Reading Time: 2 mins

సూర్య, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రూపొందిన  చిత్రం ‘ఎన్‌.జి.కె’. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ అందిస్తున్నారు. సినిమా మే 31న ప్రపంచవ్యాప్తంగా  విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం జె.ఆర్.సి  ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో బిగ్‌ టికెట్‌ను హీరో సూర్య ఆవిష్కరించి ప్రముఖ నిర్మాత  కె.కె.రాధామోహన్‌కి అందించారు. ఈ సందర్భంగా…

నిర్మాత అనీల్‌ సుంకర మాట్లాడుతూ – ”హీరో తమిళ హీరో అయినప్పటికీ మన తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. శ్రీరాఘవగారు డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రం మంచి హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. అలాగే మా రాధామోహన్‌గారికి ఈ సినిమా మరో  పెద్ద సక్సెస్‌గా నిలవాలని కోరుకుంటున్నాను” అన్నారు.

సినిమాటోగ్రాఫర్‌ శివకుమార్‌ విజయన్‌ మాట్లాడుతూ – ”ఈసినిమా కోసం యూనిట్‌ అంతా చాలా కష్టపడింది. ఇదొక లాంగ్‌ జర్నీ. సూర్యగారు, శ్రీరాఘవగారి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ – ”ఎన్‌.జి.కె సినిమా అనువాదంలా అనిపించడం లేదు. తెలుగులో పెద్ద హీరో సినిమా వస్తే ఎలా వెయిట్‌ చేస్తుంటారో..సూర్యగారి సినిమా కోసం అలాగే వెయిట్‌ చేస్తున్నారు. సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటన్నాం. రాధామోహన్‌గారి ప్రొడక్షన్‌లో సినిమా అంటే మా సొంత సినిమాలాగానే భావిస్తాం” అన్నారు.

నిర్మాత బాపినీడు మాట్లాడుతూ – ”సూర్య, సాయిపల్లవి, రకుల్‌, శ్రీరాఘవగారు సహా ఎంటైర్‌ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.

హీరోయిన్ సాయిపల్లవి మాట్లాడుతూ – ”హైదరాబాద్‌కు వస్తే ఇంటికి వచ్చిన ఫీలింగ్‌ ఉంటుంది. నాకు చిన్నప్పట్నుంచి సూర్య సార్‌ అంటే చాలా ఇష్టం. ఆయనతో ఇప్పుడు సినిమా చేయడం కలలాగా ఉంది. నాకొక మూమెంట్‌. ఆయన సెట్‌లో చాలా సింపుల్‌గా ఉంటారు. అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. నాకు షూటింగ్‌ సమయంలో ఎంతగానో సపోర్ట్‌ అందించారు. శ్రీరాఘవగారు ఓ విజనరీతో సినిమా చేస్తారు. ఆయన ప్రతి క్యారెక్టర్‌ను డిఫరెంట్‌గా చూపిస్తారు. ఈ సినిమా నుండి చాలా నేర్చుకున్నాను. ఈ సినిమాలో నాకు సపోర్ట్‌ చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్‌” అన్నారు.

హీరోయిన్ రకుల్ ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ – ”  శ్రీ రాఘవ   గారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. నేను స్కూల్‌ అయిపోయిన తర్వాత కన్నడలో ఓ సినిమా చేశాను. అదే 7/జి బృందావన  కాలనీ రీమేక్‌. అప్పటి నుండి 
 శ్రీ రాఘవ సార్‌తో పనిచేయాలని ఉంది. ఈసినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్‌ ఇది. సీరియస్‌ రోల్‌ చేశాను. సినిమా కోసం ఎగ్జయిటెడ్‌గా వెయిట్‌ చేస్తున్నాను. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. సూర్యగారు అమేజింగ్‌, ప్రొఫెషనల్‌ యాక్టర్‌. ఆయనతో పనిచేయడం హ్యాపీ.  ఈ సినిమాకు యువన్‌శంకర్‌గారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఎంటైర్‌ యూనిట్‌కు థాంక్స్‌. మే 31న విడుదలవుతున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది” అన్నారు.

రామ్‌ తాళ్లూరి మాట్లాడుతూ – ”ట్రైలర్‌ అద్భుతంగా ఉంది కదా!. సినిమా కూడా సూపర్‌ హిట్‌ అవుతుంది. సూర్యగారు సహా ఎంటైర్‌ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.

శ్రీరాఘవ మాట్లాడుతూ – ”నేను సూర్యగారికి పెద్ద ఫ్యాన్‌ని. అందరికీ సూర్యగారు గొప్ప నటుడు అని తెలుసు. అయితే ఆయన అంత కంటే గొప్ప మనసున్న మనిషి. ఆయనకు సెల్యూట్‌. ఆయన ఎంత సేవ చేస్తున్నారో నాకు తెలుసు. సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ ఇద్దరూ మంచి నటీమణులు. యువన్‌శంకర్‌ రాజా సహా ఎంటైర్‌ యూనిట్‌కు థాంక్స్‌” అన్నారు.

సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ – ”’ఎన్‌.జి.కె’ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి అవకాశం ఇచ్చిన నిర్మాత ఎస్‌.ఆర్‌.ప్రభుగారికి థాంక్స్‌. ఇందులో పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కి థాంక్స్‌. ఇంతకు ముందు పెద్ద హిట్స్‌ సాధించిన సూర్య సినిమాలకు ధీటుగా ఉంటుందని భావిస్తున్నాను. ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరో సూర్య మాట్లాడుతూ – ”ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు థాంక్స్‌. వారి ఆదరణతో దీన్ని నా సొంత ఇంటిలా భావిస్తాను. నా గత చిత్రం విడుదలై ఏడాదిన్నర సమయం పట్టింది. మీలాగానే నేను కూడా శ్రీరాఘవగారికి పెద్ద ఫ్యాన్‌ని. అందుకే ఆయనతో ఈ సినిమా చేశాను. సినిమా చూసే ప్రేక్షకులకు ఇది యూనిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది. ఈ సినిమా మా అందరికీ స్పెషల్‌ మూవీ. నా జీవితంలో శ్రీరాఘవగారు స్పెషల్‌ పర్సన్‌. 18 ఏళ్లు ఆయనతో పని చేయాలని వెయిట్‌ చేశాను. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ వారి వ్యక్తిగత వ్యవహారాలను పక్కన పెట్టి వర్క్‌ చేశారు. శ్రీరాఘవగారు, యువన్‌ మ్యాజికల్‌ కాంబోలో వర్క్‌ చేయడం హ్యాపీగా ఉంది. రకుల్‌, సాయిపల్లవికి థాంక్స్‌. మే 31న ప్రేక్షకులన అంచనాలను అందుకుంటామని భావిస్తున్నాను. ఓ సాధారణ  వ్యక్తి   రాజకీయ శక్తిగా మారి  సమాజానికి ఎలా  ఉపయోగపడ్డాడనేదే ఈ సినిమా” అన్నారు.