ఐఐటి కృష్ణమూర్తి మూవీ రివ్యూ

Published On: December 10, 2020   |   Posted By:

ఐఐటి కృష్ణమూర్తి మూవీ రివ్యూ

‘ఐఐటి కృష్ణమూర్తి’ రివ్యూ

Rating:1/5

వరల్డ్ సినిమాకు సగటు సినీ ప్రేక్షకుడు దగ్గరైన ఈ ఓటీటి రోజుల్లో ఓ సీన్ ని తెరపై చూస్తున్నప్పుడే ఎనలైజ్ చేసేస్తున్నారు. స్క్రీన్ ప్లేలో ఎక్కడైనా కాస్త వీక్  అయిన సీన్ చూసి, క్లైమాక్స్ పసిగట్టేసి,ఓస్ ఇంతే కదా అని తేల్చేస్తున్నారు. కాబట్టి వాళ్ల తెలివితో ఆడుకోవాలంటే …అంతకుమించి తెలివిని ప్రదర్శించగలగాలి. సినిమా మధ్యలో ప్రేక్షకుడు కూర్చుని తన చుట్టూ ఉన్న పజిల్ లాంటి థ్రిల్లర్ ని విప్పటానికి ఇష్టపడతారు. ఆ పజిల్ అంతలా తయారు చేయటంలోనే దర్శకుడు గొప్పతనం బయిటపడుతుంది. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకుడుకి థ్రిల్ పంచిపెట్టింది. సినిమాలో హైలెట్స్ ఏమిటి ?అసలు ఈ సినిమా కథేంటి? వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

కృష్ణమూర్తి (ఫృద్వీ) ఓ ఐఐటీ స్టూడెంట్. హైదరాబాద్ వచ్చి తన బాబాయ్ కోసం వెతుకుతూంటాడు. పోలీస్ లు ఓ గుర్తు తెలియని శవం చూపెట్టి కేసు క్లోజ్ చేయాలనుకుంటాడు. కానీ కృష్ణమూర్తి ఈ మిస్సింగ్ కేసు,మరణంలో ఏదో కుట్ర కోణం ఉందని అనుమానిస్తాడు. అంతేకాదు అతని అనుమానాలు నిజం చేస్తూ అతనికి వార్నింగ్ లు, ఎటాక్ లు ఎదురౌతాయి. ఈ కేసు మరో పెద్ద కంపెనీ ఫ్రాడ్ కేసుకు లీడ్ చేస్తాడు. అసలు ఈ కేసుకు ఆ కేసుకి లింకేంటి.కృష్ణమూర్తి బాబాయ్ ఏమయ్యారు. అతని మృతికి కారణం ఏమిటి..క్లైమాక్స్ లో కథను మలుపు తిప్పే ట్విస్ట్ ఏమిటి..వంటి విషయాలు తెలియాలంటే ఓపిక చేసుకుని సినిమా చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే ఎనాలసిస్..

టైటిల్ చూడగానే ఇదోదో ఐఐటీ చదివే కుర్రాడు కష్టాలకు సంభందించిన కథ అనుకుంటే మీరు బోల్తాపడినట్లే. అలాగని ఆ కథ కానంతమాత్రాన మీరేమీ సేఫ్ గా ఒడ్డున ఉన్నట్లేమీ కాదు. కృష్ణమూర్తి టైటిల్ తో వచ్చిన ఈ సినిమా ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అని దర్శకుడు ఉవాచ. అయితే క్రైమ్ థ్రిల్లర్ అనుకోవటంలో సందేహం ఏమీ లేదు కానీ…చూసిన తర్వాత థ్రిల్లర్ అంటేనే ఇబ్బందిగా అనిపిస్తుంది. చాలా డల్ గా ..సాధ్యమైనంత బోర్ గా ఈ థ్రిల్లర్ ని తీర్చిదిద్దారు దర్శకుడు. చాలా స్లోగా మొదలయ్యే ఈ సినిమాని అదే ఫేజ్ ని మెయింటైన్ చేసాడు దర్శకుడు టోటల్ గా. ప్రొసీడింగ్స్ ఎక్కువ పర్పస్ తక్కువ అన్నట్లుగా సీన్స్ సాగుతూంటాయి. ఎక్కడా మనని ఇన్వాల్వ్ అయ్యి కథలోకి దూరిపోయి..ఆ మిస్టరీని విడకొట్టాస్తామో అన్నంత భయంగా దర్శకుడు ..మనకు చాలా దూరంగా నడుపుతాడు.

నిజానికి ఇది చాలా సింపుల్ థ్రిల్లర్. తన తప్పిపోయిన బాబాయ్ ని వెతికిపట్టుకునే ప్రాసెస్ లో జరిగే సంఘటనల సమాహారం. ఇందుకోసం నేరేషన్ లోనే జాగ్రత్తలు తీసుకుని నడపాలి.ఇక ఈ సినిమాలో సెంట్రల్ క్యారక్టర్ ఓ పోలీస్ ఆఫీసర్. ఆయన ఐడియా ఏమిటో అసలు ఏ మాత్రం అర్దంకాదు. చాలా లేజీ రైటింగ్…పోనీ హీరోత, హీరోయిన్ రొమాంటిక్ ట్రాక్ చూస్తే అదొక అర్దంలేని విసుగెత్తించే వ్యవహారం. ఏమన్నా కొద్దో గొప్పో ఈ సినిమాని భరించాలి అంటే కేవలం కమిడియన్ సత్య గురించి మాత్రమే. అది కూడా చాలా చిన్న ట్రాక్. కాబట్టి ఎక్కువ ఆశపడక్కర్లేదు. క్రైమ్ థ్రిల్లర్ అంటారు..కానీ ఎక్కడా లాజిక్ అనేది ఉండదు. పోనీ దర్శకుడు మ్యాజిక్ ఉండదు.

