Reading Time: 2 mins

కళాకారుడు చిత్రం మీడియా సమావేశం

శ్రీస్ విజువల్స్ పతాకం పై శ్రీధర్ మరియు దుర్గ హీరో హీరోయిన్ గా పోసాని కృష్ణ మురళి, తోటపల్లి మధు , రవి వర్మ, జబర్దస్త్ జీవన్ ముఖ్య తారాగణం తో కిరణ్ దుస్సా దర్శకత్వం లో శ్రీధర్ శ్రీమంతుల నిర్మించిన చిత్రం “కళాకారుడు”. అని కార్యక్రమాలు పూర్తిచేసుకుని 2020 లో జనవరి 3వ తారీఖున విడుదలవుతుంది . ఈ సందర్భం గా నిర్మాత  మరియు హీరో శ్రీధర్ శ్రీమంతుల తో మీడియా మిత్రులు ముచ్చటించారు.

భీమవరంలో పుట్టి పెరిగి సినిమాల మీద మక్కువతో మంచి సినిమాలు నిర్మాంచాలి అని శ్రీస్ విజువల్స్ అనే బ్యానర్ పెట్టి తానే నిర్మాతగా హీరో గా మంచి కథ కథనం తో శ్రీధర్ శ్రీమంతుల “కళాకారుడు” చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఒక మంచి  కుటుంబ కథ చిత్రం. మంచి కామెడీ సన్నివేశాలతో అందమైన పాటలతో మాస్ ప్రేక్షకుడిని అలరించే యాక్షన్ ఫైట్స్ తో నూతన సంవత్సరం 2020 లో జనవరి 3 వ తారీఖున విడులవుతుంది అని తెలియజేసారు

సినిమా కథ గురించి మాట్లాడుతూ ” ఒక మధ్యతరగతి అబ్బాయి అతి తక్కువ సమయం కోటీశ్వరుడు అవ్వాలని మంచి డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిల్ అవుతుంది అని కోరుకుంటాడు. తన కోరిక తన జీవితాన్ని  ఎలాంటి మలుపులు తిప్పుతుంది అనేదే ఈ సినిమా. మంచి ఎంటర్టైన్మెంట్ తో అందమైన లొకేషన్స్ లో సినిమా ని చిత్రీకరించాం. క్లీన్ ఎంటెర్టైన్మ్నెట్ సినిమా. కుటుంబం అందరు కలిసి చూడదగ్గ సినిమా.

సినిమా షూటింగ్ లొకేషన్స్ గురించి వివరిస్తూ “హైదరాబాద్, భీమవరం, పాలకొల్లు లో చిత్రరించాము. ఒక మెలోడీ పాటకోసం గోవా వెళ్ళాము. సినిమాలో నాలుగు ఫైట్స్ మరియు ఆరు పాటలు ఉన్నాయ్. పాటలకి యూట్యూబ్ లో మంచి స్పందన వచ్చింది. పాటలు చాలా బాగుంటాయి. కె విశ్వనాధ్ గారు  అంటే నాకు చాలా అభిమానం, వారిలాగా సినిమా డైరెక్టర్ అవాలని నా కోరిక. చిన ప్రయత్నం గా ఈ సినిమా చేసాము.   అని బాగుంటే  మరిన్ని మంచి సినిమాలు చేస్తాను.  మా సినిమా లో పాటలు హైలైట్స్, రఘు రామ్ గారు మా సినిమా కి మంచి సంగీతం అందించారు. ఆరు పాటలు బాగుంటాయి.

హీరోయిన్ గురించి మాట్లాడుతూ “మా సినిమా లో ఇంతకూ ముందు చాలా సినిమాలో సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన దుర్గ మా సినిమా తో హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాము. చాలా మంచి గా నటించింది. సినిమా లో మంచి కామెడీ ఉంటుంది. ఫామిలీ అందరు కలిసి చూడాలి  మా సినిమా  అని అసభ్యసన్నివేశాలు లేకుండా చేసాము.  నూతన సంవత్సరం 2020 లో జనవరి 3 వ తారీఖున విడులవుతుంది అని  తెలియజేశారు.

బ్యానర్ : శ్రీస్ విజువల్స్
నిర్మాత : శ్రీధర్ శ్రీమంతుల
నటి నటులు : శ్రీధర్, దుర్గ, పోసాని కృష్ణ మురళి, తోటపల్లి మధు, రవి వర్మ, బాషా, జబర్దస్త్ జీవన్ తదితరులు
సంగీతం : రఘు రామ్
కెమెరా మాన్ : రవి చేపూర్
కళ దర్శకుడు : నానాజీ
కథ, స్క్రీన్ ప్లే : శ్రీధర్
మాటలు, దర్శకత్వం : కిరణ్ దుస్సా