ఏందిరా ఈ పంచాయితీ మూవీ అక్టోబర్ 6 విడుదల
హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ఏందిరా ఈ పంచాయితీ ట్రైలర్ అక్టోబర్ 6న చిత్రం విడుదల
భరత్, విషికా లక్ష్మణ్ జంటగా ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మించిన చిత్రం ఏందిరా ఈ పంచాయితీ. ఈ మూవీతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విలేజ్ లవ్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం రాబోతోంది. ఇందులో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌ను కూడా చూపించబోతోన్నట్టుగా ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. తాజాగా హీరో శ్రీకాంత్ చేతులు మీదుగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయించారు మేకర్లు.
ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ట్రైలర్ బాగుంది. కొత్త టీం ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించింది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
ఇక ఈ ట్రైలర్లో సాక్ష్యాలు ఉన్నవన్నీ నిజం కావు ఆధారాలు లేనివి అబద్దాలు కావు అంటూ పోలీస్ పాత్ర చెప్పే డైలాగ్‌తో ఇందులో క్రైమ్, సస్పెన్స్ అంశాలున్నాయని తెలుస్తోంది కొన్ని ప్రేమలు పెళ్లితో మొదలవుతాయి, కొన్ని పెళ్లికి ముందే ఆగిపోతాయి ఆగిపోయిన ప్రేమను వద్దనుకుంటే పెళ్లితో మొదలయ్యే ప్రేమను ఇవ్వాలనుకుంటున్నా అని హీరోయిన్‌తో తండ్రి చెప్పే మాటలను ఓ ఎమోషనల్ లవ్ స్టోరీ ఉందనిపిస్తుంది ఆడదాని ప్రేమ అవసరాలు తీరేంత వరకే అంటూ హీరో ట్రైలర్ చివర్లో చెప్పిన డైలాగ్ చూస్తే ఇదొక ఎమోషనల్ లవ్ స్టోరీ అని అర్థం అవుతోంది.
ఈ ట్రైలర్లో విజువల్స్ ఎంతో సహజంగా ఉన్నాయి. ఊరి వాతావరణాన్ని, అందాలను చక్కగా చూపించారు కెమెరామెన్. ఆర్ఆర్ కూడా ఎంతో బాగుంది. మాటలు గుండెకు హత్తుకునేలా ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పాటలు, టీజర్, గ్లింప్స్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్‌గా, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల ఈ చిత్రానికి మాటలు అందించారు.
నటీనటులు :
భరత్, విషికా లక్ష్మణ్, కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు
సాంకేతిక బృందం :
బ్యానర్ : ప్రభాత్ క్రియేషన్స్
నిర్మాత : ప్రదీప్ కుమార్. ఎం
డైరెక్టర్ : గంగాధర. టి
కెమెరామెన్ : సతీష్ మాసం
సంగీతం : పీఆర్ (పెద్దపల్లి రోహిత్)
ఎడిటర్ : జేపీ