కథలో కీలకమైన తప్పిపోయిన వ్యక్తి గురించి గురించి హీరో పోలీస్ లు చుట్టూ తిరుగుతూంటే వాళ్లు అతని బ్యాక్ గ్రౌండ్ గురించి కూడా ఎంక్వైరీ చేయరు. ఏ విధంగా చూసినా ఈ సినిమా ముందుకు వెళ్లటం కష్టమనిపిస్తుంది. చివరి పదిహేను నిముషాలు ప్రీక్లైమాక్స్ మీదే సినిమా మొత్తం ఆధారపడి ఉంటుంది. అయితే ఆ ట్విస్ట్ ఇంతకు ముందు మనం చూసిందే. ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్లకు తగిలిందే. అయితే ఆ ట్విస్ట్ ఘోరంగా ఫెయిలవ్వటానికి కారణం అప్పటిదాకా విపరీతంగా విసిగించి ఉండటమే. దాన్ని చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడి వైఫ‌ల్యం క‌నిపిస్తూనే ఉంటుంది.

టెక్నికల్ గా..

దర్శకుడు కథ,స్క్రిప్టు విషయంలో ఫెయిల్ అయ్యాడనే విషయం ప్రక్కన పెడితే డైరక్టర్ గా ఎగ్జిక్యూషన్ అంత గొప్పగా లేదు. సినిమాలో అసలు ట్విస్ట్ పేల్చినప్పుడు ఆ సౌండ్ రాదు. తుస్సుమంటుంది.  ప్రారంభం నుంచీ దీన్నో ఎంగేజింగ్ థ్రిల్లర్ గా మార్చటంలో దర్శకుడు దారుణంగా ఫెయిలయ్యారు. అసలు కొన్ని సార్లు స్క్రీన్ ప్లే ఎంతలా ఉంటుందంటే..ఓ పది నిముషాలు స్క్రిప్ చేసి ముందుకు వెళ్లినా ఏమీ జరిగినట్లు ఉండదు. కేవలం దర్శకుడు ఫోకస్ మొత్తం పోలీస్ ఆఫీసర్, అతని చెత్త ఇన్విస్టిగేషన్ పైనే పెట్టేరు. అలాగే సినిమాలో ఫన్ కోసం పెట్టిన జోక్స్ కూడా ఇంప్రెస్ చేయవు. బిగతావన్ని బోర్ కొట్టాయి. కాబట్టి ఇవి ఓకే అనిపిస్తాయి.

ఇక పాటలు ఏమీ గొప్పగా లేవు. నీరసంగా ఉన్నాయి. అసలు ఇలాంటి సినిమాకు పాటలు ఉండకపోవటమే మేలు. బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్ బాగుంది. కెమెరా వర్క్, ఎడిటింగ్ ఈ సినిమాని ఆ మాత్రమైనా చూడగలిగేలా చేసాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చిన్న సినిమాకు బాగా ఎక్కువ ఖర్చుపెట్టారనిపించింది.

నటీనటుల్లో హీరోయిన్ మైరా దోషి కేవలం సినిమాలో ఫిల్ ఇన్ ది బ్లాంక్ సీన్స్ లో వచ్చి పోతుంది. మిగతా సమయం పాటల్లో కనిపిస్తుంది. కాబట్టి ఆమె ఉన్నా లేకపోయినా సినిమాకు వచ్చే నష్టం కానీ లాభం కానీ లేదు. అదే డైరక్టర్ కు కూడా అనిపించినట్లుంది. సినిమాలో కొన్ని సీక్వెన్స్ లో ఆమె మాయమైపోతుంది. హీరో పృధ్వీ దండమూడి విషయానికి వస్తే..జస్ట్ ఓకే. వినయ్ వర్మ ఈ సినిమాకు రియల్ హీరో అని చెప్పాలి.

చూడచ్చా

చూడకపోయినా నష్టమేమీలేదు.మిస్సైన ఫీలింగ్ ఏమీ ఉండదు.

ఎవరెవరు..

బ్యానర్లు: క్రిస్టోలైట్‌ మీడియా క్రియేషన్స్‌, అక్కి ఆర్ట్స్‌
నటీనటులు: పృధ్వీ దండమూడి, మైరా దోషి, సత్య, వినరు వర్మ, బెనర్జీ తదితరలు
సంగీతం: నరేశ్‌ కుమారన్‌
కెమెరా: ఏసు,
ఎడిటింగ్‌ :  అనిల్‌ కుమార్‌.పి,
సంగీతం: నరేశ్‌ కుమారన్‌,
సహనిర్మాత :  అక్కి,
స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం:  శ్రీవర్ధన్‌.
సమర్పణ : మ్యాంగో మాస్‌ మీడియా
రన్ టైమ్:110 నిముషాలు
విడుదల తేదీ:10,డిసెంబర్ 2020
విడుదల:-ఓ టీ టీ – అమెజాన్ ప్రైమ్