ఎల్‌జీఎమ్ (Let’s Get Married) మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
స్టోరీ లైన్ :
గౌతమ్ (హరీష్ కళ్యాణ్), మీరా(ఇవానా) ఒకే కంపెనీలో పనిచేస్తుంటారు. రెండేళ్లుగా ప్రేమలో ఉంటారు. గౌతమ్ పెళ్లి కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తుంటుంది అతడి తల్లి లీలా (నదియా). మీరాను ప్రేమిస్తున్న సంగతి గౌతమ్ చెప్పగానే సంతోషంగా పెళ్లికి ఒప్పుకుంటుంది.
మీరాను కోడలిగా కాకుండా కూతురిలా చూసుకోవాలని అనుకుంటుంది లీలా. మీరా మాత్రం పెళ్లి తర్వాత వెంటనే వేరు కాపురం పెడదామని చెప్పి గౌతమ్‌కు షాకిస్తుంది. ఆమె ప్రతిపాదనను గౌతమ్ ఒప్పుకోడు. ఇద్దరు విడిపోయే పరిస్థితి వస్తుంది. తనకు కాబోయే అత్త లీలా ఎలాంటిదో తెలుసుకోవడానికి ఆమెతో కలిపి ట్రిప్ ప్లాన్ చేస్తుంది మీరా. ఈ ట్రిప్‌లో లీలా తనకు నచ్చితేనే మన పెళ్లి జరుగుతుందని గౌతమ్‌కు కండీషన్ పెడుతుంది మీరా.
లేదంటే స్నేహితుల్లా విడిపోదామని అంటుంది. రెండు కుటుంబాలు కలిసి కూర్గ్ వెళతారు. ఈ ప్రయాణంలో ఏం జరిగింది? మీరా, లీలా మధ్యలో గౌతమ్ ఎలా నలిగిపోయాడు? కూర్గ్ నుంచి లీలా, మీరా. గౌతమ్‌కు చెప్పకుండా గోవా ఎందుకు వెళ్లారు? గోవా నుంచి తిరిగి వచ్చే క్రమంలో వారు ఎలా చిక్కుల్లో పడ్డారు? ఈ ప్రయాణంలో కొడుకు గౌతమ్‌పై లీలాకు ఉన్న ప్రేమను మీరా అర్థం చేసుకుందా? గౌతమ్, మీరాల పెళ్లికి లీలా ఒప్పుకుందా? లేదా? అన్నదే ఈ సినమా కథ.
ఎనాలసిస్ :
సినిమా ప్లాట్ కొంచెం కొత్తదే కానీ దాన్ని డీల్ చేసే విధానం, పాత్రలను తీర్చిదిద్దే విధానం బాలేదు.
పెళ్లికి ముందే అత్తగారితో కలిసి కోడలు ట్రిప్‌కు వెళ్లడం అనే ఐడియా డిఫరెంట్‌గా ఉంది. ఇందులో ఏ పక్షం ఉండాలో తెలియక హీరో సంఘర్షణకు లోనయ్యే సీన్స్ నుంచి కావాల్సినంత కామెడీని రాబట్టుకోవచ్చు. కానీ దర్శకుడు ఆ విషయంలో సక్సెస్ కాలేకపోయాడు. ఎల్జీఎమ్లో(LGM ) అటు కామెడీ ఇటు ఎమోషన్ రెండు సరిగా పండలేదు.
కన్ఫ్యూజన్ :
మీరాకు గౌతమ్ తన ప్రేమను వ్యక్తం చేసే సీన్‌తోనే ఈ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత తన ప్రేమ సంగతి తల్లికి చెప్పడం, రెండు కుటుంబాలు కలిసి ట్రిప్ ప్లాన్ చేయడం లాంటి ఆరంభ సన్నివేశాలతో సినిమా నత్తనడకన సాగుతుంది. ట్రిప్ వెళ్లే సీన్ నుంచి అయినా సినిమా(LGM Review) వేగం అందుకుంటుందని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిల్చాడు డైరెక్టర్.
సీక్రెట్‌గా అత్తాకోడళ్లు కలిసి గోవా ట్రిప్ వెళ్లినట్లుగా చూపించి సెకండాఫ్‌లో ట్విస్ట్ ఇచ్చాడు. మీరా, లీలా ఒకరినొకరు అర్థం చేసుకునే డ్రామా మొత్తం కన్ఫ్యూజన్తో సాగుతుంది. ఏం జరుగుతుందో, కథ ఎటు వెళుతుందో అంతుపట్టదు. మధ్యలో కొత్త పాత్రలు వచ్చిన ఆ కన్ఫ్యూజన్ను పీక్స్‌కు తీసుకెళతాయి. ఇక క్లైమాక్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
హీరో హరీష్ కళ్యాణ్ పాత్ర అతిధి పాత్రలా వుండి, అంతగా ఆకట్టుకలేకపోయింది. సినిమా మొత్తంలో యోగి బాబు కామెడీ ప్రేక్షకులకు కొంత రిలీఫ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు హీరో – హీరోయిన్ల బాస్ పాత్రలో కనిపించినా అంతగా ప్రాధాన్యత లేకపోవడం వలన అది అతని స్థాయికి అనవసరం అనిపించింది.
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :
అందరి పనితీరు సగటు గానే ఉంది
టెక్నికల్ గా :
బాగా లేదు
చూడచ్చా :
ఒక్కసారి చూడొచ్చు
ప్లస్ పాయింట్స్:
సినిమాటోగ్రఫీ
ప్రొడక్షన్ వాల్యూస్
యోగి కామెడీ
మైనస్ పాయింట్స్:
పూర్ స్క్రీన్ ప్లే
డైలాగ్స్ ( డబ్బింగ్)
సంగీతం
నటీనటులు:
హరీష్ కళ్యాణ్, నదియా, ఇవానా, యోగి బాబు, ఆర్జే విజయ్
సాంకేతికవర్గం :
సినిమా టైటిల్ : ఎల్‌జీఎమ్ (Let’s Get Married)
బ్యానర్ – ధోని ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేదీ : 04-08-2023
సెన్సార్ రేటింగ్: “U/A”
దర్శకుడు – రమేష్ తమిళ మణి
సంగీతం – రమేష్ తమిళమణి
సినిమాటోగ్రఫీ – విశ్వజిత్ ఒడుక్కతిల్
ఎడిటింగ్ – ప్రదీప్ ఇ రాఘవ్
నిర్మాతలు – సాక్షి సింగ్ ధోని, వికాస్ హసిజా
రన్‌టైమ్: 152 నిమిషాలు
మూవీ రివ్యూ : రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్