ఓ మై డాగ్ మూవీ రివ్యూ

Published On: April 22, 2022   |   Posted By:

ఓ మై డాగ్ మూవీ రివ్యూ

సూర్య ప్రొడక్షన్ ‘ఓ మై డాగ్’ రివ్యూ

Emotional Engagement Emoji (EEE)

👍

తమిళ స్టార్ హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక నిర్మించిన సినిమా అనగానే ఓ క్రేజ్ ఏర్పడిందీ ఈ సినిమాకు. థియోటర్ లో విడుదల అవుతుందనుకున్న ఈ చిన్నపిల్లల చిత్రం ఓటిటి లో రిలీజ్ అయ్యింది. సూర్య వరస సినిమాలు ఓటీటిలో రిలీజై మంచి విజయం సాధించటంతో ఈ సినిమాపై జనం దృష్టి పడింది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు విజయ్ కుమార్ , ఆయన కుమారుడు – తెలుగులో ‘బ్రూస్ లీ’, ‘సాహో ‘ చిత్రాల్లో నటించిన అరుణ్ విజయ్ , మనవడు అర్ణవ్ విజయ్ నటించారు. టైటిల్ చూస్తేనే కుక్క చుట్టూనే తిరిగే కథ అని అర్దమవుతోంది. అసలు ఈ సినిమా విషయం ఏమిటి…సూర్య నిర్మించేలా ప్రేరణ కలిగించిన కథేంటి.. చూడదగ్గ సినిమాయేనా? వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Storyline:

బిజినెస్ మ్యాన్ ఫెర్నాండో (వినయ్ రాయ్)కు చెందిన కుక్కలు వరుసగా ఆరు సార్లు ఇంటర్నేషనల్ ఎజిలిటీ ఛాంపియ‌న్‌షిప్‌ ఫర్ డాగ్స్ టైటిల్ ని గెలుస్తాయి. ఏడోసారి టైటిల్ అందుకుని, వరల్డ్ రికార్డు సృష్టించాలనుకున్న ఫెర్నాండో కల కలగా మిగలుతుంది. అందుకు కారణం చూపులేని ఓ కుక్క. దాన్ని చంపేయమని తన అనుచరులుకు చెప్తాడు. అయితే ఆ కుక్క తప్పించుకు పారిపోయింది. ఆ కుక్కని ఓ పిల్లాడు సేవ్ చేసాడు. ఆ పిల్లాడే అర్జున్ (‘మాస్టర్’ అర్ణవ్ విజయ్) . తన తాత (విజయ్ కుమార్) కు, తన తండ్రి (అరుణ్ విజయ్ ) కు ఇష్టం లేకపోయినా దాన్ని తనతోనే ఉంచుకుని దానికి సింబా అని పేరు పెట్టి సాకుతాడు. ఆ క్రమంలో ఆ సింబా, అర్జున్ ప్రెండ్స్ అవుతాడు. అక్కడ నుంచి సింబా గతం గురించి తెలుసుకున్న అర్జున్..దానికి పట్టుదలతో ట్రైనింగ్ ఇచ్చి డాగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు తీసుకెళ్తాడు. దాన్ని గెలిపించే ప్రాసెస్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అయినా సింబాని విజేతగా నిలిపి, దాన్ని గెంటేసిన అసలు యజమాని ఫెర్నాండో కు బుద్ది చెప్తాడు అనే విషయం చుట్టు కథ తిరుగుతుంది.

Screenplay Analysis:

ఇక ఈ చిత్రం కథ గొప్పగా ,కొత్తగా ఏమీ ఉండదు. చాలా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. అందులోనూ ఇలాంటి సినిమాలు చూసేవారికి ఇది రొటీన్ ప్లాటే. ఈ సినిమా చూస్తూంటే ఖచ్చితంగా మనకు 101 Dalmatians గుర్తు వస్తుంది. అలాగే Fernando పాత్ర Cruella De Vil నుంచి తీసుకున్నది అని అర్దమవుతుంది. అలాగే డైరక్టర్ మన దేశపు లోకల్ కుక్కలను తీసుకుని కథ నడిపి ఉంటే మనకు నేటివిటి టచ్ వచ్చేది. అలా చేయలేదు.

