ఒరేయ్ బుజ్జిగా చిత్రం ట్రైలర్ విడుదల
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య రిలీజ్ చేసిన రాజ్ తరుణ్ `ఒరేయ్ బుజ్జిగా..` ట్రైలర్.
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా…`. రొమ్‌కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్న ఆహా ఓటీటీలో విడుదలవుతుంది. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ స్వర పరిచిన అన్ని పాటలు సంగీతాభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ మూవీ ట్రైలర్‌ను ఈ రోజు(సెప్టెంబర్ 28) యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ `ఒరేయ్ బుజ్జిగా ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. విజయ్ కుమార్ గారికి అలాగే రాజ్‌తరుణ్, మాళవికా నాయర్, హెబాపటేల్ సహా ఎంటైర్ టీమ్ కి ఆల్ ది బెస్ట్. అక్టోబర్ 2న అందరూ ఆహాలో సినిమా చూడండి“ అన్నారు.
దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ చూస్తుంటే ఇదో ఫన్ రైడ్ అని అర్థమైపోతుంది. రాజ్ తరుణ్, మాళవికల ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ హెభాపటేల్ అందం, సప్తగిరి, నరేష్, మధునందన్, సత్య, పోసానిల హిలేరియస్ కామెడీతో ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగింది. చాలా రోజుల తరవాత వాణీ విశ్వనాథ్ ఒక పవర్ఫుల్ పాత్రలో మళ్లీ తెరపై కనిపిస్తోంది. అమ్మాయి పేరు కృష్ణవేణి..ఇంటిపేరు వీరమాచినేని,`మీ అమ్మాయిలకు రిలేషన్షిప్లో ఉన్నంత సేపు బాయ్ ఫ్రెండ్ లక్స్ సోప్లాంటి వాడు ఒల్లంతా రాసేసుకుంటారు. బ్రేక్అప్ అయిపోయిన తర్వాత డెటాల్ సోప్లాంటోడని చేతులు మాత్రమే కడుక్కుంటారు`వంటి డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. ఐ.ఆండ్రూ విజువల్స్, అనూప్ రూబెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ చూస్తుంటే నవ్విస్తూనే మనసుల్ని కదిలించే భావోద్వేగాలు సినిమాలో ఉన్నాయని తెలుస్తుంది.
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, డాన్స్: శేఖర్, ఆర్ట్: టి.రాజ్‌కుమార్, ఫైట్స్: రియల్ సతీష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్, నిర్మాత: కె.కె.రాధామోహన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్