ఇద్దరిలోకం ఒకటే డిసెంబర్ విడుదల
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో డిసెంబర్ 25న ఫీల్ గుడ్ లవ్‌స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాజ్‌తరుణ్, షాలిని పాండే ‘ఇద్దరిలోకం ఒకటే’
యంగ్ హీరో రాజ్‌తరుణ్, షాలిని పాండే జంటగా రూపొందుతోన్నలవ్ ఎంటర్టైనర్ ‘ఇద్దరి లోకం ఒకటే’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. జీఆర్.క ష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను పొందింది. క్రిస్మస్ సందర్భంగా సినిమాను డిసెంబర్ 25న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా…
దిల్‌రాజు మాట్లాడుతూ – ”2019 సంక్రాంతికి ఎఫ్2, సమ్మర్లో మహర్షి వంటి బ్లాక్‌బస్టర్స్ సాధించాం. ఈ ఏడాది నాలుగైదు సినిమాలు ఉంటాయనుకున్నాం. కానీ ఈ ఏడాది మూడు సినిమాలతోనే ముగిస్తున్నాం. మూడో చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. దర్శకుడు జీఆర్.కృష్ణ ఓ టర్కీ సినిమా చూసిన ఆ ఐడియాను నాకు చెప్పాడు. అక్కడ నుండి మన నెటివిటీకి తగిన విధంగా కథను డెవలప్ చేశాం. ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ. ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే ప్రేమకథ. చిన్నప్పట్నుంచి హీరో, హీరోయిన్ మధ్య ఇంటిమెసీ ఎలా ఉంటుంది? ఇద్దరూ అనుకోకుండా విడిపోయి.. ఎలా కలిశారు? వారిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? అనేది కథ. ఈ సినిమా కథ తెలుసుకున్న రాజ్‌తరుణ్ నన్ను వచ్చి కలిసి ‘సార్! కథ బావుందని విన్నాను. నేను చేస్తానండి’ అన్నాడు. అలా సినిమా మొదలైంది. సినిమాల్లో ఒకప్పటితో పోలిస్తే చాలా మార్పులు జరుగుతున్నాయి. డైరెక్టర్ ఈ సినిమా కోసం మిక్కి జె.మేయర్, సమీర్ రెడ్డి, అబ్బూరి రవి, తమ్మిరాజు వంటి టాప్ టెక్నీషియన్స్‌ను సెలక్ట్ చేసుకున్నాడు. కథ తర్వాత డైరెక్టర్ తనకు ఎలా కావాలో అలా చేయించుకున్నాడు. టెక్నీషియన్స్‌కు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను. ‘ఇద్దరి లోకం ఒకటే’ మా బ్యానర్లో రూపొందిన 33వ చిత్రం. ఓ సినిమాకు రిలీజ్‌కు ముందే ప్రాఫిట్స్ వస్తాయని ప్రూవ్ చేసింది. అందరూ ఇన్వాల్వ్మెంట్తో సినిమాను అందంగా తీశారు. ప్రస్తుతం లిప్‌కిస్‌ల ట్రెండ్ నడుస్తోంది. మా సినిమాలో కూడా లిప్‌కిస్ ఉండటంతో మా సినిమాకు సెన్సార్ జరిగినప్పుడు యు/ఎ సర్టిఫికేట్‌ను ఇచ్చారు. రాజ్‌తరుణ్, షాలిని బెస్ట్ పెర్ఫామెన్స్. డిసెంబర్ 25న విడుదల కాబోయే ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రం బెస్ట్ మూవీ అవుతుందని నమ్మకంగా ఉన్నాం. మేం అనుకున్నట్లు జరిగితే హ్యాట్రిక్ హిట్‌తో ఈ ఏడాదిని ముగిస్తాం. 2020 మాకు మంచి వెల్కమ్ అవుతుంది. మంచి లవ్ ఎలిమెంట్స్, హ్యుమర్‌తో పాటు ఎమోషనల్‌గా కూడా సినిమా కనెక్టింగ్‌గా ఉంటుంది. సినిమా క్లైమాక్స్ కనెక్టింగ్‌గా ఉంటుంది. మిక్కి మ్యూజిక్ సూపర్బ్‌గా కుదిరింది. అన్నీ సాంగ్స్ స్టోరీ బేస్డ్‌గానే ఉంటాయి. కచ్చితంగా డిసెంబర్ 25 వచ్చే ‘ఇద్దరి లోకం ఒకటే’ అందరికీ నచ్చుతుంది” అన్నారు.
చిత్ర దర్శకుడు జీఆర్ కృష్ణ మాట్లాడుతూ – ”పుట్టిన దగ్గరి నుండి ఒకటయ్యేంత వరకు హీరో, హీరోయిన్ మధ్య సాగే ప్రేమకథే ‘ఇద్దరి లోకం ఒకటే’. ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ. హార్ట్ టచింగ్ స్టోరీ. మంచి సినిమాను తీశామని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. థియేటర్‌కి వచ్చే ప్రేక్షకుడు మంచి సినిమాను చూశామనే ఫీలింగ్‌తో ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేసి బయటకు వస్తారు. ఆ మంచి ఫీల్ ప్రేక్షకులతో ట్రావెల్ అవుతుంది. దిల్‌రాజుగారికి, రాజ్‌తరుణ్‌గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను. రాజుగారు మంచి టెక్నీషియన్స్‌ను ఇచ్చారు. అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. రాజ్‌తరుణ్ అంటే మాస్ లుక్, ఓ యాసతో కూడిన డైలాగ్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇందులో డిఫరెంట్ రాజ్‌తరుణ్ కనపడతారు. తను అద్భుతంగా చేశాడు. అలాగే షాలిని పాండే పాత్ర ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటుంది. గోపీగారికి థ్యాంక్స్. రాజుగారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని అనుకుంటున్నాం” అన్నారు.
హీరో రాజ్‌తరుణ్ మాట్లాడుతూ – ”నాకు గోపీగారు, ఆర్.కెగారు ఈ కథను చెప్పగానే నచ్చి చేస్తానని చెప్పాను. మంచి ఫీల్ గుడ్ మూవీ. సినిమా బయటకు వచ్చే ప్రేక్షకుడికి సినిమా గుర్తుండిపోతుంది. అందరం ప్రేమించి సినిమాను చేశాం. నాకు కలిసొచ్చిన డేట్.. ఉయ్యాల జంపాల విడుదలైన తేది డిసెంబర్ 25న ఈ సినిమా విడుదలవుతుంది” అన్నారు.
బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ – ”ఈ సినిమాలో భాగమైన మిక్కి జె.మేయర్‌గారికి, సమీర్‌రెడ్డిగారికి, తమ్మిరాజుగారికి, అబ్బూరి రవిగారికి థ్యాంక్స్. పెద్ద టెక్నీషియన్స్ ఎంతో సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకుడిని సినిమా హాంట్ చేసే సినిమాల కోవలో ఈ సినిమా చేరుతుంది. చివరి ముప్పై నిమిషాలు ప్రేక్షకులు సినిమాకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు.కథ వినగానే రాజ్‌తరుణ్ చాలా కొత్తగా ఉందని ఓకే చెప్పాడు. రాజ్‌తరుణ్, షాలిని పాండే అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. రాజ్‌తరుణ్ మెచ్యూర్డ్‌గా, కొత్తగా కనపడతాడు. క్రిస్మస్ సందర్భంగా సినిమాను డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం” అన్నారు.