Reading Time: 2 mins

ఊరు పేరు భైరవకోన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఊరు పేరు భైరవకోన ఫాంటసీ అడ్వెంచర్, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ కూడిన మంచి కమర్షియల్ తెలుగు సినిమా. తప్పకుండా అందరికీ నచ్చుతుంది: గ్రాండ్ ప్రెస్ మీట్ లో హీరో సందీప్ కిషన్

ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే సూపర్ నేచురల్ ఫాంటసీ అడ్వెంచర్ ఊరు పేరు భైరవకోన: దర్శకుడు విఐ ఆనంద్

ఊరు పేరు భైరవకోన అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాతో సందీప్ కిషన్ నెక్స్ట్ రేంజ్ కి వెళ్తాడనే నమ్మకం వుంది: నిర్మాత అనిల్ సుంకర

యంగ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ఊరు పేరు భైరవకోన. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం ఫిబ్రవరి16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది.

ప్రెస్ మీట్ లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ఊరు పేరు భైరవకోన లాంటి అద్భుతమైన చిత్రాన్ని నాకు ఇచ్చిన దర్శకులు విఐ ఆనంద్ గారికి థాంక్స్. దాదాపు రెండున్నరేళ్ళ పాటు ఈ సినిమా కోసం నిరంతరం కష్టపడ్డారు. ఆయన మొదటి సినిమా కూడా నాతోనే చేయడం గర్వంగా భావిస్తాను. అనిల్ సుంకర గారితో ఎంతో మంచి అనుబంధం వుంది. సాధారణంగా నిర్మాతగా ఆయన పేరు వేసుకోరు. కానీ నేను పట్టుపట్టి నిను వీడని నీడను నేను సినిమాకి వేశాను. అది మాకు చాలా కలిసొచ్చింది. రాజా హాస్య మూవీస్ నా హోం బ్యానర్ లాంటింది. ఊరు పేరు భైరవకోన చాలా స్పెషల్ మూవీ. ఫాంటసీ, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ వున్న మంచి కమర్షియల్ తెలుగు సినిమా ఇది. సినిమాపై చాలా నమ్మకంగా వున్నాం. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ధన్యవాదాలు. నాకు ఎప్పుడూ అండగా వుండే ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. ఊరు పేరు భైరవకోన టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసింది. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. సినిమా చూస్తున్నప్పుడు సందీప్, దర్శకుడు, టీం అంతా పడిన శ్రమ అర్ధమౌతుంది. సినిమా చూశాను. దర్శకుడు ఆనంద్ చెప్పిన దానికంటే చాలా అద్భుతంగా తీశాడు. సినిమాపై చాలా నమ్మకంగా వున్నాం. చాలా మంచి సినిమా ఇది. సందీప్ ఈ సినిమాలో నెక్స్ట్ రేంజ్ కి వెళ్తాడు. ప్రౌడ్లీ ప్రజెంట్స్ అనే దానికి.. ఐయామ్ ప్రౌడ్ అన్నారు.

దర్శకుడు విఐ ఆనంద్ మాట్లాడుతూ.. ఊరు పేరు భైరవకోన అద్భుతమైన జర్నీ. ప్రతి మూమెంట్ మాకు ఓ కొత్త అనుభవం. ఊరు పేరు భైరవకోన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్, సూపర్ నేచురల్ ఫాంటసీ, మంచి లవ్ స్టొరీ వుంది. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ఫిబ్రవరి16న తప్పకుండ అందరూ థియేటర్స్ లో చూడాలి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అన్నారు

సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మాట్లాడుతూ.. విడుదలైన రెండు పాటలని గొప్ప గా హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. నిజమేనే, హమ్మ హమ్మ పాటలని ప్రేక్షకులు వోన్ చేసుకొని రీల్స్ చేస్తూ గొప్ప ఆదరణ చూపించారు. నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా వచ్చింది. ఊరు పేరు భైరవకోన లో ఎమోషన్ హారర్ థ్రిల్ పీక్స్ లో వుంటాయి. ఈ సినిమా ప్రేక్షకులకు గొప్ప ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.