ఉనికి మూవీ రివ్యూ

Published On: January 25, 2022   |   Posted By:

ఉనికి మూవీ రివ్యూ

image.png

సామాజిక… “ఉనికి” రివ్యూ

Emotional Engagement Emoji (EEE)

 
👍

అనేకానేక పోస్ట్ పోన్ మెంట్ల తరువాత మొత్తానికి “ఉనికి” సినిమా థియేటర్లలో  రిలీజ్ అయింది. టైటిల్ ఇంట్రస్టింగ్ గా ఉండటం, టీజర్, ట్రైలర్ కూడా సినిమాపై ఆసక్తి రేపింది. లిమిటెడ్ థియోటర్ రిలీజ్ అయినా ఫరవాలేదనిపించే బజ్ క్రియేట్ చేయగలిగింది. ఇంతకీ ఈ సినిమా తో ఎవరి ఉనకి బయిటపడింది. అసలు కథేంటి..చూడదగ్గ సినిమాయేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.స్టోరీ లైన్ఓ పేద కుటుంబంలో పుట్టి పెరిగిన సుబ్బలక్ష్మి (చిత్ర శుక్ల), కష్టపడి ఐఏఎస్ సాధిస్తుంది. గోదావరి జిల్లాల్లో ఆమె పోస్టింగ్ అవుతుంది. సహజంగా ఆమె సిన్సియారిటీకి లోకల్ గూండాల నుంచి బెదిరింపులు ఎదురవుతాయి. ఒక సారి మర్డర్ అటెంప్ట్ కూడా జరుగుతుంది. అయితే చాకచక్యంగా ఆమె తప్పించుకుంటుంది. సుబ్బలక్ష్మి వీరందరిపై తిరగబడ్డానికి డిసైడ్ అవుతుంది. ఆమెకు సహాయంగా పోలీస్ ఆఫిసర్ అభి (ఆశిశ్ గాంధీ). వీరిద్దరూ ఎలా కలిసి ఫైట్ చేస్తారన్నదే మిగతా కథ.ఎలా ఉంది..

సామాజిక సందేశం ఉన్న  కథలకు కమర్షియల్ కోటింగ్ కలిపి సినిమా తీయటం కాస్త కష్టమైన పనే. అలాంటి కష్టం కొత్త డైరక్టర్స్ అసలు పడటానికి ఇష్టపడటం లేదు. ఐఏఎస్ అంటే ఒక బాధ్యత…కలెక్టర్ జాబ్  అంటే ఒక కట్టుబాటు… కత్తిమీద సాము అన్న  చైతన్య స్పూర్తితో ఈ సినిమా కథ మొదలవుతుంది.జనం..  వారి ప్రయోజనం..  జంటలక్ష్యాలుగా ఓ కలెక్టర్ వేసే అడుగులే ఈ సినిమా.  అయితే ఓ అట్టడగు వర్గం నుంచి వచ్చిన ఓ మహిళా కలెక్టర్ నిలదొక్కుకోవాలంటే ఎన్ని రాజకీయ జాతరలు ఎదుర్కోవాలి.. తెర వెనక ఏం జరుగుతుంది…జరిగేది జరుగుతున్నట్టు ప్రత్యక్షంగా జనానికి చూపిస్తే? ఈ పని ఈ సినిమా సమర్దవంతంగా చేసింది

