కుబేర చిత్రం ఫస్ట్ లుక్ విడుదల
ధనుష్, ‘కింగ్’ నాగార్జున, శేఖర్ కమ్ముల, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ #DNS టైటిల్ ‘కుబేర’- ఫస్ట్ లుక్ విడుదల
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #DNS ను భారతీయ సినిమాలోని ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్- నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్, కింగ్ నాగార్జున అక్కినేనితో రూపొందిస్తున్నారు. శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఆసియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
మహా శివరాత్రి శుభ సందర్భంగా, మేకర్స్ సినిమా టైటిల్‌ను రివిల్ చేశారు, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అత్యంత సంపన్నుడైన దేవుడు పేరు ‘కుబేర’ అనే టైటిల్‌ను ఈ చిత్రానికి పెట్టారు. అయితే ధనుష్ లుక్ టైటిల్‌కి భిన్నంగా ఉంది. బ్యాక్ డ్రాప్ శివుడు అన్నపూర్ణ దేవి నుంచి భిక్ష తీసుకుంటున్నట్లు చూపిస్తుంది, ధనుష్ ఇమేజ్ ముందు నిలబడి, మెస్సి అవతారంలో, చిరిగిన బట్టలతో కనిపిస్తున్నారు.
టైటిల్‌కు భిన్నంగా ధనుష్ పాత్రను ప్రజెంట్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో శేఖర్ కమ్ముల ఆసక్తిని కలిగించారు. దీంతో సినిమా ధనుష్ ఎలాంటి పాత్రలో నటిస్తున్నారో అనే క్యురియాసిటీ పెరిగింది. నాగార్జున పాత్ర గురించి తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో నాగార్జున పాత్రకు సంబంధించిన అప్‌డేట్ కోసం మరికొంత కాలం ఆగాల్సిందే.
ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. నేషనల్ అవార్డ్ విన్నర్, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. రామకృష్ణ సబ్బని, మోనికా నిగోత్రే ప్రొడక్షన్ డిజైనర్లు.
భారీ అంచనాలున్న ఈ చిత్రం లార్జ్ కాన్వాస్‌పై లావిష్ ప్రొడక్షన్, సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోంది.
తారాగణం: ధనుష్, నాగార్జున అక్కినేని, రష్మిక మందన, జిమ్ సర్భ్ తదితరులు
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
సమర్పణ: సోనాలి నారంగ్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాతలు: సునీల్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: నికేత్ బొమ్మి
ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ సబ్బని, మోనికా నిగోత్రే
సహ రచయిత: చైతన్య పింగళి