వినడానికి ఓ పిట్టకథగా అనిపించినా ఇది చాలా పెద్దకథే అని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సూత్రీకరించారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రానికి ‘ఓ పిట్టకథ’ అనే టైటిల్ పెట్టిన
విషయం తెలిసిందే. చెందు ముద్దు దర్శకత్వంలో వి.ఆనందప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌ని ఇటీవలే మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ విడుదల చేశారు. ఈ సినిమా క్యారెక్టర్స్ పోస్టర్‌ను బుధవారం హైదరాబాద్ లో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించారు .
అనంతరం కొరటాల శివ మాట్లాడుతూ.. ”అద్భుతమైన టైటిల్ ఇది. మొన్నటికిమొన్న పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు క్యారెక్టర్స్‌కు సంబంధించిన విషయాలు అందులో చూపించా రు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఈమధ్య పిట్టకథ గురించే చర్చజరుగుతుంది. ఇది పిట్టకథే కానీ చాలా పెద్ద కథ అని నమ్ముతున్నాను. అప్పట్లో పెద్దవంశీగారి సినిమాలు ఇలా చూసేవాళ్ళం. పోస్ట్‌ర్స్‌గానీ, టీజర్స్‌కానీ చూసి అంత ఫీలయ్యేవాళ్ళం. దర్శకుడు చందు అద్భుతంగా తీశాడనిపిస్తుంది. ప్రతి విజువల్ ముద్దుగా వున్నాయి.
ఖచ్చితంగా ‘ఓ పిట్టకథ’ ఈ సమ్మర్‌లో ప్రేక్షకులకు గ్రేట్ రిలీఫ్ ఇస్తుంది. కూల్ సినిమాగా నిలుస్తుందని నమ్ముతున్నాను. ఎంటైర్ టీమ్‌కు ఆల్‌ది బెస్ట్” అని తెలిపారు.
నిర్మాత వి.ఆనందప్రసాద్ మాట్లాడుతూ .. ” చెందు ముద్దు చెప్పిన ‘ఓ పిట్ట కథ’ చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించి,
వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్లాం. సినిమా చాలా బాగా వచ్చింది” అని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి మాట్లాడుతూ.. ”ఓ వైపు కామెడీ, మరోవైపు థ్రిల్లింగ్‌అంశాలతో, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా
కచ్చితంగా ఆకట్టుకుంటుంది . చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం‘ అని చెప్పారు.
దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ.. ”ఒక విలేజ్‌లో జరిగే స్టోరీ ఇది. ప్రతి సన్నివేశం స్వచ్ఛంగా సాగుతుంది. ఓ వైపు కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. మరోవైపు ఏంజరుగుతోందనే ఉత్కంఠను రేకెత్తిస్తుంది . పతాక సన్నివేశాల వరకూ ఆ థ్రిల్లింగ్ అలాగే సస్టైన్ అవుతుంది. ట్విస్టులు మరింత థ్రిల్ కలిగిస్తుంటాయి. స్క్రీన్ ప్లే ప్రధానంగా తెరకెక్కించాం” అని అన్నారు.
నటీనటులు:
విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు
సాంకేతిక నిపుణులు:
పాటలు: శ్రీజో , ఆర్ట్ష్ట్: వివేక్ అన్నామలై, ఎడిటర్: డి.వెంకటప్రభు, కెమెరా: సునీల్ కుమార్ యన్., సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అన్నే రవి, నిర్మాత: వి.ఆనంద ప్రసాద్. కథ, స్క్రీన్‌ప్లే , మాటలు, దర్శకత్వం : చెందుముద్దు.