కృష్ణ భార్గవ్ షార్ట్ ఫిల్మ్ రివ్యూ

Published On: July 28, 2021   |   Posted By:

కృష్ణ భార్గవ్ షార్ట్ ఫిల్మ్ రివ్యూ


మనిషి జీవితంలో తనను అర్థం చేసుకునే వ్యక్తుల కోసం జరిపే అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. అర్థం చేసుకోవడం అంటే ఒక వ్యక్తిలోని అంతర్మధనాన్ని, ఆలోచనలను, ఆవేశాలను, వీటిని కారణమైన అనుభవాలను నిర్ణయాత్మక దష్టితో కాకుండా మానవతా దష్టితో స్వీకరించడం,ప్రాక్టికల్ గా వ్యవరించటం. ఎక్కవసార్లు ఇటువంటి రిలేషన్ చాలా సార్లు ఎంత వెతికినా దొరకదు. ముఖ్యంగా కుటుంబాలలో లభించటం అరుదు. అయితే కృష్ణ భార్గవ్ అనే ఓ కుర్రాడికు లక్కీగా అటువంటి అవకాసం లభించింది. కాకపోతే కొద్దిపాటి అంతర్మధనం, స్వీయ సంఘర్షణ తర్వాత. అవునూ ఈ కృష్ణ భార్గవ్ అంటే..

ఓ సాప్ట్ వేర్ కంపెనీలో పనిచేసే కుర్రాడు. చాలా తెలివైనవాడు. బెస్ట్ ఎంప్లాయి అని ఆఫీస్ లో కీర్తిపబడేవాడు. అంతేనా ప్రక్కనున్నవాళ్లు అడక్కముందే వెళ్లి సాయిం చేసి శభాష్ అనిపించుకునే రకం. ఓ సారి ఆ ప్రయత్నంలో బాస్ (సత్య ప్రసాద్) చేత తిట్లు కూడా తింటాడు. ఆ ఆవేశంలో ఉన్న అతని బ్రెయిన్  అతనికి తన డ్రీమ్ గుర్తు చేస్తుంది. ఉద్యోగంలో చేరక ముందు…తన తండ్రి(ఆనంద్ చక్రపాణి) కి యాక్సిడెంట్ జరగ్గ ముందు .ఇంకా చెప్పాలంటే కుటుంబ బరువు భాధ్యతలు భుజాన ఎత్తుకోకముందు అతనికి స్టార్ట్ అప్ పెట్టాలనే కోరిక…కానీ కుటుంబం ఆర్దిక పరిస్దితులు, తండ్రి ఉద్యోగం చేయలేని పరిస్దితి అతన్ని స్టార్ట్ అప్ దిసగా అడుగులు వెయ్యనివ్వవు. ఆ విషయం తన మనస్సులోనే ఉంచేసుకున్నాడు. కానీ ఈ రోజు అది కెరటంలా  పొంగింది. ఏం చేయాలి. నాన్నకు తెలిస్తే ఏమంటారో…ఈ పరిస్దితుల్లో ఉన్న కృష్ణ భార్గవ్ చివరకు ఏం నిర్ణయం తీసుకున్నాడు. తండ్రి అతనికి సపోర్ట్ చేసాడా..చేస్తే ఏ విధంగా చేసాడు అనేది ఈ షార్ట్  ఫిల్మ్ కథాంశం.

ఇక ఎలా ఉందీ అంటే ప్లాట్ పరంగా … ట్విస్ట్ లు, టర్న్ లు లేకుండా కాస్త ప్లాట్ గా అనిపించినప్పటికీ…నిజాయితీగా దాన్ని ట్రీట్ చేయటం బాగుంది. ముఖ్యంగా తండ్రి,కొడుకుల మధ్య బంధాన్ని ఎస్టాబ్లిష్ చేసే డైలాగులు, నటన పై ప్రత్యేకంగా శ్రద్ద పెట్టారని అర్దమైంది. కొడుకుని అర్దం చేసుకునే తండ్రి, తండ్రి సమస్యను అర్దం చేసుకుని కుటుంబాన్ని భుజాన వేసుకునే కొడుకు…మధ్యలో ప్రపంచంతో పాటు పరుగెట్టాలనే తాపత్రయం ..ఈ కాలం యూత్ ని రిప్రజెంట్ చేసాయి. త్రివిక్రమ్ ని గుర్తు చేసే కొన్ని డైలాగులు, మేకింగ్ స్టైల్ డైరక్టర్ ప్రతిభను మనకు పరిచయం చేస్తుంది. మరీ ముఖ్యంగా స్టార్టప్ ప్రారంభించాలనుకున్న సమయంలో ప్రమోషన్ రావటం స్క్రిప్టులో మంచి మెరుపు. ఎనీవే ఓ మంచి ఫీల్ గుడ్ షార్ట్ ఫిల్మ్..

టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లో ఉంది. కెమెరా వర్క్, ఎడిటింగ్, రీరికార్డింగ్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. నటీనటులు అందరూ బాగా చేసారు. వాళ్లలో ప్రత్యేకంగా కనపడింది మాత్రం ఆనంద్ చక్రపాణి అనటం మాత్రం అతిశయోక్తి కాదు. ఆల్ ది బెస్ట్ టు టీమ్.

నటీనటులు : రావణ్ నిట్టూరు, ఆనంద చక్రపాణి, ధనలక్ష్మి, సత్య ప్రసాద్, రామ్ మారెళ్ళ, పూర్ణ సునీల్
సంగీతం: వినోద్ కుమార్
 
సినిమాటోగ్రఫీ: చౌ. బి

ఎడిటింగ్ : మునేష్ వర్మ, దుర్గం సురేష్

Di: శ్రీను మామిడి

ప్రొడ్యూసర్: ప్రశాంత్ ఎర్రమిల్లి

రచన- దర్శకత్వం – కనక వెంకటేష్.బి