ఉప్పెన చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రిమియర్
వరల్డ్ టెలివిజన్ ప్రిమియర్‌లో 18.5 టీఆర్‌పి రేటింగ్ సాధించిన `ఉప్పెన`.
తెలుగు ప్రేక్షకులు సినిమారంగం పట్ల ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రేమ చూపిస్తారు. కరోనా మహమ్మారి పరిస్థితి ఉన్నప్పటికీ `ఉప్పెన చిత్రాన్ని చూడడానికి ఆడియన్స్ భారీగా థియేటర్స్‌కి వచ్చారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఒక డెబ్యూ హీరో, హీరోయిన్ మరియు నూతన దర్శకుడు కలిసి ఈ ఫీట్‌ను సాధించడం ఇది మొదటిసారి. ఇండియన్ సినిమాలోనే ఇంతవరకూ ఇలా జరగలేదు.
పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి తమ నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేశారు. అలాగే దేవిశ్రీప్రసాద్ సూపర్‌హిట్ ఆల్బమ్ ఇచ్చారు. శ్యామ్ దత్ బ్రిలియంట్ విజువల్స్ మరియు బుచ్చిబాబు సానా తన రైటింగ్ మరియు డైరెక్షన్‌తో ప్రేక్షకుల్ని మెప్పించారు. మైత్రి మూవీస్ బేనర్‌లో ప్రతి టెక్నీషియన్ చాలా ఇష్టపడి ఈ చిత్రాన్ని చేశారు. అలాగే తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ చిత్రంతో తెలుగు పరిశ్రమలో కూడా మంచి స్థానాన్ని ఏర్పాటుచేసుకున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ యొక్క ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో ప్రతి ఫ్రేమ్ గ్రాండ్‌గా కనిపించింది. స్క్రిప్ట్ మరియు దర్శకుడిపై నమ్మకంతో వారు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రం ఒక డెబ్యూ హీరో కెరీర్‌లో హెయెస్ట్ టీఆర్‌పీరేట్‌ను నమోదు చేసింది. `స్టార్ మా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్`లో ఈ చిత్రం రికార్డు స్థాయిలో 18.5 రేటింగ్ సాధించింది.
`ఉప్పెన` చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.