సాధారణంగా  డైరక్టర్స్ కి ఒక సిగ్నేచర్‌  క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్లు తీసిన సినిమాల లిస్ట్ చాంతాడంత లేకపోయినా, ఒకట్రెండు సినిమాలతోనే ఇంపాక్ట్ క్రియేట్‌ చేసే ప్రయత్నం చేస్తారు. అలాంటివారిలో రాజ్ కుమార్ ఒకరు. ఇప్పుడున్న సొసైటీలో ఇలాంటి థాట్‌ ప్రొవోకింగ్‌ సబ్జెక్టులు స్క్రీన్‌ మీదకు రావాల్సిన అవసరం ఉంది. అందులోనూ ఓటీటీ కాలంలో ఉండటంతో కొత్త సబ్జెక్టులు మరింత స్ట్రాంగ్ గా చెప్పాలి. అవసరమైతే గీత దాటాలి. రాజ్ కుమార్ తొలి చిత్రానికే  ఆ ప్రయత్నం కొంతవరకూ చేశారు. చేయగలిగిన మేరకు సక్సెస్‌ఫుల్‌గా వర్కవుట్ చేసారు.ఈ సినిమాలో  చూసిన వారిలో సగం మందికి పైగానే అయినా తాము చదివిన లేదా విన్న   గుర్తుకు రాకమానవు.

పేపర్లో, విజువల్ మీడియాలో ఇలాంటి కథలు రాకపోయినా …నిజాలు ఇవే. ఇలాంటి కథలు చెప్పినప్పుడే సమాజానికి మనం చేయగలిగించి చేసామన్న తృప్తి ఉంటుంది. మన కోసం,మెరుగైన సమాజం కోసం మనకు తెలియకుండా ఓ వ్యవస్ద ఎంత ఇబ్బందులు ఎదుర్కుంటూ కష్టపడుతోంది అనే ఆలోచన చూసినవారిలో కలుగుతుంది. అలా మెదిలినప్పుడు ఏ ఒక్కరిలో మార్పు వచ్చినా, ఏ కొంతమందో ఒక్క క్షణం మంచి వైపు ఆలోచించగలిగినా దర్శకుడి నిజాయితీ ప్రయత్నం సఫలమైనట్టే!

రైటింగ్ సైడ్ చూస్తే…తొలి సినిమాకే కాస్త క్లిష్టంగా, కష్టంగా అనిపించే కథను సెలక్ట్ చేసుకున్న రాజ్ కుమార్.. సెకండాఫ్ నుంచి తన  పవర్ చూపించాడు. స్క్రీన్ ప్లేలో, ట్విస్టుల్లో చమక్కులు చూపించాడు. సినిమా ఎండింగ్ లో కూడా డైరక్టర్స్ కట్ స్పష్టంగా కనిపిస్తుంది.

నటీనటుల్లో …

చిత్రశుక్ల నటన బాగుంది. ఆశిష్ గాంధీ డైలాగ్ డెలీవరీ నచ్చుతుంది. ఉన్నంతలో డైలాగ్సే ఈ సినిమాకు ప్లస్ అని చెప్పుకోవచ్చు. టెక్నికల్ గా కెమెరా వర్క్, ఎడిటింగ్ నీట్ గా ఉన్నాయి. ఉన్నంతలో నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్

ఎమోషనల్ సీన్స్
. టీఎన్నార్ పాత్రతో ట్విస్ట్

నెగిటివ్ పాయింట్స్

ఇంట్రస్టింగ్  లేని నేరేషన్
సీన్లు అక్కడక్కడా ల్యాగింగ్ గా, మల్టిపుల్ గా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం

ఎవరెవరు..

నటీనటులు: ఆశిష్ గాంధీ, చిత్రా శుక్లా, టీఎన్ఆర్, ‘రంగస్థలం’ నాగ మహేష్, అప్పాజీ అంబరీష, ప్రభావతి, టిక్ టాక్ దుర్గారావు తదితరులు

సంగీత దర్శకుడు: పి. ఆర్ (పెద్దపల్లి రోహిత్)

ఛాయాగ్రహణం-కూర్పు: హరికృష్ణ

దర్శకత్వం : రాజ్‌కుమార్ బాబీ

నిర్మాత‌లు: బాబీ ఏడిద‌, రాజేష్ బొబ్బూరి

రన్ టైమ్ : 2 hours 9 minutes

విడుదల తేదీ :  జనవరి 21, 2022