ఎస్పీ బాలుకు తెలుగు పరిశ్రమ స్వర నీరాజనం

Published On: June 3, 2021   |   Posted By:

ఎస్పీ బాలుకు తెలుగు పరిశ్రమ స్వర నీరాజనం

బాలూ .. అందరు ముద్దుగా పిలుచుకునే పేరు ..! అంతే కాదు సంగీత సాగరంలో మనల్ని ఓలలాడించి సంగీత ప్రియులను తన గానామృతంతో పులకింపచేసిన పేరది ! శ్రీ పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం అంటే అందరికి తెలియకపోవచ్చు .. కానీ ఎస్పీ బాలు అంటే చాలు .. మధురమైన గీతాలే గుర్తొస్తాయి. ఒక్క తెలుగులోనే కాదు దాదాపు అన్ని భాషల్లో కలిపి నలభైవేలకు పైగా పాటలు పాడిన మహా గాయకుడూ బాలు !! బాలసుబ్రహ్మణ్యం ఆకస్మిక మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. అయన లేని లోటు ఎప్పటికి తీర్చ లేనిది. రేపు ఎస్పీ బాలు జయంతి, ఈ సందర్బంగా యావత్ తెలుగు చిత్రసీమ ఆయనకు ట్రిబ్యూట్ అందిస్తుంది. జూన్ 4న అనగా రేపు  ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ”ఎస్పీ బాలుకు స్వరనీరాజనం” కార్యక్రమం ‘ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్’ యూట్యూబ్ ఛానల్, మరియు ‘సంతోషం సురేష్’ యూట్యూబ్ చానెల్స్ లో 12 గంటల పాటు లైవ్ ప్రోగ్రామ్ కంటిన్యూ గా ప్రసారం అవుతుంది.

ఈ విషయం గురించి  సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ మాట్లాడుతూ .. బాలుగారి జన్మదినోత్సవం … బాలుగారి జయంతి రేపు జూన్ 4న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అందరం కలిసి ఓ ట్రిబ్యూట్ ఇస్తున్నాం. ఈ ట్రిబ్యూట్ ఇస్తున్న వారంతా బాలూ గారితో ఉన్న అనుబంధాలను కూడా పంచుకుంటారు. మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అందరం కలిసి చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా ‘ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్’ యూట్యూబ్ ఛానల్, మరియు ‘సంతోషం సురేష్’ యూట్యూబ్ చానెల్స్ ద్వారా చూసే అవకాశం ఉంది. అందరు చూసేలా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాం. ఉదయం 10 గంటలనుండి రాత్రి 10 గంటల వరకు వస్తుంది. ఈ కార్యక్రమం ఎన్టీవీ యూట్యూబ్ ఛానల్, సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం అవుతుంది.  తప్పకుండా చూసి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అన్నారు.  

