ఊర్వశివో రాక్షసివో  మూవీ  రివ్యూ

Published On: November 4, 2022   |   Posted By:

ఊర్వశివో రాక్షసివో  మూవీ  రివ్యూ

 అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ రివ్యూ
Emotional Engagement Emoji
  👍

మీడియం రేంజి సినిమాలకు టాక్ కీలకంగా మారింది. ఏ సినిమాకు టాక్ వస్తే దానికి వసూళ్లు బాగుంటాయి.  చాలా మంచి టాక్ వస్తే తప్ప థియేటర్లకు వచ్చే

మూడ్‌లో లేని ప్రేక్షకులను ఈ వారం అల్లు శిరీష్ తన తాజా చిత్రంతో పలకరించారు. చాలాకాలంగా హిట్ లేని ఆయన ఓ రొమాంటిక్ కామెడీ సినిమాని మన ముందుకు

తెచ్చారు. దాదాపు మూడేళ్ల క్రితం మొదలైన ఈ చిత్రం ఇన్నాళ్లకు థియేటర్ లో దిగింది. హాట్ ప్రోమోలు, టీజర్స్ తో ఆకట్టుకున్నారు. అయితే సినిమా మొదలయ్యే

నాటికి ఇప్పటికి చాలా మారిపోయాయి. ఈ క్రమంలో ఈ సినిమా కథ మనకు నచ్చుతుందా..అసలు సినిమాలో కీ పాయింట్ ఏమిటి..వర్కవుట్ అవుతుందా..శిరీర్ హిట్

అందిస్తుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

శ్రీ కుమార్ (అల్లు శిరీష్) ఒక మామూలు మనింటిప్రక్కనుండే మిడిల్ క్లాస్ కుర్రాడు. తల్లి,తండ్రులు చెప్పిన మాట వింటూ ..చదువు పూర్తి చేసుకుని చక్కగా సాఫ్ట్ వేర్ జాబ్ లో సెటిలయ్యాడు. అతని ఆఫీస్ లో సింధుజ (అను ఇమ్మాన్యుయెల్)అనే అందమైన అమ్మాయి కొత్తగా జాయిన్ అయ్యింది. ఆమెను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నాడు. కానీ అమెరికాలో పెరిగి వచ్చిన  ఆమె చాలా  అడ్వాన్స్ . దాంతో ఆమె శ్రీకుమార్ ని ఇష్టపడటమే కాకుండా ,శారీరకంగా కూడా కలిసింది. ఇక నెక్ట్స్ స్టెప్ పెళ్లే అని శ్రీకుమార ఫిక్సై ప్రపోజల్ పెడితే ఆమె నో చెప్తుంది. తన గోల్,గోల వేరని చెప్తుంది.సహజీవనానికి ఒప్పిస్తుంది. ఓ ప్రక్కన ఇంట్లో వాళ్లు శ్రీకుమార్ కు సంభందాలు చూస్తూంటారు. వాళ్లకు ఈ మ్యాటర్ తెలియనివ్వడు. ఇటు పద్దతైన తల్లితండ్రులకు, అటు అడ్వాన్స్ గా రెచ్చిపోయే ప్రేమించిన అమ్మాయి కు మధ్యన నలిగిపోతూంటాడు. ఇద్దరిని ఎలా మ్యానేజ్ చేసాడు. చివరకు సహజీవనం బయిటపడిందా..ఫైనల్ గా ఈ జర్నీ ఎక్కడికి రీచ్ అయ్యింది అనేది మిగతా కథ.

స్క్రీన్ ప్లే ఎనాలసిస్ :

