ఒక వెబ్ సిరీస్‌ను విడుదల చేస్తున్న ఆహా
రెండు బ్లాక్‌బస్టర్ మూవీస్, ఒక వెబ్ సిరీస్‌ను విడుదల చేస్తున్న ఆహా
సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో వందశాతం తెలుగు వారికి సొంతమైన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా. ఇప్పటికే తెలుగు వారికి ఎంతో చేరువైన ఈ ఓటీటీ రీసెంట్‌గా ఓ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. దుల్కర్ సల్మాన్, రీతూవర్మ నటించిన కనులు కనులను దోచాయంటే సినిమాను విడుదల చేసిన వారం రోజులకే 10 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌ను క్రాస్ చేసింది.
ఫిబ్రవరిలో ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి అత్యధికంగా వీక్షకులను ఆకట్టుకుంటూ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది. కొత్త కంటెంట్ కోసం మరింత డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలో మూడు బ్లాక్‌బస్టర్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది ఆహా.
నేచురల్‌స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం చిత్రాన్ని మే 8న విడుదల చేసారు. శ్రీవిష్ణు, నివేదా పేతురాజ్ జంటగా నటించిన మెంటల్ మదిలో సినిమాను మే 15న విడుదల చేస్తున్నారు. అలాగే మర్డర్ మిస్టరీ కంటెంట్‌తో రూపొందిన ఆహా ఒరిజినల్ రన్‌ను మే 22న ప్రసారం చేస్తున్నారు. నవదీప్, పూజితా పొన్నడ నటించిన ఈ వెబ్ సిరీస్‌ను ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఆహా ఓటీటీలో బ్లాక్‌బస్టర్ చిత్రాలు, క్లాసిక్ చిత్రాలు, వెబ్ సిరీస్‌ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు ఆహా మరింత దగ్గరవుతుంది.