Reading Time: 2 mins
ఎవరు సినిమా ప్రెస్ మీట్
 
ఎవరు` సక్సెస్‌తో న్యూ జనరేషన్ హీరోలకు శేష్ ఓ బెస్ట్ ఎంగ్జాంపుల్‌గా నిలిచాడు – హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు 
 
అడివిశేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర ప్రధాన తారాగణంగా ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా బ్యానర్‌పై రూపొందుదిన థ్రిల్లర్ `ఎవరు`. 
 
వెంక‌ట్ రామ్‌జీ దర్శకుడు. పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాత‌లు. ఆగస్ట్ 15న సినిమా విడుదలైంది.
 
ఈ సందర్భంగా
 
దిల్‌రాజు మాట్లాడుతూ – “క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి.. క్షణం అనే సినిమాను ఓ టీమ్ వర్క్‌తో రూపొందించి చిన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టి ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు శేష్. తర్వాత `గూఢచారి`తో సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు `ఎవరు`తో సక్సెస్ అందుకున్నారు. 
సాధారణంగా మాకు బ్యాగ్రౌండ్ లేదు.. మమ్మల్ని ఎవరు చూస్తారు? అని అంటుంటారు. అలాంటి వారందరికీ శేష్ ఓ బెస్ట్ ఎగ్జాంపుల్. మన దగ్గర టాలెంట్ ఉంటే కష్టపడి ఏదైనా చేయవచ్చునని న్యూ జనరేషన్‌కి ఓ యాక్టర్‌గా గ్రో అవుతూ రుజువు చేసుకున్నాడు. సినిమా చూశాను. పాటలు, 
ఫైట్స్ లేకుండా, డైరెక్టర్ వెంకట్ రామ్‌జీతో కలిసి ఆడియెన్‌ని కూర్చోబెట్టారు. ఇన్ని ట్విస్టులతో ప్రేక్షకుడిని థ్రిల్ చేయడమనేది ఈ మధ్య జరగలేదు.  రిలీజ్ అయిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు, విమర్శకులు సినిమాను ప్రశంసించారు. రెజీనా మా బ్యానర్‌లో పిల్లానువ్వు లేని 
జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల్లో నటించింది. పెర్ఫామెన్స్ సైడ్ రెజీనాని డైరెక్టర్ చూపించిన తీరు చూసి నెగెటివా? పాజిటివా? అనిపిస్తుంది. నా మిత్రుడు పివిపి బ్యానర్‌లో మరో మంచి సినిమా వచ్చింది. నైజాంలో సినిమాను విడుదల చేసినందుకు ఆనందంగా ఉంది. శేష్‌తో మాట్లాడుతూ ఏయే సినిమాలు చేస్తున్నావని అడిగాను.. తను రెండు సినిమాలు చేస్తున్నానని చెప్పాడు. అవి పూర్తయిన తర్వాత నా బ్యానర్‌లో కూడా ఇలాంటి సినిమాలు చెయ్. ఎందుకంటే ఇలాంటి సినిమాలను నేను జడ్జ్ చేయలేను. డైరెక్టర్ వెంకటర్ రామ్‌జీకి అభినందనలు. నవీన్ చంద్ర హీరోగానే కాదు.. యాక్టర్ కూడా రాణిస్తున్నాడు. ఎంటైర్ టీమ్‌కి అభినందనలు“ అన్నారు. 
 
డైరెక్టర్ వెంకట్ రామ్‌జీ మాట్లాడుతూ – “ఇది నా ఒక్కడి విజయం కాదు.. ఎంటైర్ టీమ్‌ది. నా నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ వాళ్ల బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారు. నిర్మాతకు సినిమా చేయడం సులభమే కానీ.. దాన్ని ఆడియెన్ వరకు రీచ్ చేయించడం చాలా కష్టం. ఆ ఆడియెన్‌కు రీచ్ అయ్యేలా చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్“ అన్నారు. 
 
నవీన్ చంద్ర మాట్లాడుతూ – “ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. టెక్నీషియన్స్‌ని పొగుడుతున్నారు. దిల్‌రాజుగారు ఇచ్చిన సలహాను పాటించడం వల్ల కొత్త కొత్త పాత్రలు చేస్తున్నాను. మంచి పేరు వస్తుంది. అలాగే అశోక్ క్యారెక్టర్ ఇచ్చిన అడివిశేష్, రెజీనాకు థ్యాంక్స్. బాల్ రెడ్డి తర్వాత అశోక్ అనే క్యారెక్టర్‌ను గుర్తుండిపోయేలా చేశారు. శేష్, వెంకట్ రామ్‌జీ రెండేళ్ల కష్టపడ్డారు. యాక్టర్‌గా ఇంత అప్రిషియేట్ చేసిన క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ రామ్‌జీగారికి, పివిపిగారికి థ్యాంక్స్. “ అన్నారు. 
 
రెజీనా కసండ్ర మాట్లాడుతూ – “యునానిమస్‌గా సక్సెస్ టాక్ వస్తుంది. దిల్‌రాజుగారు ప్రాజెక్ట్ ప్రారంభం నుండి మాకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. వెంకట్ రామ్‌జీ నా నుండి బెస్ట్ యాక్టింగ్‌ను రాబట్టుకున్నారు. సింగిల్ స్క్రీన్స్‌లో సినిమా చూశాం. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ మూవీ అంటే ఏంటో నిన్న థియేటర్‌లో చూశాను. సినిమాకు సంబంధించిన ట్విస్టులను ఎవరూ రివీల్ చేయకండని ప్రేక్షకులను కోరుకుంటున్నాను“ అన్నారు. 
 
అడివిశేష్ మాట్లాడుతూ – “దిల్‌రాజుగారికి థ్యాంక్స్. రాజుగారు చేసిన ఎవడు సినిమాకు, నాకు ఓ రిలేషన్ ఉంది. ఎవడు సినిమాలో మెయిన్ విలన్‌గా నటించాలని చాలా ప్రయత్నించాను. నాకు కుదరలేదు. ఎవరు సినిమా చూసిన తర్వాత దిల్‌రాజుగారు ఫోన్ చేసి నా బ్యానర్‌లో ఎప్పుడు సినిమా చేస్తున్నావని అడిగారు అది నాకు హ్యాపీగా అనిపించింది. గూఢచారి కంటే మూడు రెట్లు ఓపెనింగ్స్ వచ్చాయని అందరూ అంటున్నారు. బుక్ మై షోలో మంచి ఆదరణ దొరుకుతుందని అర్థమవుతుంది. సింగిల్ స్క్రీన్స్‌లో సినిమాకు వెళితే.. ఓ చోట ఆడియెన్ చీకట్లో నేను ఉన్నానని చూడకుండా తప్పుకోండి అంటూ నన్ను పక్కకు తోసేశాడు.. తను అంతలా సినిమాలో ఇన్‌వాల్స్ అయిపో్యున్నాడు. అలాగే సీట్ ఎడ్జ్‌ ప్రేక్షకులను రెజీనా నాకు చూపించింది. ప్రతి ట్విస్ట్‌కు ప్రేక్షకులు క్లాప్స్ కొట్టారు. ఎంజాయ్ చేస్తున్నారు“ అన్నారు. 
 
 
మురళీ శర్మ మాట్లాడుతూ “ చాలా ఎంజాయ్ చేశాను. శేష్, రెజీనా, నవీన్ చాలా కష్టపడ్డారు. సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్“ అన్నారు.