ఇది అడల్ట్ టచ్ కలిగిన రొమాంటిక్ కామెడీ. 2018 లో వచ్చిన Pyaar Prema Kaadhal అనే సినిమాకు రీమేక్. ఇక్కడ రెండు విభిన్నమైన పాత్రలు, వాటి మధ్య కాంప్లిక్ట్స్ సెట్ చేయటంతో ఫస్టాఫ్ రన్ చేసారు. హీరోయిన్ పాత్ర నుంచి కథలో ముసలం పుడుతుంది. ఆమె సహజీవనం అతని సంప్రదాయ జీవనానికి అడ్డం అవుతుంది. అయినా ప్రేమతో సర్దుకుపోతాడు. కానీ సమాజం ఒప్పుకుంటుందా. కుటుంబం కలిసి వస్తుందా…అదే ఇక్కడ తీసుకున్న కోర్ ఐటం. ముఖ్యంగా స్క్రిప్టులో …  బోలెడన్ని ఇంటిమేట్ సీన్లున్నాయి.  డబుల్ మీనింగ్ డోస్ గట్టిగానే ఉంది. అయితే యూత్ ని ఉద్దేశించి తీసిందే కాబట్టి ..ఆ వర్గానికి నచ్చుతుంది. అలాగే మల్టిప్లెక్స్ వర్గానికి తగినట్లు లైట్ హార్టెడ్ హ్యూమర్ కూడా కలపటంతో ఎక్కడా బోర్ అయితే కొట్టించదు.అయితే సెకండాఫ్ తో పోలిస్తే ఫస్టాఫ్ కాస్త సాగింది. అలాగే ఇలాంటి లైట్ హార్టెడ్ ఫిల్మ్ లో ..సాడ్ సాంగ్, రొటీన్ గా ప్రెడిక్టబుల్ గా సాగే ప్రి క్లైమాక్స్.. క్లైమాక్స్ ను  పెట్టారు. అలా కాకుండా క్లైమాక్స్ ని కామెడీతో నింపి ముగించి ఉంటే బాగుండేది. ఏదైమైనా ఫెరఫెక్ట్ రొమాంటిక్ కామెడీ బీట్స్ ఉన్న ఈ సినిమా కూల్ గా నచ్చేస్తుంది.

టెక్నికల్ గా..
డైరక్టర్ …కష్టం అడుగడుగునా కనిపిస్తుంది. సినిమాని బాలెన్స్ తప్పకుండా ముందుకు తీసుకెళ్లాడు. నిర్మాణ విలువలు డీసెంట్ గా వున్నాయి. కెమెరా వర్క్ నీట్ గా ఉంది. లొకేషన్స్  చాలా సహజంగా అందంగా చూపించారు.  పాటలు బావున్నాయి. నేపధ్య సంగీతం కూడా కష్టపడి చేశాడు. ఎలివేషన్ లేని చోట కూడా ఎదో ఫిల్ చేయడానికి చాలా తాపత్రయపడటం కనిపిస్తుంది. డైలాగులు ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. కథకు తగ్గట్టు నిర్మాణ విలువలు వున్నాయి,

నటీనటులు..
ఇది హీరోయిన్ అను ఒంటి చేత్తో లాక్కెళ్లిన సినిమా. ఆమెలో మంచి ఈజ్, ఎనర్జీ వుంది. చాలా హుషారుగా చేసింది. సింథు పాత్రకు తగినట్లు హాట్ గా, గ్లామర్ గా, నిండుగా అందంగా వుంది. అల్లు శిరీష్ ఎప్పటిలాగే ఉన్నాడు. నటన కూడా ఓకే.  అతను గతంలో కన్నా నటనలో ఇంప్రూవ్‌మెంట్ చూపించాడు. ఇక సునీల్, ‘వెన్నెల’ కిశోర్, పోసాని కృష్ణమురళి కు ఫన్ టైమింగ్ మనకు తెలియంది కాదు.  తల్లిగా ఆమని మంచి ఫెరఫార్మెర్ అని మరోసారి ప్రూవ్ చేసింది.

చూడచ్చా..
అడల్ట్ డోస్ ఎక్కువ కావడం ఫ్యామిలీ ఆడియన్స్ ప్రక్కన పెడతారేమో కానీ యూత్ కు మాత్రం ‘ఊర్వశివో రాక్షసివో’ బాగానే నచ్చుతుంది

ప్లస్ లు :
ఫన్, ప్రెష్ నెస్
అను ఇమ్మాన్యుయల్ గ్లామర్
కామెడీ

మైనస్ లు  :
బాగా తెలిసిన కథ
ప్రేమ కథలో ఎమోషన్ లేకపోవడం
సెకండ్ హాఫ్ క్లైమాక్స్ చాలా ప్రెడిక్టబుల్ గా ఉండటం

తెర ముందు..వెనుక..

నటీనటులు : అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్, సునీల్, ‘వెన్నెల’ కిశోర్, ఆమని, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిల్లా, కేదార్ శంకర్ తదితరులు
కథ : ఎలాన్
ఛాయాగ్రహణం : తన్వీర్
పాటలు, నేపథ్య సంగీతం: అచ్చు రాజమణి (మాయారే సాంగ్ : అనూప్ రూబెన్స్)
సమర్పణ : అల్లు అరవింద్
నిర్మాతలు : తమ్మారెడ్డి భరద్వాజ, ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎం
స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : రాకేశ్ శశి
రన్ టైమ్ : 2h 24m
విడుదల తేదీ: నవంబర్ 4, 2022