Reading Time: 2 mins

‘ఇద్దరి లోకం ఒకటే’ రివ్యూ

క్లైమాక్స్ హైలెటే (‘ఇద్దరి లోకం ఒకటే’ రివ్యూ)

Rating:2.5

ఫన్ తో నడిచే సినిమాలు చేసే రాజ్ తరణ్ ఓ ప్యూర్ లవ్ స్టోరీ చేసాడంటే ఆశ్చర్యమే.అయితే ఒక్కోసారి ఆశ్చర్యాలే …భాక్సాఫీస్ కు ముద్దు వస్తూంటాయి. అందులోనూ దిల్ రాజు వంటి నిర్మాత, టర్కీ హిట్ రీమేక్,హీరోయిన్ గా షాలినీ పాండే, టాప్ టెక్నీషియన్స్ అతన్ని ఈ సినిమా వైపుకు నడిచేలా చేసుంటాయి. అంటే ఖచ్చితంగా ఈ సినిమా తన కెరీర్ కు ప్లస్ అవుతుందనే భావించి చేసి ఉంటాడు. అందుకు తగ్గట్లే ట్రైలర్ సినిమాపై క్రేజ్ క్రియేట్ చేసింది. ఈ నేపధ్యంలో మంచి అంచనాలతో రిలీజైన ఈ సినిమా ఎంతవరకూ టార్గెట్ ఆడియన్స్ కు దగ్గరైంది. రాజ్ తరుణ్ కెరీర్ కు ప్లస్ అయ్యింది..వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

వర్ష (షాలిని పాండే)కు మంచి నటి కావాలన్నది జీవితాశయం. మరో ప్రక్క  మహి (రాజ్ తరుణ్) ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్. ఓ రోజున మహి పెట్టిన ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో తన చిన నాటి ఫొటో చూసిన వర్ష..అతన్ని కలుస్తుంది. ఆ ఫొటో అతని దగ్గరకు ఎలా వచ్చింది అని అడుగుతుంది. అప్పుడు మహి…తను మరెవరో కాదు…బాల్య స్నేహితుడుని అనే విషయం రివీల్ చేస్తాడు. అప్పుడు ఆమెకు గతం జ్ఞాపకం వస్తుంది. చిన్నప్పుడే వర్ష, మహి ఇద్దరూ క్లోజ్ ప్రెండ్స్. అయితే కొన్ని కుటుంబ కారణాలతో ఇద్దరూ వేర్వేరు ఊళ్లలో సెటిల్ అవుతారు. పెద్దయ్యాక కలిసిన వీళ్లు ఒకటి అవుతారనుకుంటే…వీళ్ల మధ్య ఓ సమస్య వస్తుంది. అదేమిటంటే.. మహికు ఓ ఆరోగ్య సమస్య ఉంటుంది. దాంతో అతను వర్షతో ప్రేమలో పడినా ఆ విషయం ఆమెకు చెప్పటానికి తనలో తను మధన పడతాడు తప్ప రివీల్ చేయడు. రివీల్ చేద్దామనుకునేసరికి అతని ఆరోగ్య పరిస్దితి మరింత విషమిస్తుంది. అలాంటి పరిస్దితుల్లో వీరి ప్రేమ కథ ఏ మలుపు తీసుకుంటుంది. మహి గురించిన విషయం వర్షకు తెలుస్తుందా..చివరకు వీళ్ళిద్దరు ఒకటి ఎలా అయ్యారు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
కథ,కథనం

