Reading Time: 2 mins
ఏడు చేపల కథ మూవీ రివ్యూ
 
టెమ్ట్ అవ్వద్దు (‘ఏడు చేపల కథ’ రివ్యూ)
 
 
క్రితం సంవత్సరం ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యినప్పుడు మీడియాలో ఓ పెద్ద సెన్సేషన్. అసలు ఈ బూతు ఏంటి ..టెమ్ట్ రవి అనే క్యారక్టర్ ఏంటి…అని సోషల్ మీడియాలోనూ చర్చ. దాంతో ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా ఓ లుక్కేద్దామనుకుని కుర్రాళ్లు వెయిటింగ్. అయితే సెన్సార్ లో ఈ సినిమాలో ఇరుక్కుపోయి బయిటపడటానికి చాలా కాలం పట్టింది. మొత్తానికి అనేక రివిజన్స్ తో ఫైనల్ గా థియోటర్స్ లో దిగింది. ఇంతకీ ఈ ఏడు చేపల వ్యవహారం ఏమిటి…సినిమాలో ఏమన్నా విషయం ఉందా..సెన్సార్ లో కట్ అయ్యిపోయిందా…టెమ్ట్ అయ్యిన కుర్రాళ్లకు సంతృప్తిని ఇచ్చిందా వంటి విషయాలను రివ్యూలో చూద్దాం.
 
కథేంటి

టెంప్ట్ రవి (అభిషేక్ రెడ్డి)కి తలసేమియా వ్యాధితో బాధపడుతూంటాడు.నెలకోసారి రక్తం ఎక్కించుకోకపోతే చనిపోతాడు. ఈ రోగం తో  పాటు అతనికు మరో రోగం ఉంటుంది. అతని ముందు ఎవరైనా అమ్మాయి ఎక్స్ పోజింగ్ చేస్తే అస్సలు తట్టుకోలేడు.  టెంప్ట్ రవికి రాధ (భాను శ్రీ) రూం మేట్. వీరిద్దరికీ మరో ఇద్దరు ప్రెండ్స్ ఇంటారు. వీరంతా కూడా థలసేమియా వ్యాధి బాధితులే కావడంతో సెల్ ఫోన్ దొంగతనాలు చేసి రక్తం ఎక్కుంచుకుంటూంరు. అయితే  టెంప్ట్ రవి మాత్రం కష్టపడి పనిచేసుకుంటారు. ఓ సారి భావన (అయేషా సింగ్) టెంప్ట్ రవికి బ్లడ్ డొనేట్ చేసి సాయం చేస్తుంది. తను ఎవరో తెలియకుండానే సాయం చేసిన భావనను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు టెంప్ట్ రవి.

అయితే ఊహించని విధంగా భావన తనకు తెలియకుండా ప్రెగ్నెంట్ అవుతుంది. ఆమె ప్రెగ్నెంట్ కావడానికి కారణం ఎవరో తెలియకపోవడంతో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతుంది. అయితే ఆమె ఆ టైమ్ లో సుందర్ అనే వ్యక్తి కాపాడతాడు. ‘చనిపోయి సాధించేది ఏం లేదు’ అని ఆమెకు చెప్పి.. రక్షించి నిన్ను ప్రెగ్నెంట్ చేసిన వాడిని నేను కనిపెడతా అని హామీ ఇస్తాడు. అందుకు ప్రతిఫలంగా ఓ సాయిం అడుగుతాడు. అదేమిటంటే…. సుందర్ ప్రేమించిన అమ్మాయి మీరా ఆత్మను భావన శరీరంలోకి ప్రవేశపెడతాడు.
 
మరో ప్రక్క  టెంప్ట్ రవి ఎవర్నైతే చూసి టెంప్ట్ అవుతాడో.. వాళ్లంతా రాత్రి పూట రవి దగ్గరకు వచ్చి శృంగారం చేస్తూంటారు. అసలు వాళ్లెందుకు రవి దగ్గరకు వస్తారు. ఆ  ఏడు చేపలు ఎవరు?  భావనను ప్రెగ్నెంట్ చేసింది ఎవరు? రవి కోసం రాధ చివరికి ఏం చేసింది? సుందర్ ఏమయ్యాడు అన్నదే ఏడు చేపల్లోని మిగతా కథ.

ఇదీ మ్యాటర్
 
కొన్ని ట్రైలర్స్ హిట్ అవుతాయి..మరికొన్ని సినిమాలు హిట్ అవుతాయి. ఇది మొదట కోవకు చెందిన సినిమా. కేవలం ట్రైలర్ చూపించి…ఏడు చేపలు ఉన్నాయని ఎరవేసి..ఆ తర్వాత చీకటి దొబ్బ కొట్టే వ్యవహారం ఇది. ఎక్కడా దర్శకుడుకు కానీ, హీరోకు కానీ నిబద్దత లేదు. తాము తీసింది సినిమానా కాదా అన్న విషయం వాళ్లకు తెలియదు. మినిమం సినిమా గ్రామర్ తెలియదు. ఎంతసేపూ డైలాగులు..డైలాగులు..డైలాగులు. టీవి సీరియల్ కన్నా దారుణమైన నిర్మాణ విలువలు. ఎక్కడ ఏ సీన్ మొదలై…ఎండ్ అవుతుందో వాళ్లకే తెలియదు. అడల్ట్ కామెడీ కూడా ఓ సినిమా గ్రామర్ పరిధిలో ఉంటుందనే మినిమం సెన్స్ లేని వాళ్లు తీసిన సినిమా ఇది. ఇలాంటి సినిమా లో కథ,కథనం ఆశించటం, అలాగే టెక్నికల్ వ్యాల్యూస్ ఆశించటం కూడా ఘోరమే అని తేల్చేసారు.  

చూడచ్చా

చెత్త సినిమాల్లోంచి కూడా కాలక్షేపాన్ని ఏరుకునే సత్తా ఉంటే నిరభ్యంతరంగా చూడచ్చు.