ఊహించలేదు కదు మూవీ సంక్రాంతి విడుదల
సంక్రాంతి కానుకగా శ్రీరామ్ హీరోగా నటించిన బైలింగ్వల్ ‘ఊహించలేదు కదు’
కోలీవుడ్ హీరో శ్రీరామ్ నటించిన సినిమా ’ఓమ్ శాంతి ఓమ్‘. బైలింగ్వల్ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఊహించలేదు కదు’ పేరుతో అదే రోజు విడుదల చేయబోతున్నారు. శ్రీరామ్ కు జోడీగా నీలమ్ ఉపాధ్యాయ నటించారు.
ఈ సినిమాను రెహమాన్ క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ నిర్మించింది. బస్సు ప్రయాణంలో జరిగిన ప్రమాదం, హీరో ఒక్కడే బతికి ఉండడం , ఆపై జరిగే పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సంక్రాంతి కానుకగా విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.