టర్కీలో వచ్చిన  ‘లవ్ లైక్స్ కో ఇన్సిడెన్సెస్‌’ రీమేక్ గా వచ్చిన ఈ సినిమా ఓ లేయర్ లో హై గా కథ నడుస్తుంది. సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ మనస్సుని హత్తుకుంటాయి. మరికొన్ని సాగతీస్తున్నాడురా అని చిరాకు తెప్పిస్తాయి. అయితే క్లైమాక్స్ కు వచ్చేసరికి సర్దుకుంటాయి. కన్నీళ్లు పెట్టిస్తాయి. టర్కీ సినిమాలోని ఎలిమెంట్స్ ని యాజటీజ్ తీసారో లేదో కానీ సినిమా మాత్రం డల్ ఫేజ్ లో నడుస్తుంది. అందుకు కారణం హీరో క్యారక్టరైజేషన్ కావచ్చు. తనకు హెల్త్ కంప్లైంట్ ఉందని తనలో తను మధన పడే సన్నివేశాలు మనకు గతంలో చాలా సినిమాల్లో చూసినవే కావటంతో ఎమోషనల్ డెప్త్ అనిపించవు. హీరోయిన్ పాత్ర మాత్రం కొత్తగా ఉంది. ఆమెలో జోష్ మనని కట్టిపారేస్తుంది. రాజ్ తరుణ్ వంటి ఆర్టిస్ట్ ని ఆమె డామినేట్ చేసేస్తుంది. రాజ్ తరుణ్ మాట పలుకూ లేకుండా అలా ఉండిపోతాడు.

అయితే  వారి మధ్య రొమాంటిక్ మూమెంట్స్ చూసినప్పుడు మాత్రం మనస్సు పులకింతకు లోనుకావడం జరుగుతుంది. అయితే అది పై మాటే.  ఈ కథ మనసు లోతుల్లోకి వెళ్ళలేకపోవటమే సమస్యగా మారింది. డైరక్టర్ ఈ రీమేక్ ని చాలా అందంగా ..ఇంకా చెప్పాలంటే ఒరిజనల్ కన్నా అందమైన లొకేషన్స్ తో బ్యూటిఫుల్ గా తెరకెక్కించాడు. అయితే ఆ ఎమోషన్ ఏదైతే ఉందో ..అది మనకు కొత్తది కాకపోవటమే ఈ సినిమాతో వచ్చిన సమస్య. అలాగే నావెల్టీ ఎలిమెంట్స్ ఏమీ ఈ సినిమాలో కనపడకపోవటం మరో సమస్యగా మన ముందు నిలబెడుతుంది. ఈ రెండు ప్రక్కన పెడితే…కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికిపోకుండా ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కించాలన్న దర్శకుడు గొప్పతనం మాత్రం మన కళ్ల ముందు కనపడతుంది.
   
టెక్నికల్ గా …

లవ్ స్టోరీకు హైలెట్స్ ఉండాల్సిన సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, దర్శకత్వం విషయంలో ఈ సినిమా నూటికి నూరు పాళ్లు సక్సెస్ అయ్యింది. ఎడిటింగ్ విషయంలోనే మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే కాస్త స్పీడుగా పరుగెత్తేది అనిపించింది. మిగతా డిపార్టమెంట్ లు కూడా తమ పరిధి మేరకు బాగానే పనిచేసాయి.

చూడచ్చా…

 ఓ ప్యూర్ లవ్ స్టోరీని చూడాలనుకునేవాళ్లకి నచ్చుతుంది. ట్విస్ట్ లు, టర్న్ లు, ఊర కామెడీ, మాస్ యాక్షన్ కావాలనుకుంటే ఈ సినిమా వైపు చూడకుండానే ఉంటేనే బెస్ట్.

తెర వెనక– ముందు..

స‌మ‌ర్ప‌ణ‌: దిల్‌రాజు
బ్యాన‌ర్‌: శ‌్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
న‌టీన‌టులు: రాజ్ త‌రుణ్, షాలిని పాండే, నాజ‌ర్‌, సిజ్జు, రోహిణి, భ‌ర‌త్ త‌దిత‌రులు
సంగీతం: మిక్కి జె.మేయ‌ర్‌
కెమెరా: స‌మీర్ రెడ్డి
ఎడిటింగ్‌: త‌మ్మిరాజు
ఆర్ట్‌: ర‌మ‌ణ వంక‌
నిర్మాత‌: శిరీష్‌
ద‌ర్శ‌క‌త్వం: జి.ఆర్‌.కృష్ణ‌