కృతి శెట్టి పాత్రికేయుల సమావేశం
పండుగ కోసమే తీసిన సినిమా బంగార్రాజు – కృతి శెట్టి
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం `బంగార్రాజు`. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. కళ్యాణ్ కృష్ణ దర్శకుడు.
ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో విడుదలకానుంది.
ఈ సందర్భంగా నాయిక కృతిశెట్టి చిత్రంగురించి పలు విషయాలను ఇలా తెలియజేస్తున్నారు.
– బంగార్రాజు కథ విన్నప్పుడే ఇలాంటివారు కూడా వుంటారా. ఇంత కాన్‌ఫిడెంట్‌గా మనుషులు వుంటారా! అనిపించింది. అందుకే నా కేరెక్టర్ వినగానే నవ్వేశాను. దాన్ని వెండితెరపై చూసి ప్రేక్షకులు అదే ఫీలవుతారని అనుకుంటున్నా. కనుకనే నేను ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నా.
– నా పాత్ర ఫన్ పటాకాలా వుంటుంది. ఓ గ్రామ సర్పంచ్‌గా చేశాను. సర్పంచ్ అంటే స్పీచ్‌లు ఇవ్వాలి. నాకు అది కొత్తగా అనిపించింది. సహజంగా డైలాగ్ పేపర్ ఇవ్వగానే నాకు కొంచెం అర్థం అవుతుంది. కానీ ఇందులోని డైలాగ్స్‌లో ఇప్పటి వరకు వినని చాలా కొత్త పదాలు తెలుసుకున్నా.
– నాగార్జున సార్‌తో సినిమా అన్నప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనిపించింది. కానీ ఆయన్ను కలిశాక ఆయన తోటి నటులపై చూపించిన గౌరవం, హుందాతనం చూసి ఆశ్చర్యపోయాను. నేను జూనియర్ అని కాకుండా టీమ్‌మేట్‌లా చూశారు.
– నేను చదివింది సైకాలజీ. అది సినిమారంగానికి బాగా ఉపయోగపడింది. తెలీని చాలామందిని పరిశీలించడం వల్ల జీవితం గురించి చాలా తెలుస్తుంది.
– ఉప్పెన విజయం ప్రేక్షకులదే. వారు ఆ సినిమా తర్వాత నామీద చూపిన ప్రేమతో నాపై బాధ్యత పెరిగేలా చేసింది. బేబమ్మగా ఆదరించారు.
– నేను తెలుగు షూటింగ్‌లోనే నేర్చుకున్నా. ఉప్పెన టైంలోనే కొద్దిగా తెలుసు. ఆ తర్వాత తెలుగు సినిమాలు చూడడం రెగ్యులర్‌గా నా టీమ్‌తో తెలుగులోనే మాట్లాడడం జరిగింది. చాలామంది తెలుగులో డబ్బింగ్ చెప్పమన్నారు. కానీ నాకింతా పూర్తి కాన్‌ఫిడెంంట్ రాలేదు. ఎందుకంటే నా గొంతు నాకు అంతగా నచ్చదు. ముందుముందు అందరికీ నచ్చితే తప్పకుండా డబ్బింగ్ చెబుతాను.
– సోగ్గాడే చిన్ని నాయనా సినిమాను 2020లోనే చూశాను. అందుకే బంగార్రాజు సినిమా చేసేటప్పుడు ఒత్తిడి అనిపించలేదు. ఆ సినిమాలో కామెడీ టైమింగ్ నాకు బాగా నచ్చింది. నాకు తెలుగు రాకపోయినా సినిమాకు కనెక్ట్ అయ్యాను. అందులో నాగ్ సార్‌తోపాటు ఇతర పాత్రలు బాగా ఎంజాయ్ చేశాను.
– నేను సైకాలజీ స్టూడెంట్ గా అందరినీ గమనిస్తుంటాను. నాగార్జున సార్ లో కొన్ని గమనించాను. షాట్ లేనప్పుడు చాలా క్లాసీగా మాట్లాడతారు. షాట్ రెడీ అనగానే వెంటనే పాత్రలో లీనమైపోయి భాషలోని మాండలికాన్ని కరెక్ట్‌గా మాట్టాడడం, ఆయన పంచెకట్లు, పాత్రపరంగా పొగరుగా వుండడం అనేవి వెంటనే చూపించేస్తారు. అది చాలా గ్రేట్.
– నేను ఉప్పెన టైంలోనే గ్రామీణ సంప్రదాయాలు తెలుసుకున్నాను. బంగార్రాజులో ఇంకాస్త ఎక్కువ నేర్చుకునే అవకాశం కలిగింది.
