Reading Time: 2 mins
ఇది కల కాదు చిత్రం ఫిబ్రవరి రిలీజ్
 
ప్రస్తుతం కోవిడ్ కారణంగా ప్రభుత్వ నిబంధనలననుసరించి అన్ని జాగ్రత్తలు తీసుకుని మా చిత్రం *”ఇది కల కాదు”*ఫిబ్రవరి 19 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆ చిత్ర దర్శకులు అదీబ్ నజీర్ వెల్లడించారు. మా ఈ చిత్రం ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని అన్నారు.
 
ప్రస్తుత సమాజంలో స్త్రీలంటే ఒక ఆట బొమ్మగా చూస్తున్నారు. ఆ స్త్రీ పై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాల ను దృష్టిలో పెట్టుకొని చిత్ర నిర్మాణం చేపట్టారు ప్రముఖ దర్శకులు అదీబ్ నజీర్. ఆ చిత్రమే ”ఇది కల కాదు”.ఇందులో ప్రతి ఫ్రేమ్ మన చుట్టుపక్కల జరుగుతున్న యథార్థ సంఘటనలే ఈ చిత్రంలో హైలెట్ గా నిలుస్తుందని దర్శకులు తెలిపారు. 
 
ఇతివృత్తానికి తగ్గట్టు పాటలు సంగీతం, కథాంశం ఉన్నాయన్నారు. ముఖ్యంగా ప్రతి పౌరుడికి సందేశాత్మకమైన చిత్రమని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలో ఐదు పాటలున్నాయన్నారు.
 
ఈ సినిమా లోని ప్రతి పాట సన్నివేశానికి అనుగుణంగా నిర్మించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ ఐదు పాటలు సంగీతప్రియులకే కాకుండా పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో ఉంటాయన్నారు. ముఖ్యంగా ఈ చిత్రానికి కథాంశంతో పాటు పాటలు హైలెట్ గా నిలుస్తుందని దర్శకులు తెలిపారు. 
 
ఈ చిత్రంలో నటించిన ప్రతి ఆర్టిస్ట్ మన మధ్యలో ఉన్న పాత్రల మాదిరిగా ఉంటుందన్నారు. 
 
ఫ్రతి క్యారెక్టర్ తమ డైలాగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా సకుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని ఆయన పేర్కొన్నారు. 
 
ఈ చిత్రంలో అదీబ్ నజీర్, తెలుగు తెరకు తొలి పరిచయం దానికా సింగ్, షఫీ, బెనర్జీ, వైభవ్ సూర్య,  పూజిత జొన్నలగడ్డ, డాక్టర్ శ్రీజ, విద్యాసాగర్, మహి మహేంద్ర, బాషా, జామా, షేక్ గుల్జార్ గౌస్, నరేంద్ర దావడా, హారిక, మాధవి, రజియా, అనిల్, సురేష్, శ్రీధర్ స్వామి, లక్ష్మణ్, దీపు తదితరులు నటించారని పేర్కొన్నారు. 
 
కెమెరామెన్ వి.సత్యానంద్, సహ నిర్మాత, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, రుబియా కౌ కబ్. కో డైరెక్టర్ గా షేక్ గుల్జార్ గౌస్. అసిస్టెంట్ డైరెక్టర్ గా నరేంద్ర దావడా పరిందా ఆర్ట్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రానికి  కథ, దర్శకత్వం అదీబ్ నజీర్. తాను ఇందులో ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నట్లు దర్శకులు అదీబ్ నజీర్ పేర్కొన్నారు. 
 
ప్రముఖ దర్శకులు లక్ష్మీ దీపక్, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గార్ల వద్ద నేర్చుకున్న పాఠాలే నేడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించినట్టు అదీబ్ నజీర్ పేర్కొన్నారు. 
 
ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అదీబ్ నజీర్, పాటలు అదీబ్ నజీర్, ఈశ్వర్, జి.బాబు, పాడిన వారు సావన్ హుస్సేన్, ఈశ్వర్, అఖిల, మధులత & శ్వేత. 
 
ఈ సినిమా ప్రతి ఒక్కరి గుండెలకు హత్తుకునేలా ఉంటుందని ప్రతి సీన్ లో ‌చిన్న, పెద్ద క్యారెక్టర్ అని కాకుండా ప్రతిపాత్రకు ఫ్రేం చాలా రిచ్ గా తీసామని అదీబ్ నజీర్ అన్నారు. మా సినిమా లోని ఫ్రతి పాత్ర మనచుట్టూ ఉన్న వ్యక్తులు గా తారసపడతారని ఆయన అభిప్రాయపడ్డారు.
  
ఇదిలా ఉండగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన తెలుగు ప్రేక్షక దేవుళ్ళు ఈ చిత్రాన్ని చూసి.. ఇలాంటి ఇతివృత్తం కలిగిన సినిమాలు నిర్మించేందుకు మనోధైర్యాన్ని, అవకాశాన్ని కల్పించాలని, ప్రేక్షక దేవుళ్ళు ఆశీర్వదించాలని ఆయన కోరారు.