ఇక సాధారణంగా… పిల్లలు మరియు/లేదా జంతువుల గురించిన సినిమా అంటే లైవ్-యాక్షన్ కంటే యానిమేషన్‌లో మంచి అవుట్ ఫుట్ వస్తుంది. పిల్లలు , జంతువులకి శిక్షణ ఉన్నప్పటికీ, నిజ జీవితంలో వాళ్లని నియంత్రించడం కష్టం. కథని చెప్పే విధానం లైవ్-యాక్షన్‌ని ఎంచుకున్నప్పుడు స్క్రిప్ట్‌లో ఉన్న క్లిష్టమైన భావోద్వేగాలను వారికి తెలియజేయడం ఛాలెంజే. అదే యానిమేటెడ్ ఫిల్మ్‌లో లేదా కనీసం పాక్షికంగా యానిమేటెడ్ ఫిల్మ్‌లో, మీరు ఈ ఎమోషన్స్ తో రూపొందించవచ్చు . అయితే అక్కడా ఓ కండీషన్ . మంచి యానిమేషన్ మరియు VFX టీమ్ తోడైతేనే. అప్పుడే ఓ కొత్త ప్రపంచం సృష్టించడానికి నిర్మాతలకు అవకాసం దొరుకుంది. అప్పుడే యాభై ఏళ్ల వయస్సు గల వారు కూడా ఐదేళ్ల వయస్సులో ఉన్నంత ఉత్సాహంతో ది జంగిల్ బుక్‌ని ఆస్వాదించగలరు.

ఈ థీరికి మినహాయింపులను నిరూపించే కొన్ని పూర్తి లైవ్-యాక్షన్ చిత్రాలు ఉన్నాయి. Lasse Hallström’s Hachi: A Dog’s Tale వంటివి మినహాయింపు . అలాంటి ప్రయత్నమే…, దర్శకుడు సరోవ్ షణ్ముగం తన మొదటి చిత్రం, ఓహ్ మై డాగ్‌తో చేయడానికి ప్రయత్నించాడు, కానీ స్క్రిప్ట్ మరియు స్క్రీన్‌లో, అద్బుతాలు ఏమీ కనపడవు. చాలా నార్మల్ గా ఉంటాయి. ముఖ్యంగా స్క్రిప్టు చాలా ఫ్లాట్‌గా ఉండటంతో పెద్ద ఉత్సాహంగా ఈ పిల్లల సినిమా అనిపించలేదు. ఓహ్ మై డాగ్ సినిమా ప్రారంభం నుండి, కథ ఎలా ఉండబోతుందో ఊహించేయవచ్చు.

కుక్క గొడవ ప్రక్కన పెడితే…పిల్లాడు-కుక్క ప్రెండ్షిప్ ని మించిన ఎమోషన్ ఏమిటంటే, అర్నవ్ తాతగా నటించిన విజయకుమార్‌లతో కూడిన సబ్‌ప్లాట్. విజయకుమార్ కాస్త కోపంతో ఉండే పదవీ విరమణ చేసిన వ్యక్తి, హౌస్ లోన్ తిరిగి చెల్లించకపోవడంతో కొడుకుపై అసంతృప్తితో ఉన్నాడు. ఇంతలో, అరుణ్, తన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, తన కొడుకు ఆనందం కోసం అతను చేయగలిగినదంతా చేస్తాడు. ఈ ప్రేమ విజయకుమార్‌ను మెల్లగా మారుస్తుంది. అదే మనని కనెక్ట్ చేస్తుంది.

Analysis of its technical content

ఈ సినిమా టెక్నికల్ యాస్పెక్ట్స్ లో చూస్తే జస్ట్ ఓకే అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి కానీ డైరక్షన్,స్క్రిప్టు సోసోగా ఉన్నాయి. రీరికార్డింగ్ బాగుంది. కెమెరా వర్క్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.

నటీనటుల్లో …విజయ్ కుమార్, అరుజ్ విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. పిల్లాడు అర్ణవ్ విజయ్ మాత్రం బాగా చేసారు. వినయ్ రాయ్ గెటప్ వింతగా ఉంటుంది. నటన పర్వాలేదు. విజయ్ కుమార్, భానుచందర్, మనోబాల ఆయా సీన్స్ కు అనుగుణంగా నటించారు. పిల్లలందరూ ఆకట్టుకుంటారు.

CONCLUSION:

పిల్లల సినిమా ఇది. పిల్లలే బాగా ఎంజాయ్ చేయగలుగుతారు.

Movie Cast & Crew
నటీనటులు: విజయ్ కుమార్, అరుణ్ విజయ్, ‘మాస్టర్’ అర్ణవ్ విజయ్, వినయ్ రాయ్, మహిమా నంబియార్, భానుచందర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: గోపీనాథ్
సంగీతం: నివాస్ కె. ప్రసన్న
నిర్మాతలు: సూర్య, జ్యోతిక
దర్శకత్వం: సరోవ్ షణ్ముగం
విడుదల తేదీ: ఏప్రిల్ 21, 2022
RunTime:2 hours 7 minutes
ఓటిటి : అమెజాన్ ప్రైమ్ వీడియో