Reading Time: 3 mins

ఈగల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఈగల్ ఔట్‌పుట్‌ చాలా అద్భుతంగా వచ్చింది. ఇలాంటి మేకోవర్ లో కనిపించడం ఇదే ఫస్ట్ టైమ్. ప్రేక్షకుల రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నాను: ఈగల్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజ

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ఈగల్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఈగల్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ ఫుల్ గా జరిగింది.

ప్రీరిలీజ్ రిలీజ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని దాదాపు నటీనటీనటులతో పని చేయడం ఇదే తొలిసారి. నవదీప్‌కు బలమైన క్యారెక్టర్‌ దక్కాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ సినిమాతో తనకి మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను. ఎవరూ ఊహించలేని విధంగా డైలాగ్స్‌ చెప్పాడు. ఇద్దరం కలిసి ఓ కామెడీ సినిమాలో చేయాలని వుంది. తనలో చాలా మంచి హ్యుమర్ వుంది. శ్రీనివాస్ రెడ్డి, వినయ్ రాయ్, శ్రీనివాస్ అవసరాల, అజయ్ ఘోష్.. అందరూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకుల రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నాను. డేవ్ జాండ్.. రాక్ స్టార్. అద్భుతమైన మ్యూజిక్ చేశాడు. తను భవిష్యత్ లో మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను. మాస్టర్ ద్రువన్ పాత్రతో చిన్నపిల్లలు కనెక్ట్ అవుతారు. విశ్వ ప్రసాద్ గారు, వివేక్ గారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నాకు హోమ్ ప్రొడక్షన్ లాంటింది. ఈ ప్రొడక్షన్ లో ఎన్ని సినిమాలు చేయడానికైనా సిద్ధమే. అంత కంఫర్ట్ వుంటుంది. విశ్వ ప్రసాద్ గారు చాలా క్లియర్ గా వుంటారు. వున్నది వున్నట్లుగా మాట్లాడతారు. క్లియర్ గా వుంటారు కాబట్టి నాకు నచ్చుతారు. ఎందుకంటే నేను క్లియర్ గా వుంటాను. విశ్వ ప్రసాద్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్. మణి చాలా అద్భుతమైన డైలాగ్స్ రాశాడు. అనుపమ పాత్రే ఈ సినిమా కథను నడిపిస్తుంది. కావ్య లవ్లీ క్యారెక్టర్ చేసింది. డైరెక్టర్ కార్తిక్ కి విపరీతమైన క్లారిటీ వుంది. ఎక్స్ ట్రార్డినరీ గా తీశాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించి తనకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. నాకు నేను విపరీతంగా నచ్చిన గెటప్ లో కనిపిస్తాను. ఈ గెటప్ రావడానికి దాదాపు మూడు నెలలు పట్టింది. ఫస్ట్ టైం ఇలాంటి మేకోవర్. అందరిలానే నేను ప్రేక్షకుల స్పందన కోసం ఎదురుచూస్తున్నాను. ఫిబ్రవరి 9న థియేటర్స్ లో కలుద్దాం. జై సినిమా అన్నారు.

డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ.. ఈగల్ ఎండ్ టైటిల్ కార్డ్స్ చూస్తున్నప్పుడు దాదాపు 300పైగా టీం మెంబర్స్ పేర్లు కనిపించాయి. ఇంతమంది పని చేయడం గర్వంగా అనిపించింది. ఇంతమంది వర్క్ చేయడానికి కారణం మాత్రం రవితేజ గారు నాకు ఇచ్చిన అవకాశం. రవితేజ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. రైటింగ్ మణి, ఆర్ట్ డైరెక్టర్ నాగేందర్, మ్యూజిక్ డేవ్ జాండ్, డైరెక్షన్, ఎడిటింగ్ టీం అందరూ అద్భుతమైన పని తీరు కనపరిచారు. ఇందులో నటీనటులు కాంబినేషన్ కూడా చాలా కొత్తగా ప్రయత్నించాం. ఖచ్చితంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. ఈగల్ గొప్ప థియేటట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే చిత్రం. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడాలి అని కోరారు.

నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. రవితేజ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కొత్త దర్శకులు, నటులకు అవకాశం ఇచ్చినట్లే.. మా ప్రొడక్షన్ కు వరుసగా మూడు సినిమాలు ఇచ్చి చాలా ప్రోత్సహిస్తున్నారు. రవితేజ గారితో ఇలానే చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం. కార్తిక్ తో మరో సినిమా చేస్తున్నాం. దాదాపు యాక్టర్స్ అందరితో మల్టిపుల్ మూవీస్ చేస్తున్నాం. ఇలానే చాలా మూవీస్ చేయాలని కోరుకుంటున్నాం. ఈగల్ వెరీ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్. మంచి సందేశంతో పాటు అద్భుతమైన క్లైమాక్స్ వుంటుంది. అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుతున్నాం. ఫిబ్రవరి 9న అందరూ థియేటర్స్ లో చూడాలి. అని కోరారు.

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నేను నటించిన రెండో చిత్రమిది. విశ్వ ప్రసాద్ గారికి, వివేక్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా దర్శకుడిని నేను అన్నయ్య అని పిలుస్తా. నాకు అద్భుతమైన పాత్ర ఇచ్చాడు. ఇందులో దాదాపు అందరినటీనటులతో నాకు కాంబినేషన్ సీన్స్ వున్నాయి. ఈ చిత్రంలో రవితేజగారు చాలా అద్భుతంగా కనిపిస్తారు. ఆయనతో కలిసి మరిన్ని సినిమాల్లో నటించాలనుంది. సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. ఈగల్ తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం వుంది అన్నారు

హీరోయిన్ కావ్యా థాపర్ మాట్లాడుతూ..ఈగల్ సరికొత్త ప్రేమకథ వుంది. దర్శకుడు కార్తిక్ అద్భుతంగా తీశారు. రచన పాత్రకు న్యాయం చేశాని భావిస్తున్నాను. ఇలాంటి అద్భుతమైన చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. రవితేజ గారు చాలా గొప్ప వ్యక్తిత్వం వున్న కథానాయకుడు. ఆయనతో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు థ్యాంక్స్‌ తెలిపారు.

నవదీప్ మాట్లాడుతూ.. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అద్భుతమైన ప్రొడక్షన్ హౌస్. దాదాపు పాతిక సినిమాలు ప్రొడక్షన్ లో వుండటం అంటే మామూలు విషయం కాదు. వారు సాధించిన విజయాలు అద్భుతం. హ్యాట్సప్ టు పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ. రవితేజ అన్నతో కలసి పని చేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది, ఆయనతో ఓ కామెడీ సినిమా చేయాలని ఓ ఆశ. టీం అందరికీ పేరుపేరునా థాంక్స్. ఈగల్ తప్పకుండా పెద్ద విజయాన్ని సాధిస్తుంది అన్నారు

నటుడు శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ.. రవితేజ గారిని నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన చుట్టూ మంచి పాజిటివ్ ఓర వుంటుంది. అందరితో హాయిగా కలిసిపోతూ అందరిని హ్యాపీగా ఉంచే మనిషి ఆయన. విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు, కార్తిక్ కి థాంక్స్. టీం అందరికీ థాంక్స్. ఫిబ్రవరి 9న అందరికీ మంచి ఎంటర్ టైన్మెంట్ అందుతుందనే నమ్మకం వుంది అన్నారు.

దర్శకుడు వంశీ కృష్ణ మాట్లాడుతూ.. రవితేజ గారు కథని బలంగా నమ్ముతారు. ఆయన నమ్మే ప్రతిభ ఎప్పుడూ గురి తప్పదు. కొత్త ప్రతిభని ప్రోత్సహిస్తున్న రవితేజ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ కూడా ఎప్పుడూ కొత్త ప్రతిభని ప్రోత్సహిస్తుంది. కార్తిక్ అద్భుతంగా తీశారు. డేవిడ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మాస్ మహారాజా ఫ్యాన్స్ కి ఫిబ్రవరి 9న పండగ రాబోతుంది అన్నారు.

దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ.. దర్శకుడు కార్తిక్ గారికి, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీకి అందరికీ ఆల్ ది బెస్ట్. అందరికీ ఎనర్జీ పంచె హీరో రవితేజ గారు ఈ సినిమాతో ఇంకా ఎనర్జిటిక్ గా రావాలని, ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.

దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ.. రవితేజ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. రవితేజ గారు ఈగల్ లో అద్భుతంగా కనిపిస్తున్నారు. లుక్ అదరగొట్టారు. విక్రమార్కుడిలోని గూస్బంప్స్ మూమెంట్స్ ఈగల్ లో కూడా వుంటాని భావిస్తున్నాను. విజువల్స్ అద్భుతంగా ఉనాయి. కార్తిక్ కి, టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుతున్నాను అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.