తెలుగు ఫిల్మ్  ఛాంబర్ సెక్రటరీ  నిర్మాత కెఎల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ  జూన్ నాలుగున ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు సినిమా నిర్మాతలు, దర్శకులు, హీరోలు, అందరు పంచుకుంటారు. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చూడండి అన్నారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ నటి జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ .. ఇలాంటి ఒక రోజు వస్తుందని కలలోకూడా అనుకోలేదు.  ఎస్పీ బాలు గారు లేకుండా అయన పుట్టినరోజు జరుపుకోవడం అన్నది దురదృష్టకరం. నేనిప్పటికీ అయన లేరంటే నమ్మలేకపోతున్నాను. నాలాగా కొన్ని కోట్ల మంది కూడా నమ్మలేకపొతున్నారు.  కానీ జీవితం అన్నది ఇలాగే ఉంటుంది. భగవంతుణ్ణి చెడ్డవాడు అనాలా మంచి వాడు అనాలా .. దేవుడు మనకు ఇంత మంచి చూపిస్తూ ఉన్నందుకు మంచి వాడు అనాలి కానీ బాలు ని తీసుకుపోయినందుకు ఆయనను ఏమనాలో .. కానీ మమ్మల్ని అందరికి కాపాడుతున్నందుకు థాంక్స్ దేవుడా అని మొక్కుకుంటున్నాను. బాలుగారు చనిపోయిన తరువాత అప్పుడున్న పాండమిక్ సిట్యుయేషన్ లో ఎలా రెస్పాండ్ కావాలో తెలియని పరిస్థితి. అప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారు. బాలుగారి గురించి చాలా మంది సినిమా పరిశ్రమలో చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది.  అయన గురించి చాలా చెప్పుకోవాలనుకున్న వాళ్ళు ఉన్నారు. అయన గురించి తెలుగు పరిశ్రమలో తెలియని వారు ఉండరు. ఇండస్ట్రీ లో అందరిని కవర్ చేయలేకపోవచ్చు కానీ ముఖ్యమై పాపులారిటీ ఉన్నవాళ్లను కవర్ చేస్తాం. ఈ పుట్టినరోజు ఆయనకు 75 వ జయంతి. అందుకే రేపు జూన్ 4న ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్లు ఇలా అందరు కలిసి చక్కని ప్రోగ్రాం ఏర్పాటు చేసారు, ఈ కార్యక్రమాన్ని రూపొందించడంలో దర్శకుడు శంకర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రసన్న, మూవీ ఆర్టిస్ట్ తరపున నేనుకూడా పాల్గొంటున్నాను. ఈ కార్యక్రమం సక్సెస్ చేయడం అన్నది కాదు ఇది మనం దర్మం. అయన వెళ్ళిపోయినా తరువాత కూడా అయన ఏమిటి అన్నది తెలుసుకోవాలి. అయన గురించి తెలియనిది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అయన చిరస్మరణీయంగా నిలిచిపోవాలి. అందుకే మీరుకూడా రేపు ఉదయం 10 నుండి రాత్రి వరకు తప్పకుండా చూడండి !! మీ పెద్దవాళ్లకు తప్పకుండా చూపించండి. బాలు కార్యక్రమం మనమందరం చూడాలి. ఇది ఒక భారతీయుడిగా మన బాధ్యత .. అయన ఇండియాకు ప్రైడ్. ఈ కార్యక్రమంలో సినిమాకు సంబందించిన అందరిని ఒకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం, సో ఈ కార్యక్రమాన్ని గొప్పగా సక్సెస్ చేయాలనీ అందరిని కోరుకుంటున్నాను అన్నారు.

డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్  దర్శకుడు ఎన్ శంకర్ మాట్లాతుడు .. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్బంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అందరు కలిసి ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. వారెక్కడున్న మరచిపోకుండా ఓ మంచి కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 10 నుండి రాత్రి పదిగంటల వరకు బాలు గారి అభిమానులను, సంగీత ప్రియులను ఆకట్టుకునేలా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. సినిమా దర్శకులు, నిర్మాతలు, హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్స్, రచయితలూ ఇలా అందరు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మీకు నచ్చే పాటలు ఉంటాయి. ఈ కార్యక్రమం ద్వారా మరోసారి బాలూ గారిని గుర్తుచేసుకుని అవకాశం ఇది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చూసి విజయవంతం చేయండి అన్నారు.

నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ… బాలు గారు సింగర్ గానే కాదు నిర్మాతల మండలిలో సభ్యుడు,  నిర్మాతగా కూడా విశ్వనాధ్ గారి దర్శకత్వంలో  కమల్ హాసన్ తో శుభ సంకల్పం అనే సినిమా తీసిన గొప్ప నిర్మాత. ఒక గాయకుడిగానే కాదు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా భారదేశంలో ఉన్న అన్ని భాషల్లో పాటలు పాడిన గొప్ప సింగర్ అయన. ఏ భాషలో పాట పడిన ఆయనకే సాటి. అలాగే బ్రీత్ లెస్ సాంగ్ పాడి అందరికి షాక్ ఇచ్చాడు. అయన మల్టి టాలెంట్ పర్సన్, ఎస్పీ బాలు గారు ఈ రోజు మన మధ్య బౌతికంగా లేకపోయినా సూర్యుడు, చంద్రుడు ఉన్నంతకాలం అయన మనతోనే ఉంటారు. జూన్ 4న అయన 75వ పుట్టిన రోజు,  అందుకే ఆయనకు గుర్తు చేసుకుంటూ టాలీవుడ్ మొత్తం కలిసి బాలు గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ .. ఈ గొప్ప కార్యక్రమం చేపట్టాం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కోరుకుంటున్నాం. ఎస్పీ బాలు గారికి తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది. ఈ కార్యక్రమం  జూమ్ మీటింగ్ లో అటెండ్ అయి బాలు తో ఉన్న అనుబంధాన్ని సినిమా రంగానికి చెందిన అందరు పాల్గొంటారు. బాలూ గారి కోసం కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకుని మన బాలు కోసం చేస్తున్న ఈ కార్యక్రమం ఉదయం 10 నుండి రాత్రి 10 వరకు జరుగుతుంది అన్నారు.