల్ కు అయినా రావాల్సిన విలన్ ..క్లైమాక్స్ దాకా రాడు. వాడికి ఫలానా వాడు హీరో అనే విషయం తెలిసినట్లు అనిపించడు. ఓహో..నువ్వా హీరోవు..అని తెలుసుకుని నీ దగ్గర నేను చేసిన క్రైమ్ కు సంభందించిన ఫుటేజ్ ఉందా అని రియలైజ్ అయ్యేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. కథ క్లైమాక్స్ కు వచ్చేస్తుంది. జనాలకు సెల్ ఫోన్స్ లో టైమ్ చూసుకుని,ఎగ్జిట్ వైపు చూస్తూంటారు.
అలాగే ఈ సినిమా హాలీవుడ్ లో థ్రిల్లర్ . కానీ దాన్ని దర్శకుడు తన తెలివితో ఓ పద్దతి పాడు లేని తెలుగు సినిమా కథగా మార్చేసాడు. అన్నీ మన ఊహకు అందే సీన్సే కనపడుతూంటాయి. మన ఊహా శక్తికి పరీక్ష పెడుతూంటాయి.
అయినా మన ఛానెల్స్ ..ఓ వీడియో ఫుటేజ్ ని లక్షలు పెట్టి కొనేసి..ప్రసారం చేస్తాయా..అంత సీన్ ఉందా..నిజంగా వాళ్లు కొనుక్కోవాలంటే అందులో ఏ స్దాయి ఫుటేజ్ ఉండాలి..ప్రపంచాన్ని కుదిపేసేది ఉండాలి..ఆ విషయం డైరక్టర్ మర్చిపోయినట్లున్నారు. టెక్నికల్ గా ..
శ్రీ చరణ్ పాకాల ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. థ్రిల్లర్ సినిమా మూడ్ సెట్ చేసాడు. బాల్ రెడ్డి కెమెరా వర్క్ చాలా సాదా సీదాగా ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ అయితే మరీ నాశిరకం. డైరక్టర్ గా అనిల్ శ్రీకాంతం కష్టం అనిపించాడు. ఐడియా లెవిల్లో కథని బాగానే పట్టుకున్నా..దాన్ని ట్రీట్ మెంట్ గా రాసుకుని, ఎగ్జిక్యూట్ చేయడంలో పూర్తిగా ఫెయిలయ్యాడు
చివరి మాట
ఈ థ్రిల్లర్ లో ఎక్కడా పొరపాటును కూడా మనని థ్రిల్ అవ్వనివ్వడు. థియోటర్ ఫుల్ అవ్వనివ్వడు.
తెర వెనక..తెర ముందు
నటీనటులు: సుమంత్, అంజుకురియన్, సత్య, శివాజీరాజా తదితరులు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి
ఎడిటింగ్: గ్యారీ
నిర్మాత: జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ శ్రీకాంతం
బ్యానర్: విరాట్ ఫిల్మ్స్, శ్రీ విఘ్నేష్‌కార్తీక్ సినిమాస్
విడుదల: 28-12-2018
Attachments area