Reading Time: 2 mins

కింగ్‌ ఆఫ్‌ కోత మూవీ ట్రైలర్ విడుదల

దుల్కర్ సల్మాన్, జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్‌ పాన్ ఇండియా మాస్ ఎంటర్‌టైనర్‌ కింగ్‌ ఆఫ్‌ కోత ట్రైలర్ విడుదల

దుల్కర్‌ సల్మాన్ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా మాస్ ఎంటర్‌టైనర్ కింగ్‌ ఆఫ్‌ కోత. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభిలాష్ జోషి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కింగ్‌ ఆఫ్‌ కోత ట్రైలర్‌ను ఇండియన్ సినిమా దిగ్గజ నటులు షారుఖ్ ఖాన్, మోహన్‌లాల్, నాగార్జున, సూర్య విడుదల చేశారు.

యాక్షన్-థ్రిల్లర్ జోనర్ ని రిడిఫైన్ చేస్తూ, దుల్కర్ సల్మాన్ ఇంటెన్స్ యాక్షన్ తో, కోత వరల్డ్ ని ఎక్సయిటింగా పరిచయం చేసి, ఆధిపత్యం, అధికారం కోసం పెట్టె పరుగుని గ్రిప్పింగ్ గా ప్రజంట్ చేసింది ట్రైలర్. ట్రైలర్ లో అద్భుతమైన విజువల్స్, హార్ట్-స్టాపింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులని కట్టిపడేశాయి. ఏళ్ల తర్వాత తిరిగివచ్చిన సొంత యజమానిని చూసిన కుక్క లాంటింది ఈ కోత. ముందు అరుస్తుంది. తర్వాత తోక ఊపుకుంటూ వస్తుంది. తర్వాత కాళ్ళ దగ్గరే పడివుంటుంది అని దుల్కర్ చెప్పిన డైలాగ్స్ కథలోని ఇంటెన్సిటీ ని సూచిస్తోంది.

ఈ ప్రాజెక్ట్ గురించి స్టార్ దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ కింగ్ ఆఫ్ కొత ఒక అసాధారణ ప్రయాణం. గొప్ప పాత్రలు, క్లిష్టమైన కథ, భారీ నిర్మాణ విలువలతో రూపొందించాం. మొదటసారి జీ స్టూడియోస్‌తో కలిసి పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది. ఇది వేఫేరర్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్, నాకు సంతోషకరమైన ప్రయాణం-నా ప్రేక్షకులకు పర్ఫెక్ట్ ఓనమ్ ట్రీట్. అన్నారు.

జీ స్టూడియోస్ సౌత్ హెడ్ అక్షయ్ కేజ్రీవాల్ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఈ ఓనమ్‌కి ప్రపంచవ్యాప్తంగా కింగ్ ఆఫ్ కొతని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ఆకట్టుకునే కథనం, భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇది మరపురాని ప్రయాణం. వేఫేరర్ ఫిల్మ్‌ తో కలసి పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది అన్నారు.

ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి, షబీర్ కల్లరక్కల్, ప్రసన్న, నైలా ఉష, గోకుల్ సురేష్ కీలక పాత్రలు పోషించారు. కింగ్ ఆఫ్ కొత అద్భుతమైన కంటెంట్‌కు ప్రసిద్ధి పొందిన రెండు పవర్ హౌసస్ జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ ని మరింతగా పెంచింది. ఈ చిత్రం ఓనం కానుకగా 24 ఆగస్టు, 2023న విడుదల కానుంది.