– నేను చదివిన సైకాలజీ నా జీవితానికీ, నటనకు బాగా ఉపయోగపడింది. కొన్ని మేనరిజాలు గమనిస్తూ వాటిని అప్లయి చేస్తుంటాను.
– బంగార్రాజులో ఫోక్ సాంగ్ చేశాను. చాలా ప్రత్యేకంగా వుంటుంది. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఈ సాంగ్ చేసేటప్పుడు కాస్త ఒత్తిడి అనిపించినా ప్రేక్షకుల కోసం బాగా చేయాలి అనే ఫీల్‌తో ఎంజాయ్ చేసి చేశాను.
– సంక్రాంతి గురించి నాగ్ సార్ కూడా ఓ సందర్భంలో అన్నారు. బంగార్రాజు చక్కటి కథ. పండుగకు తీసిన సినిమా. మా తెలుగు ప్రేక్షకులకు పండుగలాంటి సినిమాలు అంటే ఇష్టం. అందుకే సంక్రాంతి పెద్ద పండుగ కాబట్టి నాగార్జున సార్ చెప్పాక నేను పాత్ర బాగా చేయడానికి ఉపయోగపడింది.
– శ్యామ్ సింగరాయ్‌లో కొద్దిసేపే కనిపించాను. ఆ పాత్ర నిడివి అంతే. కానీ బంగార్రాజులో నా పాత్రకు చాలా ప్రాధాన్యత వుంది. కథ చెప్పినప్పుడే చిన్న బంగార్రాజు, పెద్ద బంగార్రాజు, సత్యభామ, నాగలక్ష్మీ అనే నాలుగు పాత్రలు సినిమాకు నాలుగు స్తంభాలాంటివని దర్శకుడు చెప్పారు.
– రమ్యకృష్ణగారితో కాంబినేషన్ పెద్దగా లేదు. కానీ ఆమె నుంచి చాలా నేర్చుకున్నాను. మేము కలిసినప్పుడు చాలా విషయాలు చెప్పారు. తెరముందు వెనుక మనల్ని మనం బేలన్స్ చేసుకోయాలి. ఏదైనా ఏడుపు సీన్ చేస్తే దాన్ని అలాగే ఇంటికి తీసుకువెళ్లకూడదు. ఇక్కడే మర్చిపోవాలి.
– నేను గ్లిజరిన్ లేకుండా ఏడుపు సీన్స్ చేసేస్తాను. కేరెక్టర్ బిహేవ్ ఇలా చేయాలనిది తెలుసుకుని వెంటనే చేసేస్తాను.
– నేను ఇప్పటివరకు ఆరు పాత్రలు చేశాను. వేటికవే భిన్నమైనవి. ఆరంభంలోనే నాకు ఇలాంటివి రావడం ఛాలెంజింగ్‌గా అనిపించింది.
– నేను కథలు ఎంపిక చేసుకున్నపుడే నాకు సెట్ కాకపోతే వద్దనుకుంటా. యాక్టర్‌గా ఎదగడానికి ఉపయోగపడే కేరెక్టర్లనరే ఎంపిక చేసుకుంటాను.
– శ్యామ్ సింగరాయ్‌లో చేసిన బోల్డ్ సీన్స్ గురించి ఆలోచించలేదు. కానీ ఆ పాత్రను ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఆందోళన మొదట్లో వుండేది. కానీ ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకోవడంతో మంచి పేరు వచ్చింది.
– నేను పుట్టి పెరిగింది ముంబైలో అయినా కర్నాటకలో ఎక్కువ పెరిగాను. నాకు సంక్రాంతి గురించి పెద్దగా లేదు. దీపావళి బాగా తెలుసు. అమ్మమ్మ ఇంటికి వెళితే అక్కడి పరిస్థితిని బట్టి పండుగలు జరుపుకుంటాను. ఈ సినిమా టైంలో మా ఇంటి చుట్టుపక్కలవారు వచ్చాను. సంక్రాంతి పండుగలా సినిమా వుందని చెప్పారు. సినిమాను ఇక్కడివారు ఎంతగా ప్రేమిస్తారో నాకు అర్థమయింది.
కొత్త సినిమాలు-
ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా చేశాను. తర్వాత మాచర్ల నియోజకవర్గం, రామ్‌తో మరో సినిమా వున్నాయి. లేడీ ఓరియెంటెండ్ కథ ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలో మీకు తెలియజేస్తాను