ఓ మంచి ఘోస్ట్ మూవీ లిరికల్ సాంగ్ విడుదల
2 మిలియన్ల వ్యూస్ చేరువలో సోషల్ మీడియాను ఊపేస్తున్న ఓ మంచి ఘోస్ట్ చిత్రం నుంచి పైసా రే పైసా సాంగ్.
ప్రపంచాన్ని నడిపిస్తుంది రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు కాదు డబ్బు. ప్రపంచాన్ని శాసిస్తున్నది అక్షరాల డబ్బు మాత్రమే అనే కాన్సెప్ట్ తో ఓ మంచి ఘోస్ట్(OMG) చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగల్ నెట్టిట్లో రచ్చ చేస్తుంది. త్వరలో మనముందుకు రాబోతున్న ఓ మంచి ఘోస్ట్ సినిమాలో ప్రస్తుతం డబ్బు ప్రాముఖ్యతపై అద్భుతమైన, అంతే చమత్కారమైన పాటను రాసి పాడారు ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. అనూప్ రూబెన్స్ తో పాటు శ్రీనివాస్ చింతల ఈ పాటకు రచయితలుగా పనిచేశారు. మంచి బీట్ తో ఉన్న ఈ సాంగ్ కు డాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ కొరియోగ్రాఫీ పై ఈ పాట డబ్బు మన జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో చెబుతుంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.
డబ్బు చుట్టు లోకం తిరుగుతుంది నీతో పట్టి చాకిరి చేస్తుంది రౌండు రౌండ్ గోల్ తిప్పుతుంది నిన్ను మత్తులో ముంచేస్తుంది అంటూ సాగే ఓ మంచి ఘోస్ట్ సినిమా నుంచి పైసా రే పైసా రే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ శనివారం విడుదల చేసారు.
ఓ మంచి ఘోస్ట్ (OMG) శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ చిత్రం. ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సంగీతం అందించడంతో పాటు పాటకు సాహిత్యం కూడా అందించారు. మార్క్ సెట్ నెట్వర్క్స్ బ్యానర్‌పై డా. అభినికా ఐనాభాతుని ఈ చిత్రానికి నిర్మతగా వ్యవహరిస్తున్నారు.
హారర్ కామెడీగా తెరకెక్కుతున్న OMG ఓ మంచి ఘోస్ట్ చిత్రం నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తుండగా తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాలో ఉపేస్తూ శ్రోతల్ని ఉర్రుతలుగిస్తుంది. ఈ చిత్ర ప్రారంభం నుంచి చివరి వరకు ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ఈ కథలో కామెడీతో పాటు ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెట్టే హారర్ సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు.
ఈ చిత్రంలో హాస్యనటుడు వెన్నెల కిషోర్, షకలక శంకర్, నందితా శ్వేత, నవమి గాయక్, నవీన్ నేని, హాస్యనటుడు రఘుతో పాటు పలువురు ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నటీనటులు :
వెన్నెల కిషోర్, శకలక శంకర్, రజిత్ రాఘవ్, రఘు బాబుల, నాగినీడు, బాహుబలి ప్రభాకర్, షేకింగ్ శేషు.
సాంకేతికవర్గం :
దర్శకుడు: శంకర్ మార్తాండ్
నిర్మాత: డా.అబినిక ఐనాభాతుని
బ్యానర్: మార్క్ సెట్ నెట్ వర్క్స్
సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రాఫర్: ఐ ఆండ్రూ
ఎడిటర్: ఎమ్ ఆర్ వర్మ