Reading Time: 2 mins
ఏకమ్ చిత్రం మీడియా సమావేశం
 
ఫిలాసిఫికల్ ఫిక్షన్ జోనర్లో మార్చ్ 5న వస్తోన్న డిఫరెంట్ కథా చిత్రం ఏకమ్

అభిరామ్ వర్మ, తనికెళ్ల భరణి, శ్వేతావర్మ, కల్పిక గణేష్, అదితి మ్యాకల్ ప్రదాన పాత్రదారులుగా వరుణ్ వంశీ బి. దర్శకత్వంలో ఆనంద థాట్స్ అండ్ సంస్కృతి ప్రొడక్షన్స్ బ్యానర్లు పై కళ్యాణ్ శాస్త్రి, శ్రీరామ్ కె, పూజ యం. సంయుక్తంగా నిర్మించిన చిత్రం “ఏకమ్”.
 
ఫిలాసిఫికల్ ఫిక్షన్ జోనర్లో మొట్ట మొదటిసారిగా తెలుగులో రూపొందుతున్న “ఏకమ్” చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని మార్చ్ 5న వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారు. 
 
ఈ చిత్రానికి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సర్క్యూట్ లో ఈ 4 నాలుగు ఫిల్మ్ ఫేర్ ఆవార్డ్స్ రావడం గొప్ప విశేషం. అటు ప్రేక్షకుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ “ఏకమ్” చిత్రంపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. అలాగే ఈ చిత్రంలోని పాటలకి, టీజర్స్ కి పబ్లిక్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.  
 
ఈ సందర్బంగా ఫిబ్రవరి 10న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.. ఈ సమావేశంలో హీరో అభిరామ్, హీరోయిన్ కల్పిక గణేష్, నటుడు దయానంద్ రెడ్డి, దర్శకుడు వరుణ్ వంశీ, నిర్మాత కళ్యాణ్ శాస్త్రి పాల్గొన్నారు..

నటుడు దయానందరెడ్డి మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ వరుణ్ గారు కాన్సెప్ట్ చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. నాకు తెలిసి  ఇలాంటి కాన్సెప్ట్స్ రావడం చాలా అరుదు. క్యారెక్టర్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా క్యూరియసిటీగా ఉంటాయి. ఈ సినిమా షూటింగ్ నాకు మంచి ఎక్స్పీరియెన్స్ ఇచ్చింది. సాంగ్స్, టీజర్స్ కి ఎక్స్ ట్రార్డినరి రెస్పాన్స్ వచ్చింది.. సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఒక కొత్తరకమైన సినిమాని ప్రేక్షకులు చూడబోతున్నారు.. అందరూ “ఏకమ్” చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన కళ్యాణ్ శాస్త్రి మాట్లాడుతూ.. ‘ సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆద్యంతం ఆసక్తికరంగా సినిమా ఉంటుంది. చూసే కొద్దీ చూడాలనిపించేలా.. కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న మా “ఏకమ్” చిత్రం రోమాలు నిక్కపొడుచుకునేలా ఉంటుంది.. అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ప్రతీ ఒక్కరి జీవితంలో జరిగిన స్టోరీ అని ఫీలవుతారు. ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు మా “ఏకమ్” సినిమాని చూసి అప్రిషియేట్ చేశారు. అలాగే నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు.  ఫిలాసిఫికల్ ఫిక్షన్ జోనర్ సినిమా ఇది. ఇంత వరకూ తెలుగులో ఇలాంటి జోనర్ రాలేదు. “ఏకమ్” లాంటి ఒక అద్భుతాన్ని ప్రేక్షకులు చూడబోతున్నారు. ఆడియెన్స్ అంతా మా సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు వరుణ్ వంశీ బి. మాట్లాడుతూ.. ‘ ఈ సినిమా స్టార్ట్ కావడానికి మెయిన్ రీజన్ కళ్యాణ్ శాస్త్రి. మాకు బ్యాక్ బోన్ గా ఉండి  ఎంతో సపోర్ట్ చేశారు. ఆయనకి నా థాంక్స్. ఫిలాసిఫికల్ ఫిక్షన్ బాక్డ్రాప్ లో ఇంతవరకూ తెలుగులో ఎలాంటి సినిమా రాలేదు. ఫస్ట్ టైమ్ “ఏకమ్” చిత్రాన్ని డిఫరెంట్ గా రూపొందించాం. ఒక 5 క్యారెక్టర్స్ చుట్టూ పార్లర్ గా కథ జరుగుతుంది. లాక్ డౌన్ టైములో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మా సినిమా ప్రదర్శించాం. నాలుగు అవార్డ్స్ వచ్చాయి. మాకు చాలా ఆనందంగా ఉంది.  ఇలాంటి సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయకుండా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని చాలామంది ఫ్రెండ్స్ చెప్పారు. మా సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ పోస్టర్ హీరో సుధీర్ బాబు విడుదల చేశారు. సాంగ్స్, టీజర్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మార్చ్ 5న మా సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నాం అన్నారు.

హీరోయిన్ కల్పిక గణేష్ మాట్లాడుతూ.. ‘ ఏకమ్ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. అందరి గుండెల్లో ఈ సినిమా నిలిచిపోతుంది. సెల్ఫ్ కంప్లెటేషన్స్ గురించి చాల డిటైల్డ్ గా చూపించారు డైరెక్టర్ వరుణ్. విభిన్నమైన కథ-కథనంతో ఇంట్రెస్టింగ్ గా సినిమా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన వరుణ్ వంశీకి, శాస్త్రిగారికి చాలా థాంక్స్. మార్చ్ 5న రాబోతున్న ఈ సినిమా అందరికీ చాలా బాగా నచ్చుతుంది అన్నారు.

హీరో అభిరామ్ వర్మ మాట్లాడుతూ.. ” మా “ఏకమ్” టైటిల్ కి జాబ్ లెస్ గాడ్ అని క్యాప్షన్ పెట్టాం. దానికి తగ్గట్లుగానే సినిమా ఉంటుంది. ప్రతీ ఒక్కరి జర్నీలో జరిగే కథ ఇది. ఈ సినిమా చేస్తున్నప్పుడు బిగ్ ఇంపాక్ట్ కలిగించింది. ప్రతీ క్యారెక్టర్ ని ఎక్స్ లెంట్ గా డిజైన్ చేశారు. టైంలెస్ క్యారెక్టర్స్ అన్నీ ఒక విషయం వల్ల ఎలా కలుస్తాయి.. అనేది మెయిన్ కథాంశం. ఈ సినిమా ద్వారా యాక్టింగ్ పరంగా చాలా విషయాలు నేర్చుకున్నాను. మా సినిమా చూసి  మమ్మల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

 అభిరామ్ వర్మ, తనికెళ్ళ భరణి, కల్పిక గణేష్, అదితి మ్యాకల్, లక్ష్మణ్ మీసాల, శ్వేతావర్మ, తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం; జోస్ ఫ్రాంక్లిన్, డివోపి; ఇక్బాల్ అజ్మి, ఎడిటర్; శ్రీనివాస్ టి, పీఆర్ఓ; వంశీ-శేఖర్, నిర్మాతలు; కళ్యాణ్ శాస్త్రి, శ్రీరామ్ కె, పూజ.యం, రచన-దర్శకత్వం; వరుణ్ వంశీ బి.