ఏడు చేపల కథ చిత్రం విలేకరుల సమావేశం
నవంబర్ 7న ఏడు చేపల కథ
చరిత్ర సినిమా ఆర్ట్స్, రాకేష్ రెడ్డి సమర్పణలో జీవీఎన్ శేఖర్ రెడ్డి నిర్మాతగా ఎస్ జె చైతన్య దర్శకత్వం వహించిన చిత్రం ఏడు చేపల కథ. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని ఎ సర్టిఫికెట్తో నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ చిత్ర అఫీషియల్ టీజర్‌ను విడుదల చేశారు. లో ఏర్పాటు చేసి ఈ సందర్భంగా…
చిత్ర ప్రొడ్యూసర్ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ… ఏడు చేపల కథని సంత్సరం క్రితం శ్యామ్ రెడ్డి చెప్పారు. ఈ చిత్రంలో యూత్‌కి ఉపయోగపడే మెసేజ్ ఉంటుంది. ఈ ఏడు చేపల కథ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం. ఈ చిత్రాన్ని దర్శకుడు శ్యామ్ చైతన్య పద్నాలుగు మంది అమ్మాయిలతో చాలా అద్భుతంగా తెరకెక్కించారు. కథకి వాళ్ళు ఎంతో అవసరం. ఈ చిత్రంలో నటించిన హీరో టెంప్ట్ రవి వేరే షూటింగ్లో ఉండడంతో రాలేకపోయారు. సునీల్ క్యారెక్టర్ ఈ చిత్రంలో ఒళ్ళు గగుర్పెడుతుంది. బిగ్‌బాస్ భానుశ్రీ, అక్షర, యషిక చాలా మంది నటులు తెలుగు అమ్మాయిలకు కూడా చాలా మందికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ చిత్రం ద్వారా డైరెక్టర్‌కి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రం వెనుక చాలా మంది కీలక పాత్ర పోషించారు. మా స్వగ్రామం నెల్లూరు. ఈ చిత్రం నవంబర్ ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న లక్ష్మీ పిక్చర్స్ వారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు.
చిత్ర దర్శకుడు శ్యామ్ మాట్లాడుతూ… చిన్న సినిమా లైఫ్‌ను డిసైడ్ చేసేది టీజర్. అది క్లిక్ అయితే మూవీ హిట్ అయినట్లే. మా టీజర్ రిలీజ్ అవ్వగానే చాలా మంది చాలా కామెంట్లు చేశారు. బూతు సినిమాలు తీసి డబ్బులు సంపాదిస్తున్నామని. కాని అలాంటిది ఏమీ లేదు. ఈ టీజర్ కి ఇంత మంచి అవకాశం రావడానికి ప్రధాన కారణం.టెంప్ట్ రవి తన పాత్రలో చాలా ఫన్ ఉంటుంది. ఎక్కువ ఫన్ ఎంటర్టైన్మెంట్. కేవలం యూత్‌ను టార్గెట్ చేస్తూ చేసిన చిత్రమిది. ఫైనల్లీ ఈ మూవీ ఫ్మామిలీస్కి మాత్రం కాదు. కేవలం యూత్‌కి మాత్రమే. సినిమాలు కూడా ఈ మధ్య ఎక్కువగా ఫ్మామిలీస్ చూడడంలేదు.యూత్ మాత్రమే థియేటర్స్‌కి వచ్చి సినిమాలు చూస్తున్నారు. ఇది కేవలం అడల్డ్కి మాత్రమే మూవీ. మా తపన అంతా సినిమాలో కనిపిస్తది. ఏడు చేపల కథ బూతు సినిమా కాదు.
మేఘా చౌదరి మాట్లాడుతూ… టీజర్ తోనే మా చిత్రానికి పెద్ద క్రేజ్ వచ్చింది. మాకు ఇంతమంచి అవకాశం ఇచ్చిన మాప్రొడ్యూసర్, డైరెక్టర్లకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మా సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక చాలా కాంట్రవర్సీలు వచ్చాయి. కానీట్రైలర్ ఎలాగైతే హిట్ చేశారో. మా మూవీని కూడా అలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. అన్నారు.
అయిషా సింగ్ మాట్లాడుతూ.. తెలుగులో ఇది నా మొదటి చిత్రం. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ ప్రొడ్యూసర్లకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. కొంత కాంట్రవర్సీ వచ్చినా కూడా సినిమాని మీరందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అని అన్నారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీల్ మాట్లాడుతూ… ఈ మూవీలో నాది చాలా భయంకరమైన క్యారెక్టర్.నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.ఈ మూవీని బాగా ప్రమోట్ చెయ్యాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వీరభాద్ర, ఇషిక, అనుపమ తదితరులు పాల్గొన్నారు.